టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ ఫేలవమైన ఫామ్ కనబరుస్తన్నాడు. గత నెలలో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో డబుల్ సెంచరీతో ఆకట్టుకున్న ఇషాన్ కిషన్ మళ్లీ అదే బ్యాటింగ్‌ను పునరావృతం చేయలేకపోతున్నాడు. లంకతో టి20 సిరీస్ ఆడిన ఇషాన్ కిషన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత కివీస్‌తో వన్డే సిరీస్‌లోనూ అదే చెత్త ప్రదర్శనను కంటిన్యూ చేసిన ఇషాన్ టి20 మ్యాచ్‌ల్లోనూ పరుగులు చేయలేకపోతున్నాడు.
ముఖ్యంగా చివరి 13 టి20 కలిపి ఇషాన్ కిషన్ 15.30 సగటుతో 199 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క అర్థసెంచరీ కూడా లేదు. దీంతో ఇషాన్ కిషన్‌పై విమర్శల పర్వం మొదలైంది. జట్టు నుంచి అతన్ని పక్కకు తొలగించి ఆ స్థానంలో పృథ్వీ షాకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. న్యూజిలాండ్‌తో మూడో టి20లో ఇషాన్ కిషన్ స్థానంలో పృథ్వీ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌ను విమర్శిస్తూ ట్విటర్‌లో అభిమానులు ట్రోల్స్, మీమ్స్‌తో రెచ్చిపోయారు.
తాజాగా టీమిండియా క్రికెటర్, కేకేఆర్ స్టార్ నితీశ్ రాణా.. ట్విటర్‌లో ఇషాన్ కిషన్ గత 13 మ్యాచ్‌ల్లో చేసిన స్కోర్లను విమర్శిస్తూ ఒక అభిమాని చేసిన ట్వీట్‌ను లైక్ చేయడం ఆసక్తి కలిగించింది. వరుసగా విఫలమవుతున్నా అవకాశాలు ఇవ్వడం ఏంటని ఇన్‌డైరెక్ట్‌గా నితీశ్ రాణా.. ట్వీట్ లైక్ చేయడం ద్వారా చెప్పకనే చెప్పాడు. ఇషాన్ కిషన్ లాగే నితీశ్ రాణా కూడా ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. అయితే ఇప్పుడున్న రాజకీయాల వల్ల అతనికి పెద్దగా అవకాశాలు రావడం లేదు. దీంతో సహనం కోల్పోతున్న క్రికెటర్లు సెలెక్టర్లపై తమకున్న కోపాన్ని ప్రస్టేషన్ రూపంలో బయటపెడుతున్నారు. తాజాగా నితీశ్ రాణా కూడా ఈ విధంగానే స్పందించడం వార్తల్లో నిలిచేలా చేసింది.
టాపార్డర్ బ్యాటర్ అయిన నితీశ్ రాణా కేకేఆర్ తరపున కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఎన్నో మ్యాచ్‌ల్లో జట్టును గెలిపించాడు. 2021 ఐపీఎల్ సీజన్‌లో 383 పరుగులు చేసిన అతనికి శ్రీలంక పర్యటనకు జట్టు నుంచి పిలుపు వచ్చింది. అలా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన నితీశ్ రాణా వన్డే, టీ20 అరంగేట్రం చేశాడు. ఆడిన ఒక వన్డేలో ఏడు పరుగులు చేసిన నితీశ్.. రెండు టి20 మ్యాచ్‌ల్లో 15 పరుగులు చేశాడు. ఈ వైఫల్యం తర్వాత మళ్లీ అతనికి అవకాశం రాలేదు.
— Out Of Context Cricket (@GemsOfCricket) January 30, 2023
చదవండి: తొలి టెస్టుకు శ్రేయాస్ అయ్యర్ దూరం.. జడ్డూ రీఎంట్రీ
Comments
Please login to add a commentAdd a comment