యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో మెరిశాడు. 39 ఏళ్ల వయసులోనూ ఒకవైపుగా డైవ్‌చేస్తే దాదాపు క్యాచ్‌ను పట్టినంత పని చేశాడు. ఒకవేళ అండర్సన్ ఈ క్యాచ్‌ను తీసుకొని ఉంటే మాత్రం కచ్చితంగా క్యాచ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచేది. మూడోటెస్టులో భాగంగా ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 82వ ఓవర్‌లో ఇది చోటుచేసుకుంది. మార్క్‌వుడ్ వేసిన ఓవర్ నాలుగో బంతిని పాట కమిన్స్ మిడాన్ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న అండర్సన్ అమాంతం గాల్లోకి ఎగిరి డైవ్ చేస్తూ బంతిని అందుకున్నప్పటికి చేతి నుంచి జారిపోయింది. దీంతో కోపంతో అండర్సన్ బంతిని పక్కకు విసిరేశాడు. అయితే తన జట్టుకు మూడు పరుగులు సేవ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: Pat Cummins: బంతులతో భయపెట్టాడు.. చివరికి డకౌట్ చేశాడు
ఇక క్యాచ్ మిస్ చేసిన అండర్సన్ బౌలింగ్‌లో మాత్రం అదరగొట్టాడు. మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న టెస్టులో అండర్సన్ తన బెస్ట్ స్పెల్ నమోదు చేశాడు. తొలిరోజు ఆటలో డేవిడ్ వార్నర్(38) వికెట్ తీసుకున్న అండర్సన్ మార్స్ హారిస్(76), స్టీవ్ స్మిత్(16), కమిన్స్(21) రూపంలో మిగతా మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్‌గా 23 ఓవర్లు 10 మెయిడెన్లు సహా 33 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఇక ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 267 పరుగులకు ఆలౌట్ అయి 82 పరుగులు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. అంతకముందు ఇంగ్లండ్ ఆసీస్ బౌలర్ల దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకే కుప్పకూలింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ ఇంగ్లండ్ తడబడుతుంది. ప్రస్తుతం 22 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 22 పరుగులు చేసిన ఇంగ్లండ్ ఇంకా 60 పరుగులు వెనుకబడి ఉంది.
చదవండి: Virat Kohli: మళ్లీ అదే నిర్లక్క్ష్యం.. మంచి ఆరంభం వచ్చాకా కూడా!
Comments
Please login to add a commentAdd a comment