ఇండియన్‌ పండుగ లీగ్‌...   | IPL 2020: First IPL Match Between Mumbai Indians VS Chennai Super Kings | Sakshi
Sakshi News home page

ఇండియన్‌ పండుగ లీగ్‌...  

Published Sat, Sep 19 2020 2:29 AM | Last Updated on Sat, Sep 19 2020 11:07 PM

IPL 2020: First IPL Match Between Mumbai Indians VS Chennai Super Kings - Sakshi

ఐపీఎల్‌ మ్యాచ్‌ అంటే అభిమానులకు ఉరకలెత్తే ఉత్సాహం...మైదానంలో తాము మెచ్చిన జట్టును ప్రోత్సహిస్తూ, తమకు నచ్చిన ఆటగాడి షాట్లకు సలామ్‌ చేస్తూ హోరెత్తిస్తుంటే ఆ మజాయే వేరు... ఇక వేల మంది ప్రేక్షకుల మధ్య బౌండరీ దాటించే ఒక్కో ఫోర్‌కు, గ్యాలరీల్లోకి ‘మీటర్ల లెక్కన’ కొట్టే సిక్సర్లకు ఛాతీ ఉప్పొంగిపోతుంటే క్రీజ్‌లో చెలరేగే బ్యాట్స్‌మన్‌ గర్వాన్ని కొలిచేందుకు ఏ గణాంకాలూ సరిపోవు... అయితే ఇప్పుడు ఆటగాళ్లయినా, అభిమానులైనా ఇలాంటి అనుభూతికి మాత్రం కాస్త కామా పెట్టాల్సిందే... స్టేడియంలో సంగీతాలు, చీర్‌ గాళ్స్‌ లేని ఐపీఎల్‌ ఈసారి మీ ముగింట్లో, మొబైల్‌ ఫోన్లలో మాత్రమే వినిపిస్తుంది, కనిపిస్తుంది.

కరోనా కష్టకాలంలో అన్నీ మారిపోయిన వేళ క్రికెట్‌ కూడా కొత్తగా కనిపించనుంది. ‘బయో బబుల్‌’లో ఇప్పటికే మూడు సిరీస్‌లు జరిగినా... మన ధోని, మన కోహ్లి, మన రోహిత్‌ల ఆట కోసం మొహం వాచిన మన అభిమానులకు మాత్రం ఇప్పుడే పండగొచ్చినట్లు. ముంబై ‘ఐదు’పై గురి పెడితే... చెన్నై ‘ఫోర్‌’ కోసం శ్రమిస్తోంది. కోల్‌కతా, హైదరాబాద్, రాజస్తాన్‌ తమ ట్రోఫీ సంఖ్యలో మరొకటి పెంచుకోవాలని పట్టుదలగా ఉండగా... ఈ సారైనా ‘సారీ’ చెప్పకూడదని బెంగళూరు భావిస్తోంది.

ఇక ‘ఒక్క విజయం’ అంటూ పోరాడుతూనే ఉన్న ఢిల్లీ, పంజాబ్‌ మళ్లీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. రావడంలో కొంత ఆలస్యం కావచ్చేమోగానీ రావడం మాత్రం ఖాయం అంటూ ప్రతికూల పరిస్థితుల్లోనూ వచ్చిన ఐపీఎల్‌ నిశ్శబ్ద వేదికలో సమరానికి సిద్ధమైంది. పుష్కర కాలంగా మండు వేసవిలో మంచులాంటి వినోదాన్ని అందిస్తూ వచ్చిన లీగ్‌ సీజన్‌ మారినా సినిమాలు లేని, షికార్లు లేని స్థితిలో సూపర్‌ హిట్‌ కావడం మాత్రం ఖాయం.  

ఐపీఎల్‌ సంప్రదాయం ప్రకారం ఈసారీ తొలి మ్యాచ్‌ గత సీజన్‌ ఫైనలిస్ట్‌ జట్ల (ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌ కింగ్స్‌) మధ్య పోరుతో మొదలుకానుంది. ఐపీఎల్‌ చరిత్రలో ఈ రెండు జట్లు తలపడనుండటం ఇది 29వ సారి కావడం విశేషం. చెన్నైతో ముఖాముఖి రికార్డులో రోహిత్‌ శర్మ బృందం 17 మ్యాచ్‌ల్లో గెలుపొందగా... ధోని దళం 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.   

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 
అత్యుత్తమ ప్రదర్శన: 3 సార్లు (2009, 2011, 2016) రన్నరప్‌ 
జట్టు వివరాలు: విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), మొహమ్మద్‌ సిరాజ్, షహబాజ్‌ అహ్మద్, పార్థివ్‌ పటేల్, యజువేంద్ర చహల్, నవదీప్‌ సైనీ, పవన్‌ నేగి, దేవ్‌దత్‌ పడిక్కల్, శివమ్‌ దూబే, ఉమేశ్‌ యాదవ్, గుర్‌కీరత్‌ సింగ్, వాషింగ్టన్‌ సుందర్, పవన్‌ దేశ్‌పాండే (భారత ఆటగాళ్లు). క్రిస్‌ మోరిస్, జోష్‌ ఫిలిప్, మొయిన్‌ అలీ, ఆరోన్‌ ఫించ్, ఏబీ డివిలియర్స్, ఇసురు ఉదాన, డేల్‌ స్టెయిన్, ఆడమ్‌ జంపా(విదేశీ ఆటగాళ్లు). 

ముంబై ఇండియన్స్‌ 
అత్యుత్తమ ప్రదర్శన: 4 సార్లు (2013, 2015, 2017, 2019) చాంపియన్‌ 
జట్టు వివరాలు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), దిగ్విజయ్‌ దేశ్‌ముఖ్, ఆదిత్య తారే, సౌరభ్‌ తివారి, జస్‌ప్రీత్‌ బుమ్రా, ధవల్‌ కులకర్ణి, జయంత్‌ యాదవ్, సూర్యకుమార్‌ యాదవ్, కృనాల్‌ పాండ్యా, రాహుల్‌ చహర్, హార్దిక్‌ పాండ్యా, అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్, మొహసిన్‌ ఖాన్, బల్వంత్‌రాయ్‌ సింగ్, అనుకూల్‌ రాయ్, ఇషాన్‌ కిషన్‌ (భారత ఆటగాళ్లు). క్వింటన్‌ డి కాక్, జేమ్స్‌ ప్యాటిన్సన్, నాథన్‌ కూల్టర్‌ నీల్, ట్రెంట్‌ బౌల్ట్, పొలార్డ్, క్రిస్‌ లిన్, షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్, మెక్లీనగన్‌ (విదేశీ ఆటగాళ్లు). 

చెన్నై సూపర్‌ కింగ్స్‌  
అత్యుత్తమ ప్రదర్శన: 3 సార్లు (2010, 2011, 2018) చాంపియన్‌ 
జట్టు వివరాలు: మహేంద్ర సింగ్‌ ధోని (కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్, అంబటి రాయుడు, మురళీ విజయ్, కేదార్‌ జాదవ్, రవీంద్ర జడేజా, దీపక్‌ చహర్, పీయూష్‌ చావ్లా, నారాయణ్‌ జగదీశన్, కేఎం ఆసిఫ్, శార్దుల్‌ ఠాకూర్, సాయికిషోర్, మోను కుమార్, కరణ్‌ శర్మ (భారత ఆటగాళ్లు). ఇమ్రాన్‌ తాహిర్, లుంగి ఇన్‌గిడి, షేన్‌ వాట్సన్, మిషెల్‌ సాన్‌ట్నర్, ఫాఫ్‌ డు ప్లెసిస్, డ్వేన్‌ బ్రేవో, జోష్‌ హాజల్‌వుడ్, స్యామ్‌ కరన్‌ (విదేశీ ఆటగాళ్లు).

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 
అత్యుత్తమ ప్రదర్శన: 2 సార్లు (2012, 2014) చాంపియన్‌  
జట్టు వివరాలు: దినేశ్‌ కార్తీక్‌ (కెప్టెన్‌), శివమ్‌ మావి, సందీప్‌ వారియర్, కుల్దీప్‌ యాదవ్, నిఖిల్‌ నాయక్, సిద్ధార్థ్, ప్రసిధ్‌ కృష్ణ, శుబ్‌మన్‌ గిల్, నితీశ్‌ రాణా, సిద్దేశ్‌ లాడ్, కమలేశ్‌ నాగర్‌కోటి, రింకూ సింగ్, వరుణ్‌ చక్రవర్తి, రాహుల్‌ త్రిపాఠి (భారత ఆటగాళ్లు). మోర్గాన్, ప్యాట్‌ కమిన్స్, సునీల్‌ నరైన్,  రసెల్, లోకీ ఫెర్గూసన్, అలీఖాన్, టామ్‌ బాంటన్, క్రిస్‌ గ్రీన్‌ (విదేశీ ఆటగాళ్లు). 

రాజస్తాన్‌ రాయల్స్‌  
అత్యుత్తమ ప్రదర్శన: ఒకసారి (2008) చాంపియన్‌ 
జట్టు వివరాలు:  స్టీవ్‌ స్మిత్‌ (కెప్టెన్‌), బెన్‌ స్టోక్స్, ఆండ్రూ టై, ఒషాన్‌ థామస్, జోఫ్రా ఆర్చర్, డేవిడ్‌ మిల్లర్, జాస్‌ బట్లర్, టామ్‌ కరన్‌ (విదేశీ ఆటగాళ్లు). సంజు శామ్సన్, కార్తీక్‌ త్యాగి, అంకిత్‌ రాజ్‌పుత్, శ్రేయస్‌ గోపాల్, రాహుల్‌ తేవటియా, ఉనాద్కట్, మయాంక్‌ మర్కండే, మహిపాల్‌ లోమ్రోర్, రియాన్‌ పరాగ్, యశస్వి జైస్వాల్, అనూజ్‌ రావత్, ఆకాశ్‌ సింగ్, మనన్‌ వోహ్రా, శశాంక్‌ సింగ్, వరుణ్‌ ఆరోన్, రాబిన్‌ ఉతప్ప, అనిరుధ జోషి (భారత ఆటగాళ్లు) 

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 
అత్యుత్తమ ప్రదర్శన: ఒకసారి (2016) చాంపియన్‌ 
జట్టు వివరాలు: డేవిడ్‌ వార్నర్‌ (కెప్టెన్‌), రషీద్‌ ఖాన్, మిషెల్‌ మార్‌‡్ష, మొహహ్మద్‌ నబీ, ఫాబియాన్‌ అలెన్, బిల్లీ స్టాన్‌లేక్, కేన్‌ విలియమ్సన్, బెయిర్‌స్టో (విదేశీ ఆటగాళ్లు). వృద్ధిమాన్‌ సాహా, సంజయ్‌ యాదవ్, ఖలీల్‌ అహ్మద్, సందీప్‌ శర్మ, అబ్దుల్‌ సమద్, శ్రీవత్స్‌ గోస్వామి, అభిషేక్‌ శర్మ, బాసిల్‌ థంపి, సందీప్‌ బావనక, భువనేశ్వర్, విరాట్‌ సింగ్, టి. నటరాజన్, షహబాజ్‌ నదీమ్, మనీశ్‌ పాండే, విజయ్‌ శంకర్, సిద్ధార్థ్‌ కౌల్, ప్రియమ్‌ గార్గ్‌ (భారత ఆటగాళ్లు)

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 
అత్యుత్తమ ప్రదర్శన: ఒకసారి (2014) రన్నరప్‌ 
జట్టు వివరాలు: కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), హర్‌ప్రీత్‌ బ్రార్, ఇషాన్‌ పొరెల్, మన్‌దీప్‌ సింగ్, తజీందర్‌ సింగ్, కరుణ్‌ నాయర్, దీపక్‌ హుడా, రవి బిష్ణోయ్, అర్‌‡్షదీప్‌ సింగ్, సర్ఫరాజ్‌ ఖాన్, మయాంక్‌ అగర్వాల్, మొహమ్మద్‌ షమీ, దర్శన్‌ నల్‌కండే, మురుగన్‌ అశ్విన్, జగదీశ్‌ సుచిత్, కృష్ణప్ప గౌతమ్, సిమ్రన్‌ సింగ్‌ (భారత ఆటగాళ్లు). జిమ్మీ నీషమ్, క్రిస్‌ జోర్డాన్, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్, ముజీబ్‌ ఉర్‌ రహమాన్, షెల్డన్‌ కాట్రెల్, నికోలస్‌ పూరన్, క్రిస్‌ గేల్, హార్దర్‌ విలోన్‌ (విదేశీ ఆటగాళ్లు). 

ఢిల్లీ క్యాపిటల్స్‌
అత్యుత్తమ ప్రదర్శన: రెండుసార్లు (2012, 2019) మూడో స్థానం
జట్టు వివరాలు: శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), ఇషాంత్‌ శర్మ, అజింక్య రహానే, రవిచంద్రన్‌ అశ్విన్, శిఖర్‌ ధావన్, మోహిత్‌ శర్మ, పృథ్వీ షా, లలిత్‌ యాదవ్, అవేశ్‌ ఖాన్, అక్షర్‌ పటేల్, తుషార్‌ దేశ్‌పాండే, రిషభ్‌ పంత్, హర్షల్‌ పటేల్, అమిత్‌ మిశ్రా (భారత ఆటగాళ్లు). కగిసో రబడ, మార్కస్‌ స్టొయినిస్, సందీప్‌ లమిచానే, షిమ్రాన్‌ హెట్‌మైర్, డానియెల్‌ స్యామ్స్, అలెక్స్‌ క్యారీ, అన్రిచ్‌ నోర్జే, కీమోపాల్‌ (విదేశీ ఆటగాళ్లు).

అంకెల్లో ఐపీఎల్‌...
అత్యధిక పరుగులు :  విరాట్‌ కోహ్లి (5,412) 
అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు:  క్రిస్‌ గేల్‌ (175 నాటౌట్‌) 
ఎక్కువ సిక్సర్లు: క్రిస్‌ గేల్‌ (326) 
ఎక్కువ ఫోర్లు : శిఖర్‌ ధావన్‌ (524) 
ఎక్కువ సెంచరీలు : క్రిస్‌ గేల్‌ (6)  
ఎక్కువ అర్ధ సెంచరీలు : డేవిడ్‌ వార్నర్‌ (44)  
అత్యుత్తమ స్ట్రయిక్‌ రేట్‌ : ఆండ్రీ రసెల్‌ (186.41)  
ఒక ఇన్నింగ్స్‌లో ఎక్కువ సిక్సర్లు : క్రిస్‌ గేల్‌ (17)  
వేగవంతమైన అర్ధ సెంచరీ : కేఎల్‌ రాహుల్‌ (14 బంతుల్లో)   
ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు : విరాట్‌ కోహ్లి (973 – 2016లో)

ఎక్కువ వికెట్లు : లసిత్‌ మలింగ (170) 
ఎక్కువ హ్యాట్రిక్‌లు: అమిత్‌ మిశ్రా (3)
అత్యుత్తమ బౌలింగ్‌ : అల్జారీ జోసెఫ్‌ (6/12) 
అత్యుత్తమ సగటు : కగిసో రబడ (17.93) 
అత్యుత్తమ ఎకానమీ : రషీద్‌ ఖాన్‌ (6.55) 
ఎక్కువ ‘డాట్‌’ బంతులు : హర్భజన్‌ సింగ్‌ (1,249)  
ఒక సీజన్‌లో అత్యధిక వికెట్లు : డ్వేన్‌ బ్రేవో (32 – 2013లో)  
ఒక మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌ : బాసిల్‌ థంపి (70)

అత్యధిక స్కోరు: 263/5 (బెంగళూరు – పుణే వారియర్స్‌పై) 
అత్యల్ప స్కోరు : 49 (బెంగళూరు – కోల్‌కతాపై)  
అతి పెద్ద విజయం : ముంబై 146 పరుగులతో ఢిల్లీపై  
ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన జట్టు : ముంబై ఇండియన్స్‌ (107)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement