
విండ్‌హక్: ఆతిథ్య దేశం నమీబియా... ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్–2 టోర్నీ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో ఆ జట్టు 145 పరుగుల భారీ తేడాతో ఒమన్‌ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన నమీబియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది.
ఓపెనర్ బిర్కెన్‌స్టాక్ (61) టాప్ స్కోరర్. ఛేదనలో పేసర్లు ఫ్రిలింక్ (5/13), జెజె స్మిట్ (3/21) ధాటికి ఒమన్ 29 ఓవర్లలో 81 పరుగులకే ఆలౌటైంది. హైదరాబాదీ ఆల్‌రౌండర్ సందీప్ గౌడ్ డకౌటయ్యాడు. మూడో స్థానం కోసం జరిగిన మరో మ్యాచ్‌లో పపువా న్యూ గినియాపై అమెరికా 5 వికెట్ల తేడాతో గెలిచింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌ల్లో హాంకాంగ్‌ను ఓడించడం ద్వారా నమీబియాకు, ఒమన్‌పై నెగ్గడం ద్వారా పపువా న్యూ గినియా ఐసీసీ వన్డే హోదాకు అర్హత సాధించాయి.