
ఎట్టకేలకు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా నెగెటివ్ ఫలితం వచ్చింది. ఫలితంగా అతను ఐసోలేషన్ నుంచి బయటకు వచ్చాడు. ఇంగ్లండ్‌తో ఈనెల 7న మొదలయ్యే పరిమిత ఓవర్ల సిరీస్‌లో బరిలోకి దిగనున్నాడు. లీస్టర్‌షైర్ తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో రెండో రోజు రోహిత్ శర్మ కరోనా బారిన పడ్డాడు. రెండుసార్లు అతనికి పరీక్ష నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దాంతో ఇంగ్లండ్‌తో ఐదో టెస్టుకు దూరమయ్యాడు.