Ind Vs SA 2021: Dravid Gives Kohli Batting Tips During Practice Session Ahead 1st Test - Sakshi
Sakshi News home page

IND vs SA: కోహ్లి సుధీర్ఘ బ్యాటింగ్‌.. ద్రవిడ్‌ సలహాలు;  వీడియో వైరల్‌

Published Sun, Dec 19 2021 12:42 PM | Last Updated on Sun, Dec 19 2021 1:58 PM

Dravid Gives Kohli Batting Tips During Practice Session AHead 1st Test - Sakshi

Coach Rahul Dravid Batting Tips To Test Captain Virat Kohli.. డిసెంబర్‌ 26 నుంచి సౌతాఫ్రికాతో తొలి టెస్టు జరగనున్న నేపథ్యంలో టీమిండియా తమ ప్రాక్టీస్‌లో జోరు పెంచింది. కోహ్లి నాయకత్వంలోని టీమిండియా సఫారీ జట్టుపై ఆధిపత్యం ప్రదర్శించి సిరీస్‌ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ టీమిండియా ప్రాక్టీస్‌కు సంబంధించి ఆదివారం ట్విటర్‌ వేదికగా ఒక వీడియోనూ రిలీజ్‌ చేసింది. తొలి టెస్టు జరగనున్న సూపర్‌స్పోర్ట్స్‌ పార్క్‌కు బస్‌లు బయలుదేరిన ఫోటోలు షేర్‌ చేసింది.

చదవండి: Kohli-Ganguly: విరాట్‌ కోహ్లిపై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆ తర్వాత మైదానంలో అడుగుపెట్టిన క్రికెటర్లు ప్రాక్టీస్‌కు ముందు వార్మప్‌ సెషన్‌ కింద జాగింగ్‌, స్ట్రెచింగ్‌ లాంటివి చేశారు. ఇదే సమయంలో కోహ్లి బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా.. హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అతనికి సలహాలు ఇవ్వడం వైరల్‌గా మారింది. ఇక న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌కు దూరంగా ఉన్న బుమ్రా, షమీలు నెట్స్‌లో బౌలింగ్‌ చేశారు.

చదవండి: Steve Smith: 'అర్ధరాత్రి పడుకోకుండా ఇదేం పని బాబు'.. వీడియో వైరల్‌

వీరితోపాటు ఇషాంత్‌ శర్మ, వెటరన్‌ స్పిన్నర్‌ అశ్విన్‌లు కూడా సుధీర్ఘంగా బౌలింగ్‌ చేశారు. ఇక చివరగా ప్రాక్టీస్‌ ముగించిన కోహ్లి థంప్సమ్‌ సింబల్‌ ఇవ్వడంతో​ ఉదయం ప్రాక్టీస్‌ సెషన్‌ ముగిసినట్లు బీసీసీఐ పేర్కొంది. ''సౌతాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌కు సిద్ధంగా ఉన్నాం.. తొలి ప్రాక్టీస్‌ సెషన్‌కు సంబంధించిన స్నిపెట్స్‌పై ఒక లుక్కేయండి'' అంటూ కామెంట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement