సొంతగడ్డపై టీమిండియాకు న్యూజిలాండ్ చేతిలో ఊహించని పరాభవం ఎదురైంది. ఒకటి కాదు రెండు కాదు మొత్తంగా మూడు మ్యాచుల్లోనూ ఓడి.. వైట్ వాష్‌కు గురైంది. ముంబై వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో 147 పరుగుల టార్గెట్ ను కూడా టీమిండియా ఛేజ్ చేయలేకపోయింది. దీంతో 25 పరుగుల తేడాతో భారత జట్టు ఓటమి పాలైంది.
పంత్(64) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. లేదంటే భారత్ కనీసం 100 పరుగుల మార్క్ కూడా దాటలేకపోయింది. కాగా స్వదేశంలో రెండు కంటే ఎక్కువ టెస్టుల్లో టీమిండియా ఇలా వైట్ వాష్ కావడం చరిత్రలోనే తొలిసారి. ఇక ఈ ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. తమ ఓటమికి కారణం బ్యాటింగ్ వైఫల్యమేనని శర్మ అంగీకరించాడు.
పూర్తి బాధ్యత నాదే: రోహిత్ శర్మ
"ఈ పరాజయాన్ని జీర్ణించుకోవడం కష్టం. నా కెరీర్‌లో ఇదే అధమ దశ. టెస్టు సిరీస్ పరాజయానికి కెప్టెన్‌గా పూర్తి బాధ్యత నాదే. జట్టుగా అత్యుత్తమ ప్రదర్శన చేయలేకపోయాం. గెలుస్తామనుకున్న మ్యాచ్‌ను కోల్పోయాం. మా స్థాయికి తగ్గ క్రికెట్‌ను ఆడలేదు. బెంగళూరు, పుణే టెస్టుల్లో మొదటి ఇన్నింగ్స్‌ల్లో తగిన స్కోర్లు చేయలేక వెనుకబడ్డాం.
మూడో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించి కూడా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేకపోవడం బాధిస్తోంది. బ్యాటర్‌గా మెరుగైన ప్రదర్శన చేయలేకపోయా. సారథిగానూ జట్టును విజయం దిశగా నడిపించలేకపోయా. న్యూజిలాండ్ జట్టు మెరుగైన ప్రదర్శన కనబర్చింది. బ్యాటింగ్‌కు క్లిష్టతరమైన పిచ్‌పై యువ ఆటగాళ్లు శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్ చక్కటి ప్రదర్శన కనబర్చారు.
ఇక నా దృష్టి అంతా ఆ్రస్టేలియా సిరీస్‌పైనే. దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది పక్కన పెట్టి ఆసీస్‌పై మెరుగైన ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తాం. గత రెండు పర్యటనల్లోనూ ఆసీస్‌పై సిరీస్‌లు గెలిచాం. ఈసారి కూడా మెరుగైన ఆటతీరు కనబరుస్తామనే నమ్మకముంది అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రోహిత్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs NZ: స్వయంకృతమే.. భారత సీనియర్ ఆటగాళ్ల ఘోరవైఫల్యం
Comments
Please login to add a commentAdd a comment