ఈనెల 29న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో (ఉప్పల్ స్టేడియం) జరగాల్సి ఉన్న వన్డే వరల్డ్‌కప్-2023 వార్మప్ మ్యాచ్ ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియంలో జరుగనుంది. పాకిస్తాన్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌కు సెక్యూరిటీ ఇవ్వలేమని స్థానిక పోలీసులు చెప్పడంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఈ నిర్ణయం తీసుకుంది.
మ్యాచ్‌కు ముందు రోజు (సెప్టెంబర్ 28) నగరంలో గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగలు ఉండటంతో తగినంత భద్రత ఇవ్వలేమని నగర పోలీసులు హెచ్‌సీఏకు తెలిపారు. వీలైతే మ్యాచ్‌ను వాయిదా వేయాలని వారు హెచ్‌సీఏని కోరారు. అయితే, ఇదివరకే షెడ్యూల్‌ను ఓ సారి సవరించి ఉండటంతో బీసీసీఐ షెడ్యూల్ మార్పు కుదరదని హెచ్‌సీఏకు తేల్చి చెప్పింది.
దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పాక్-న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్‌ను ఖాళీ స్టేడియంలో నిర్వహించేందుకు హెచ్‌సీఏ సిద్ధమైంది. ఈ మ్యాచ్ వీక్షించేందుకు ఇదివరకే టికెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా బీసీసీఐ వరల్డ్‌కప్ టికెటింగ్ పార్డ్‌నర్ బుక్ మై షోకు సూచించింది.
కాగా, వన్డే వరల్డ్‌కప్-2023కు ముందు మొత్తం 10 వార్మప్ మ్యాచ్‌లు జరుగనున్న విషయం తెలిసిందే. వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా సెప్టెంబర్ 29న 3 మ్యాచ్‌లు, సెప్టెంబర్ 30న 2, అక్టోబర్ 2న 2, అక్టోబర్ 3న 3 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ డే అండ్ మ్యాచ్‌లుగా సాగనున్నాయి.
సెప్టెంబర్ 29:
- బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక (గౌహతి, మధ్యాహ్నం 2 గంటలకు)
- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా (తిరువనంతపురం)
- న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ (హైదరాబాద్)
సెప్టెంబర్ 30:
- ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ (గౌహతి)
- ఆస్ట్రేలియా వర్సెస్ నెదర్లాండ్స్ (తిరువనంతపురం)
అక్టోబర్ 2:
- బంగ్లాదేశ్ వర్సెస్ ఇంగ్లండ్ (గౌహతి)
- న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా (తిరువనంతపురం)
అక్టోబర్ 3:
- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ శ్రీలంక (గౌహతి)
- ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ (తిరువనంతపురం)
- ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ (హైదరాబాద్)
Comments
Please login to add a commentAdd a comment