భారత్, కివీస్‌ జట్ల ప్రాక్టీస్‌ రద్దు | India-New Zeland Practice Session Abonded Due To Heavy Rain | Sakshi
Sakshi News home page

IND vs NZ: భారత్, కివీస్‌ జట్ల ప్రాక్టీస్‌ రద్దు

Published Thu, Dec 2 2021 8:04 AM | Last Updated on Thu, Dec 2 2021 8:10 AM

India-New Zeland Practice Session Abonded Due To Heavy Rain - Sakshi

ముంబై: భారత్, న్యూజిలాండ్‌ మధ్య జరిగే రెండో టెస్టు సన్నాహాలకు అవాంతరం ఏర్పడింది. ముంబైలో భారీ వర్షం కారణంగా బుధవారం ఇరు జట్ల ప్రాక్టీస్‌ రద్దయింది. శుక్రవారం నుంచి వాంఖెడే స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుండగా, వాతావరణం అనుకూలిస్తే భారత్, కివీస్‌  క్రికెటర్లు గురువారం సాధన చేసే అవకాశముంది. మరో వైపు వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా ఈ టెస్టులో ఆడతాడా లేదా అనే విషయంపై మ్యాచ్‌ సమయానికే నిర్ణయం తీసుకుంటామని భారత బౌలింగ్‌ కోచ్‌ పారస్‌ మాంబ్రే అన్నాడు. మెడ పట్టేయడంతో తొలి టెస్టులో చాలా భాగం సాహా వికెట్‌ కీపింగ్‌కు దూరంగా ఉన్నాడు. సాహా స్థానంలో శ్రీకర్‌ భరత్‌ సబ్‌స్టిట్యూట్‌గా వ్యవహరించాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement