ఎన్స్‌కాన్స్‌ మ్యాచ్‌ డ్రా | Hyderabad Cricket Association A1 Division 3 Days League | Sakshi
Sakshi News home page

ఎన్స్‌కాన్స్‌ మ్యాచ్‌ డ్రా

Published Sat, Jul 20 2019 2:52 PM | Last Updated on Sat, Jul 20 2019 2:53 PM

Hyderabad Cricket Association A1 Division 3 Days League - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ఎ–1 డివిజన్‌ మూడు రోజుల లీగ్‌లో భాగంగా ఎన్స్‌కాన్స్, కేంబ్రిడ్జ్‌ ఎలెవన్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఆటకు చివరిరోజైన శుక్రవారం ఓవర్‌నైట్‌ స్కోరు 181/4తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన కేంబ్రిడ్జ్‌ ఎలెవన్‌ జట్టు ఆటముగిసే సమయానికి 143.5 ఓవర్లలో 8 వికెట్లకు 418 పరుగులు చేసింది. రాకేశ్‌ యాదవ్‌ (287 బంతుల్లో 102 నాటౌట్‌; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆరిష్‌ జైదీ (76), ఆశిష్‌ శ్రీవాస్తవ్‌ (53) అర్ధసెంచరీలు సాధించారు. ప్రత్యర్థి బౌలర్లలో మెహదీ హసన్‌ 5 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఎన్స్‌కాన్స్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 120.2 ఓవర్లలో 381 పరుగులకు ఆలౌటైంది. 37 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించిన కేంబ్రిడ్జ్‌ జట్టుకు 3 పాయింట్లు లభించగా... ఎన్స్‌కాన్స్‌ జట్టు ఖాతాలో ఒక పాయింట్‌ చేరింది.  

ఇతర మ్యాచ్‌ల ఫలితాలు 

  • జైహనుమాన్‌ తొలి ఇన్నింగ్స్‌: 283 (73.2 ఓవర్లలో), స్పోర్టింగ్‌ ఎలెవన్‌ తొలి ఇన్నింగ్స్‌: 292 (74 ఓవర్లలో), జై హనుమాన్‌ రెండో ఇన్నింగ్స్‌: 224 (శశిధర్‌ రెడ్డి 52, వినీత్‌ రెడ్డి 47; తనయ్‌ త్యాగరాజన్‌ 5/59), స్పోర్టింగ్‌ ఎలెవన్‌ రెండో ఇన్నింగ్స్‌: 22/2 (4 ఓవర్లలో). 
  • ఆర్‌ దయానంద్‌ తొలి ఇన్నింగ్స్‌: 291 (103 ఓవర్లలో), ఎస్‌బీఐ తొలి ఇన్నింగ్స్‌: 295/8 (బి. సుమంత్‌ 63 నాటౌట్‌; మోహిత్‌ సోని 3/66).  
  • ఈఎంసీసీ తొలి ఇన్నింగ్స్‌: 303 (89.5 ఓవర్లలో), ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ తొలి ఇన్నింగ్స్‌: 343 (69.2 ఓవర్లలో). 
  • దక్కన్‌ క్రానికల్‌ తొలి ఇన్నింగ్స్‌: 238 (67.1 ఓవర్లలో), బీడీఎల్‌ తొలి ఇన్నింగ్స్‌: 249/9 (హెచ్‌కే సింహా 83; పుష్కర్‌ 3/61, మిలింద్‌ 3/64).  
  • ఎంపీ కోల్ట్స్‌ తొలి ఇన్నింగ్స్‌: 635/9 డిక్లేర్డ్‌ (148.4 ఓవర్లలో), కాంటినెంటల్‌ తొలి ఇన్నింగ్స్‌: 249 (ప్రత్యూష్‌ కుమార్‌ 75, సంహిత్‌ రెడ్డి 59; ప్రణీత్‌ రాజ్‌ 3/58, గిరీశ్‌ గౌడ్‌ 3/26). 
  • హైదరాబాద్‌ బాట్లింగ్‌ తొలి ఇన్నింగ్స్‌: 170 (40 ఓవర్లలో), జెమినీ ఫ్రెండ్స్‌ తొలి ఇన్నింగ్స్‌: 135/5 (అభిరత్‌ రెడ్డి 79 బ్యాటింగ్‌; జయసూర్య 3/26).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement