ఇంగ్లండ్‌తో సిరీస్‌.. పలు అరుదైన రికార్డులపై కన్నేసిన రోహిత్‌-విరాట్‌ జోడీ | Rohit Sharma And Virat Kohli Pair Eyes On Rare Partnership Record In England Tour 2022 | Sakshi
Sakshi News home page

IND VS ENG: అరుదైన రికార్డులపై కన్నేసిన రోహిత్‌-విరాట్‌ జోడీ

Published Tue, Jun 21 2022 3:48 PM | Last Updated on Tue, Jun 21 2022 3:48 PM

Rohit Sharma And Virat Kohli Pair Eyes On Rare Partnership Record In England Tour 2022 - Sakshi

ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ జోడీల్లో ఒకటిగా పరిగణించబడే రోహిత్ శర్మ‌-విరాట్‌ కోహ్లి ద్వయం త్వరలో ప్రారంభంకాబోయే ఇంగ్లండ్‌ సిరీస్‌లో పలు అరుదైన రికార్డులపై కన్నేసింది. జులై 1 నుంచి ప్రారంభంకాబోయే ఈ సిరీస్‌లో టీమిండియా తొలుత టెస్ట్‌ మ్యాచ్‌ ఆ తర్వాత టీ20, వన్డే సిరీస్‌లు ఆడనున్న విషయం తెలిసిందే. తరుచూ వ్యక్తిగత రికార్డుల పరంగా రికార్డుల్లోకెక్కే రోహిత్‌, విరాట్‌లు ఇంగ్లండ్‌తో సిరీస్‌లో జంటగా పలు రికార్డులను తమ ఖాతాలో వేసుకోనున్నారు. 

టెస్ట్‌ల్లో ఇప్పటివరకు 940 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన రోహిత్-విరాట్ జోడీ ఇంగ్లండ్‌తో జరుగబోయే టెస్ట్‌లో మరో 60 పరుగులు జోడిస్తే 1000 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకుంటుంది. టీ20ల్లో ఇప్పటివరకు 991 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన రోహిత్-విరాట్ ద్వయం రానున్న సిరీస్‌లో మరో 9 పరుగులు జోడిస్తే పొట్టి ఫార్మాట్‌లో 1000 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకుంటుంది. 

అలాగే వన్డేల్లో ఇప్పటిదాకా 4906 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన ఈ దిగ్గజ బ్యాటింగ్‌ ద్వయం మరో 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పితే వన్డేల్లో 5 వేల పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకుంటుంది. ఈ సిరీస్‌లో రోహిత్‌-విరాట్‌ జోడీ మరో 133 పరుగులు జోడిస్తే రోహిత్-శిఖర్ ధవన్‌ జోడీ పేరిట ఉన్న 5039 పరుగుల రికార్డును అధిగమించి.. వన్డే క్రికెట్‌ చరిత్రలో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన టాప్ 7 జోడీగా నిలుస్తుంది. 

ఈ రికార్డులే కాక టీమిండియా స్టార్‌ జోడీ మరో అరుదైన రికార్డుపై కూడా కన్నేసింది. ఈ జోడీ టెస్టుల్లో, టీ20ల్లో 1000 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకుంటే, మూడు ఫార్మాట్లలో వెయ్యికి పైగా భాగస్వామ్యాలు నెలకొల్పిన మొట్టమొదటి జోడిగా సరికొత్త రికార్డు నెలకొల్పనుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకూ ఏ జోడీ కూడా మూడు ఫార్మాట్లలో 1000కి పైగా పరుగులు జోడించలేదు. 

ఇంగ్లండ్‌ పర్యటనలో టీమిండియా షెడ్యూల్‌ ఇలా ఉంది..

జూన్‌ 24-27 వరకు లీసెస్టర్‌షైర్‌తో నాలుగు రోజుల వార్మప్‌ మ్యాచ్‌
జులై 1-5 వరకు రీషెడ్యూల్డ్‌ టెస్ట్‌ మ్యాచ్‌
జులై 7న తొలి టీ20
జులై 9న రెండో టీ20
జులై 10న మూడో టీ20
జులై 12న తొలి వన్డే
జులై 14న రెండో వన్డే
జులై 17న మూడో వన్డే
చదవండి: రవిచంద్రన్ అశ్విన్ కు కరోనా పాజిటివ్.. తగ్గాకే ఇంగ్లండ్‌కు..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement