జోరుగా సాగుతున్న టీమిండియా ప్రాక్టీస్‌.. వీడియో | IND VS BAN: Team India Practicing Hardly At Chepauk Stadium | Sakshi
Sakshi News home page

జోరుగా సాగుతున్న టీమిండియా ప్రాక్టీస్‌.. వీడియో

Published Sun, Sep 15 2024 4:07 PM | Last Updated on Sun, Sep 15 2024 5:01 PM

IND VS BAN: Team India Practicing Hardly At Chepauk Stadium

చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరుగబోయే తొలి టెస్ట్‌కు ముందు టీమిండియా ప్రాక్టీస్‌లో బిజీగా గడుపుతుంది. భారత ఆటగాళ్లంతా నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తున్నారు. టీమిండియా ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేసింది. కుల్దీప్‌, సిరాజ్‌, బుమ్రా, ఆకాశ్‌దీప్‌, యశ్‌ దయాల్‌, రిషబ్‌ పంత్‌, కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌, విరాట్‌ కోహ్లి, అక్షర్‌ పటేల్‌, ధృవ్‌ జురెల్‌, అశ్విన్‌, జడేజా, యశస్వి, గిల్‌ ఈ వీడియోలో ఉన్నారు. హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ టీమిండియాకు సలహాలు, సూచనలు ఇస్తూ కనిపించాడు. కెప్టెన్‌ రోహిత్‌ సహచరులతో గేమ్‌ ప్లాన్స్‌ డిస్కస్‌ చేస్తున్నాడు.

కాగా, చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య తొలి టెస్ట్‌ ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ కోసం భారత జట్టు వారం రోజుల ముందుగానే ప్రాక్టీస్‌ షూరు చేసింది. భారత ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు. బంగ్లాతో సిరీస్‌ను టీమిండియా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. బంగ్లాదేశ్‌ ఇటీవలే పాకిస్తాన్‌ను వారి సొంతగడ్డపైనే ఘోరంగా ఓడించింది. ఈ కారణంగానే భారత్‌ బంగ్లాదేశ్‌ను లైట్‌గా తీసుకోదలచుకోలేదు. టీమిండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. బంగ్లాదేశ్‌ తమదైన రోజున అద్భుతాలు చేయగలదు.

ఇదిలా ఉంటే, రెండు టెస్ట్‌ మ్యాచ్‌లు, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం బంగ్లాదేశ్‌ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లలోని తొలి టెస్ట్‌ చెన్నై వేదికగా, రెండో టెస్ట్‌ కాన్పూర్‌ వేదికగా జరుగనున్నాయి. రెండో టెస్ట్‌ సెప్టెంబర్‌ 27న మొదలవుతుంది. మూడు టీ20లు గ్వాలియర్‌, ఢిల్లీ, హైదరాబాద్‌ వేదికలుగా అక్టోబర్‌ 6, 9, 12 తేదీల్లో జరుగనున్నాయి. టీమిండియాతో రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల కోసం బంగ్లాదేశ్‌ జట్టును ప్రకటించింది. టీమిండియా మాత్రం తొలి టెస్ట్‌కు మాత్రమే జట్టును ప్రకటించింది.

టీమిండియాతో టెస్ట్‌ సిరీస్‌కు బంగ్లాదేశ్‌ జట్టు..
నజ్ముల్‌ హొస్సేన్‌ షాంటో​ (కెప్టెన్‌), షద్మాన్‌ ఇస్లాం, మహ్మదుల్‌ హసన్‌ జాయ్‌, మొమినుల్‌ హక్‌, షకీబ్‌ అల్‌ హసన్‌, మెహిది హసన్‌ మీరజ్‌, ముష్ఫికర్‌ రహీం, లిట్టన్‌ దాస్‌, జాకిర్‌ అలీ, జాకిర్‌ హసన్‌, హసన్‌ మహమూద్‌, ఖలీద్‌ అహ్మద్‌, నహిద్‌ రాణా, నయీమ్‌ హసన్‌, తైజుల్‌ ఇస్లాం, తస్కిన్‌ అహ్మద్‌

తొలి టెస్ట్‌కు భారత జట్టు..
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, సర్ఫరాజ్‌ ఖాన్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కేఎల్‌ రాహుల్‌, ధృవ్‌ జురెల్‌, రిషబ్‌ పంత్‌, మొహమ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌, ఆకాశ్‌దీప్‌, యశ్‌ దయాల్‌, జస్ప్రీత్‌ బుమ్రా

చదవండి: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ.. విజేత ఎవ‌రో చెప్పేసిన షమీ!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement