భారత్‌ను గెలిపించిన పూనమ్‌  | India Women Cricket Team Won Against West Indies In Practice Session | Sakshi
Sakshi News home page

భారత్‌ను గెలిపించిన పూనమ్‌ 

Published Wed, Feb 19 2020 1:55 AM | Last Updated on Wed, Feb 19 2020 1:55 AM

India Women Cricket Team Won Against West Indies In Practice Session - Sakshi

బ్రిస్బేన్‌: టి20 ప్రపంచకప్‌ సన్నాహాల్లో భాగంగా మంగళవారం జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 2 పరుగుల తేడాతో మాజీ చాంపియన్‌ వెస్టిండీస్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. శిఖా పాండే (16 బంతుల్లో 24 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, దీప్తి శర్మ (21) మోస్తరు స్కోరు సాధించింది. అనంతరం విండీస్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 105 పరుగులే చేయగలిగింది. లీ ఆన్‌ కిర్బీ (41 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), హేలీ మాథ్యూస్‌ (25) రాణించారు. పూనమ్‌ యాదవ్‌ 20 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. మ్యాచ్‌ చివరి ఓవర్లోనే పూనమ్‌ 2 వికెట్లు తీసి భారత్‌ను గెలిపించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement