
ముంబై: ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో ఎనిమిది రోజుల కఠిన క్వారంటైన్ నిమిత్తం ముంబై చేరుకున్న టీమిండియా క్రికెటర్లు జిమ్ లో కఠోరంగా శ్రమిస్తున్నారు. అవుట్ డోర్ ప్రాక్టీస్ లేకపోవడంతో ఎక్కువ సమయం జిమ్ లోనే కసరత్తులు చేస్తూ, రోజురోజుకు రాటుదేలుతున్నారు. ఈ క్రమంలో క్రికెటర్లంతా శారీరకంగా ధృడంగా మారుతున్నారు. ఇషాంత్ శర్మ, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, రహానే, ఉమేశ్ యాదవ్, మయాంక్ అగర్వాల్ తదితరులు జిమ్‌లో గంటల కొద్దీ చెమటోడుస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది.
Getting stronger each day! 💪💪#TeamIndia pic.twitter.com/0bZFml1gxL
— BCCI (@BCCI) May 26, 2021
కాగా, క్రికెటర్లతో పాటు ఇంగ్లండ్ కు బయల్దేరనున్న కుటుంబ సభ్యులు, సహాయ సిబ్బంది కూడా బయో బబుల్‌లోకి అడుగుపెట్టారు. వారు కూడా ఎనిమిది రోజుల పాటు కఠిన క్వారంటైన్‌లో ఉంటారు. అనంతరం జూన్ 2న భారత బృందం ప్రత్యేక విమానంలో లండన్ కు బయల్దేరుతుంది. ఈ టూర్‌లో న్యూజిలాండ్ తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు ఆతిథ్య ఇంగ్లీష్ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత జట్టు తలపడుతుంది. జూన్ 8న డబ్ల్యూటీసీ ఫైనల్, ఆగస్ట్ 4 నుంచి సెప్టెంబర్ 14 మధ్యలో ఇంగ్లండ్ తో టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది.
చదవండి: ఆ బౌలర్ ఎప్పటికీ టీమిండియాకు ఆడలేడు..
Comments
Please login to add a commentAdd a comment