ప్రాక్టీస్‌ సెషన్..‌ ఒకరినొకరు తోసుకున్నారు.. | BCCI Shares Team India Players Fun Drill Becomes Viral Before First Test | Sakshi
Sakshi News home page

వైరల్‌ : ఒకరినొకరు తోసుకున్న టీమిండియా ఆటగాళ్లు

Published Wed, Dec 16 2020 12:28 PM | Last Updated on Wed, Dec 16 2020 3:11 PM

BCCI Shares Team India Players Fun Drill Becomes Viral Before First Test - Sakshi

అడిలైడ్‌ : ఆసీస్‌తో టెస్టు సిరీస్‌ ప్రారంభానికి ఇంకా ఒక్కరోజే మిగిలి ఉన్న నేపథ్యంలో భారత ఆటగాళ్ల ప్రాక్టీస్‌ సెషన్‌ వీడియో వైరల్‌గా మారింది. అడిలైడ్‌ వేదికగా జరగనున్న తొలి టెస్టుకు ముందు టీమిండియా ఆటగాళ్లు తీవ్ర కసరత్తులు చేశారు. దీనిలో భాగంగా  భారత ఫిజియో టీమ్‌ టీమిండియా ఆటగాళ్లతో కొన్ని యాక్టివిటీస్‌ను చేయించింది. మొదటి యాక్టివిటీలో ఆటగాళ్ల మధ్య కుస్తీ పోటీలు నిర్వహించారు. రెండో యాక్టివిటీ సెషన్‌లో క్యాచ్‌లను ప్రాక్టీస్‌ చేయించారు. ఈ సెషన్‌లో టీమిండియా ఆటగాళ్లు ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించడానికి ప్రయత్నించారు.  ఇక మూడో యాక్టివిటీలో ఇద్దరు ఆటగాళ్లను ఒక జంటగా విడదీసి కింద క్యాప్‌ను పెట్టి ఎవరు ముందుగా అందుకుంటే వారు గెలిచినట్లు లెక్క. టీమిండియా ఆటగాళ్ల యాక్టివిటీస్‌ను బీసీసీఐ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది.(చదవండి : ఒక్క మ్యాచ్‌.. రెండు రికార్డులు)

'సరదాగా ఎవరైనా డ్రిల్ చేయాలని భావిస్తున్నారా..అయితే  నెట్‌సెషన్‌కు ముందు స్ట్రాంగ్‌గా ఉండాలంటే మీ బ్యాటరీలను ఛార్జ్ చేయాల్సిందే' అంటూ క్యాప్షన్‌ జత చేసింది. కాగా తొలి టెస్టు అడిలైడ్‌ వేదికగా డే నైట్‌ పద్దతిలో జరగనుంది. టీ20 సిరీస్‌ గెలిచి ఉత్సాహంతో ఉన్న టీమిండియా విజయంతో సిరీస్‌ను ఆరంభించాలని భావిస్తుంటే.. మరోవైపు గాయాలతో సతమతవుతున్న ఆసీస్‌ మొదటి టెస్టులోనే ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తుంది. (చదవండి : 'క్షమించండి.. మళ్లీ రిపీట్‌ కానివ్వను')

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement