టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌కు తన ప్రయాణం ఆరంభంలోనే మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. అతడి నేతృత్వంలోనే దాదాపు రెండు దశాబ్దాల తర్వాత శ్రీలంకపై వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత జట్టు.. తాజాగా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో తొలిసారి వైట్ వాష్‌కు గురై ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది.
దీంతో గంభీర్‌కు అందరికి టార్గెట్‌గా మారాడు. గంభీర్ లేనిపోని ప్రయోగాల కారణంగానే భారత్ ఓడిపోయిందని పలువురు మాజీలు కూడా విమర్శించారు. అదేవిధంగా ఈ ఘెర ఓటములపై బీసీసీఐ కూడా గంభీర్ నుంచి వివరణ కోరినట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రూపంలో గంభీర్‌కు మరో కఠిన సవాలు ఎదురుకానుంది. బీజీటీలో భాగంగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియాకు పయనం కానుంది. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
అదే జరిగితే గంభీర్ పోస్ట్ ఊస్టింగ్!?
భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే బీజీటీలో ఆసీస్‌ను 4-0 తేడాతో ఓడించాలి. అయితే హెడ్‌కోచ్ గౌతం గంభీర్ భవితవ్యం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫలితాలపై ఆధారపడినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ ట్రోఫీలో భారత్ పేలవ ప్రదర్శన కనబరిచినట్లయితే టెస్టు జట్టు ప్రధాన కోచ్ పదవి నుంచి గంభీర్‌ను తప్పించాలని బీసీసీఐ భావిస్తుందంట.
దైనిక్ జాగరణ్ రిపోర్ట్ ప్రకారం.. రెడ్ బాల్ క్రికెట్ కోసం ప్రత్యేకంగా కోచింగ్ స్టాప్‌ను నియమించాలని బీసీసీఐ పెద్దలు యోచిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అదే జరిగితే భారత టెస్టు హెడ్‌కోచ్‌గా మాజీ క్రికెటర్ వీవీయస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టే అవకాశముంది. లక్ష్మణ్ ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టు తాత్కాలిక హెడ్‌కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
చదవండి: IND vs SA: సంజూతో గొడవ పడ్డ సౌతాఫ్రికా ప్లేయర్.. ఇచ్చిపడేసిన సూర్య! వీడియో
Comments
Please login to add a commentAdd a comment