సాత్విక్, శివ ఆల్‌రౌండ్ షో | all saints beats hyderabad panthers | Sakshi
Sakshi News home page

సాత్విక్, శివ ఆల్‌రౌండ్ షో

Published Mon, Aug 8 2016 11:48 AM | Last Updated on Fri, Sep 7 2018 4:39 PM

all saints beats hyderabad panthers

సాక్షి, హైదరాబాద్: సాత్విక్ రెడ్డి (133; 2/27), శివ ( 97, 3/20) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆల్‌సెయింట్స్ హైస్కూల్ 92 పరుగులతో హైదరాబాద్ పాంథర్స్‌పై గెలుపొందింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట ఆల్‌సెయింట్స్ 4 వికెట్లకు 286 పరుగులు చేసింది. సాత్విక్, శివ అదరగొట్టారు. తర్వాత పాంథర్స్ 194 పరుగుల వద్ద ఆలౌటైంది. హేమంత్ (87) ఒంటరిపోరాటం చేశాడు. మరో మ్యాచ్‌లో శివగౌడ్ (164) సెంచరీతో వాకర్‌టౌన్ 273 పరుగుల తేడాతో విక్టోరియాపై ఘనవిజయం సాధించింది. మొదట వాకర్‌టౌన్ 429 పరుగుల భారీస్కోరు చేసింది. నాగరాజు (77), శ్రీకాంత్ (77) రాణించారు. తర్వాత విక్టోరియా 156 పరుగులకే
 కుప్పకూలింది. బాసిత్‌కు 6 వికెట్లు దక్కాయి.


 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు


  సీకే బ్లూస్: 265/8 (బెనర్జీ 70, సాయి సుశాంత్ 51, సుశాంత్ 54; శివ 3/33), సటన్ సీసీ: 128 (అత్తార్ 62; అశ్వద్ రాజీవ్ 6/25, బాలకృష్ణ 3/16).  కాస్మోస్ సీసీ: 483 (దినేశ్ పవార్ 136, అల్బర్ట్ 85, మోహన్ 66, శరత్ 58; రోహిత్ 4/100), సెయింట్ ప్యాట్రిక్స్: 88 (సాయి వినయ్ 41; అల్బర్ట్ 4/6, మోహన్ 3/32, శరత్ 2/22).

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement