స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియా బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతోంది. తొలి రెండు టెస్టుల్లో నిరాశపరిచిన భారత బ్యాటర్లు.. ఇప్పుడు వాంఖడే వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టులో అదే తీరును కనబరిచారు.
శుబ్‌మన్ గిల్(90), రిషబ్ పంత్(60),సుందర్(38) మినహా మిగతా అందరూ విఫలమయ్యారు. దీంతో టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగుల నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్‌కోచ్ గౌతం గంభీర్ తీసుకున్న పలు నిర్ణయాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా మిడిలార్డర్ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్ ఆర్డర్ మార్చడాన్ని చాలా మంది మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. ముంబై టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్‌ను ఏకంగా 8వ స్ధానంలో బ్యాటింగ్‌కు టీమిండియా మెన్‌జెమెంట్ పంపించింది.
అంతకంటే ముందు సర్ఫరాజ్ స్ధానంలో మొదటి రోజు ఆటలో మహ్మద్ సిరాజ్‌ను నైట్ వాచ్‌మెన్‌గా ప్రమోట్ చేసింది. కానీ సిరాజ్ తొలి బంతికే పెవిలియన్‌కు చేరాడు. రెండో రోజు ఆటలో కూడా సర్ఫరాజ్‌ను ముందుగా బ్యాటింగ్‌కు పంపలేదు. అతడి కంటే ముందు పంత్, జడేజాలను జట్టు మెన్‌జెమెంట్ బ్యాటింగ్‌కు పంపిచారు.
ఇక 8వ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సర్ఫరాజ్.. ఆజాజ్ పటేల్ బౌలింగ్‌లో ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో రోహిత్, గంభీర్‌లపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తీవ్ర విమర్శలు చేశాడు.
అదొక చెత్త నిర్ణయం..
"సర్ఫరాజ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడు తన మొదటి మూడు టెస్టుల్లో మూడు అర్ధశతకాలు సాధించాడు. బెంగుళూరు టెస్టులో సూపర్ సెంచరీ(150)తో చెలరేగాడు. స్పిన్‌కు అద్భుతంగా ఆడుతున్నాడు.
రైట్ అండ్ లెఫ్ట్ కాంబనేషన్‌ను కొనసాగించడానికి అతడిని డిమోట్ చేశారా? అతడి బ్యాటింగ్ ఆర్డర్‌ను ఎందుకు మార్చారు? ఈ విషయం నాకు ఇప్పటికీ ఆర్ధం కావడం లేదు. ఏకంగా అతడిని 8వ స్ధానానికి నెట్టేశారు. ఏమైనప్పటికీ భారత జట్టు మెన్‌జెమెంట్ ఓ చెత్త నిర్ణయం తీసుకుందని ఎక్స్‌లో మంజ్రేకర్ మండి పడ్డాడు.
చదవండి: విధ్వంసకర ఇన్నింగ్స్.. భారత తొలి క్రికెటర్‌గా పంత్ రికార్డు
Comments
Please login to add a commentAdd a comment