
ఇవాళ (సెప్టెంబర్ 12) మొదలైన దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచ్‌లో ఇండియా-సి ఆటగాడు ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీతో కదంతొక్కాడు.అనంతపురం వేదికగా ఇండియా-బితో జరుగుతున్న మ్యాచ్‌లో ఇషాన్ ఈ ఫీట్‌ను సాధించాడు. ఇషాన్ 121 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
Ishan Kishan century moment in the Duleep Trophy! 🌟
- A class return by Kishan. 👏pic.twitter.com/xRMbxt36jU— Mufaddal Vohra (@mufaddal_vohra) September 12, 2024
గాయం కారణంగా ఇషాన్ తొలి రౌండ్ మ్యాచ్ ఆడలేదు. తొలి రౌండ్ మ్యాచ్‌కు ముందు బుచ్చిబాబు టోర్నీలోనూ ఇషాన్ సెంచరీతో మెరిశాడు. ఇషాన్ సూపర్ ఫామ్‌లో ఉండటం భారత సెలెక్టర్లకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే భారత జట్టులో వికెట్‌కీపర్ బ్యాటర్లుగా రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్ ఉన్నారు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు భారత జట్టు ఎంపిక ఇదివరకే పూర్తైన నేపథ్యంలో ఇషాన్ టీమిండియా నుంచి పిలుపు కోసం మరికొంత కాలం పాటు వేచి ఉండాల్సిందే.
మ్యాచ్ విషయానికొస్తే... ఇండియా-బితో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇండియా-సి.. 63 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (103), బాబా ఇంద్రజిత్ (62) క్రీజ్‌లో ఉన్నారు. ఇండియా-సి ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్ 43, రజత్ పాటిదార్ 40 పరుగులు చేసి ఔట్ కాగా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 4 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఇండియా-బి బౌలర్లలో ముకేశ్ కుమార్, నవ్‌దీప్ సైనీలకు తలో వికెట్ దక్కింది.
ఇదిలా ఉంటే, ఇవాళే మొదలైన మరో మ్యాచ్‌లో ఇండియా-ఏ, ఇండియా-డి జట్లు తలపడుతున్నాయి. అనంతపురం వేదికగానే జరుగుతున్న ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇండియా-ఏ 70 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. ప్రథమ్ సింగ్ (7), మయాంక్ అగర్వాల్ (7), తిలక్ వర్మ (10), రియాన్ పరాగ్ (37), షాశ్వత్ రావత్ (15), కుమార్ కుషాగ్రా (28), తనుశ్ కోటియన్ (53) ఔట్ కాగా.. షమ్స్ ములానీ (64), ప్రసిద్ధ్ కృష్ణ (2) క్రీజ్‌లో ఉన్నారు. ఇండియా-డి బౌలర్లలో విధ్వత్ కావేరప్ప, అర్ష్‌దీప్ సింగ్ చెరో 2, హర్షిత రాణా, సరాన్ష్ జైన్, సౌరభ్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు.