T20 World Cup 2021: Ishan Kishan Emotional Video After Selected In Team India - Sakshi
Sakshi News home page

Ishan Kishan T20 World Cup 2021: ఎంపికయ్యానని తెలియగానే ఏడ్చేశాడు

Published Thu, Sep 9 2021 12:51 PM | Last Updated on Thu, Sep 9 2021 6:12 PM

Ishan Kishan Emotional After Selected Team India Squad T20 World Cup 2021 - Sakshi

దుబాయ్‌: టీమిండియా యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ టీ20 ప్రపంచకప్‌ 2021కు సంబంధించి జట్టులో ఎంపికైన సంగతి తెలిసిందే. శిఖర్‌ ధావన్‌, పృథ్వీ షాల స్థానంలో మూడో ఓపెనర్‌గా ఎంపికైన ఇషాన్‌పై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఐపీఎల్‌ 2021 మలిదశ సీజన్‌ దృష్యా ఇషాన్‌ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నాడు. ముంబై ఇండియన్స్‌ తరపున ఆడుతున్న ఇషాన్‌ సీరియస్‌గా ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నాడు. ఈ సందర్భంగా బీసీసీఐ టీ20 జట్టును ప్రకటించగానే ఇషాన్‌ కాస్త ఉద్వేగానికి లోనయ్యాడు. తన సహచరుడు హార్దిక్‌ పాండ్యా వచ్చి కంగ్రాట్స్‌ చెప్పగానే.. అతనికి హగ్‌ ఇస్తూ ఎమోషనల్‌ అయ్యాడు. అనంతరం మిగతా జట్టు సభ్యులు కూడా ఇషాన్‌ను అభినందించారు.

చదవండి: శిఖర్‌ ధావన్‌ను అందుకే ఎంపిక చేయలేదా! 


దీనికి సంబంధించిన వీడియోనూ ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం తన ఇన్‌స్టాలో షేర్‌ చేసుకుంది. '' టీ20 ప్రపంచకప్‌కు టీమిండియా జట్టును ప్రకటించాకా మా జట్టులో సంతోషం నెలకొంది. హగ్స్‌, నవ్వులు, ఉద్వేగం.. ఇలా వాతావరణం మొత్తం మారిపోయింది. టీ20 జట్టుకు ఎంపికైన సూర్యకుమార్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా, రాహుల్‌ చహర్‌ లాంటి ఆటగాళ్లకు ఇవే మా అభినందనలు'' అంటూ పోస్ట్‌ చేసింది. కాగా ఇషాన్‌ కిషన్‌ స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లోనే స్టన్నింగ్‌ ప్రదర్శనతో​ ఆకట్టుకున్నాడు. తొలి మ్యాచ్‌లోనే హాఫ్‌ సెంచరీ సాధించిన ఇషాన్‌ సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. 

చదవండి: BAN Vs NZ: ముస్తాఫిజుర్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌.. మోచేతికి దెబ్బ తగిలినా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement