సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎ–1 డివిజన్ మూడు రోజుల లీగ్‌లో ఆంధ్రా బ్యాంక్ జట్టు ఇన్నింగ్స్ విజయాన్ని కైవసం చేసుకుంది. ఇన్‌కమ్ ట్యాక్స్‌తో గురువారం ముగిసిన మ్యాచ్‌లో ఆంధ్రా బ్యాంక్ ఇన్నింగ్స్ 24 పరుగులతో గెలుపొందింది. ఆట చివరిరోజు రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇన్‌కమ్ ట్యాక్స్.... బౌలర్ల ధాటికి 35 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటైంది. రవితేజ (3/24), హితేశ్ (3/41), నీలేశ్ (3/07) క్రమం తప్పకుండా వికెట్లు తీసి ఆ జట్టును కుప్పకూల్చారు. అంతకుముందు ఆంధ్రా బ్యాంక్ తొలి ఇన్నింగ్స్‌ను 373/9 వద్ద డిక్లేర్ చేయగా... ఇన్‌కమ్ ట్యాక్స్ 244 పరుగులకు ఆలౌటైంది. ఈ గెలుపుతో ఆంధ్రా బ్యాంక్ ఖాతాలో 7 పాయింట్లు చేరాయి.
ఆకాశ్ భండారికి 14 వికెట్లు...
డెక్కన్ క్రానికల్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో ఎస్‌బీఐ ప్లేయర్ ఆకాశ్ భండారి ఓవరాల్‌గా 14 వికెట్లతో అద్భుత ప్రతిభ కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 34 పరుగులిచ్చి 7 వికెట్లు దక్కించుకున్న ఆకాశ్... రెండో ఇన్నింగ్స్‌లోనూ 74 పరుగులిచ్చి మరో 7 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతని దెబ్బకు డెక్కన్ క్రానికల్ జట్టు 103 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 229 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన డెక్కన్ క్రానికల్ ఆకాశ్ విజృంభించడంతో 26.2 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. సాయి వికాస్ రెడ్డి (51) అర్ధసెంచరీ చేశాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 23/0 గురువారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఎస్‌బీఐ 34 ఓవర్లలో 8 వికెట్లకు 123 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఎస్‌బీఐ 197 పరుగులు చేయగా... డెక్కన్ క్రానికల్ 91కే ఆలౌటైంది. దీంతో ఎస్‌బీఐ జట్టుకు 6 పాయింట్లు లభించాయి.
ఇతర మ్యాచ్‌ల ఫలితాలు
స్పోర్టింగ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 434 (105.3 ఓవర్లలో), బీడీఎల్ తొలి ఇన్నింగ్స్: 329 (తనయ్ త్యాగరాజన్ 4/103), స్పోర్టింగ్ ఎలెవన్ రెండో ఇన్నింగ్స్: 133/7 (సదన్ 3/24).
ఈఎంసీసీ తొలి ఇన్నింగ్స్: 295 (91.2 ఓవర్లలో), ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ తొలి ఇన్నింగ్స్: 245 (ఎస్‌సీ మొహంతి 107 నాటౌట్, సురేశ్ 54; అజయ్‌దేవ్ గౌడ్ 3/50).
జై హనుమాన్ తొలి ఇన్నింగ్స్: 366/4 డిక్లేర్డ్, ఆర్. దయానంద్ తొలి ఇన్నింగ్స్: 204 (బెంజమిన్ థామస్ 50; శ్రవణ్ 4/48, కార్తికేయ 3/66).
ఎంపీ కోల్ట్స్ తొలి ఇన్నింగ్స్: 308 (101.5 ఓవర్లలో), ఇండియా సిమెంట్: 290 (శ్రేయస్ వాలా 85, సయ్యద్ అలీ 78; కృష్ణ చరిత్ 4/64, ప్రణీత్ రాజ్ 3/69), ఎంపీ కోల్ట్స్ రెండో ఇన్నింగ్స్: 120/5 (23 ఓవర్లలో).
ఎన్స్‌కాన్స్ తొలి ఇన్నింగ్స్: 380 (90 ఓవర్లలో), హైదరాబాద్ బాట్లింగ్: 245 (60.2 ఓవర్లలో), ఎన్స్‌కాన్స్ రెండో ఇన్నింగ్స్: 160/6 డిక్లేర్డ్ (సాయివ్రత్ 52), హైదరాబాద్ బాట్లింగ్ రెండో ఇన్నింగ్స్: 296/5 (వినయ్ గౌడ్ 60, రాధాకృష్ణ 90).
ఎవర్‌గ్రీన్ తొలి ఇన్నింగ్స్: 295 (104.2 ఓవర్లలో), జెమిని ఫ్రెండ్స్ తొలి ఇన్నింగ్స్: 314 (ఠాకూర్ తిలక్ వర్మ 89, రవితేజ 52).
కేంబ్రిడ్జ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 228 (83 ఓవర్లలో), ఏఓసీ తొలి ఇన్నింగ్స్: 124/3 (శివం తివారీ 53 నాటౌట్).
Comments
Please login to add a commentAdd a comment