
దుబాయ్: ఐపీఎల్‌కు సన్నద్ధమయ్యేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఆటగాళ్లు తొలిసారి కలిసికట్టుగా మైదానంలోకి దిగారు. శుక్రవారం ఆ జట్టు తొలి ప్రాక్టీస్ సెషన్ జరిగింది. ఆరు రోజుల కనీస క్వారంటీన్ సమయం ముగియడంతో ఆర్‌సీబీ సభ్యులంతా సాధన చేశారు. ఉదయం సరదాగా నగరంలో తిరిగొచ్చిన ఆటగాళ్లు సాయంత్రం నెట్స్‌లో శ్రమించారు. యూఏఈ బయల్దేరడానికి ముందు బెంగళూరు టీమ్ ఎలాంటి సన్నాహకాల్లో పాల్గొనలేదు. ఆ జట్టు సభ్యుల్లో దాదాపు ప్రతీ ఒక్కరు వేర్వేరు సమయాల్లో విడిగా వచ్చి సహచరులతో చేరారు. టీమ్ డైరెక్టర్ మైక్ హెసన్ మొదటి సెషన్‌ను పర్యవేక్షించారు. 12 ఐపీఎల్ సీజన్లలో రాయల్ చాలెంజర్స్ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు.