all saints
-
విజేత ఆల్‌సెయింట్స్
సాక్షి, హైదరాబాద్: వీవీఎస్ కప్ అండర్-14 ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్లో ఆల్సెరుుంట్స్ జట్టు టైటిల్‌ను దక్కించుకుంది. మంగళవారం జరిగిన ఫైనల్లో ఆల్‌సెయింట్స్ జట్టు 79 పరుగుల తేడాతో శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆల్‌సెయింట్స్ జట్టు 40 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. పి. శివ (78) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. జఫర్ (37 నాటౌట్) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో ప్రణవ్ వర్మ 2 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం 177 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్‌ను అద్భుతమైన బౌలింగ్‌తో శివ (5/13)కట్టడి చేశాడు. శివ ధాటికి ఆ జట్టు 33 ఓవర్లలో 96 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. ప్రణవ్ వర్మ (27), రోహిత్ రెడ్డి (23) పర్వాలేదనిపించారు. ఈ టోర్నీ ఆసాంతం బ్యాటింగ్‌లో రాణించిన శివకు ‘బెస్ట్ బ్యాట్స్‌మన్’, ‘బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ పురస్కారాలు లభించగా... హెచ్‌పీఎస్, రామాంతపూర్ జట్టు బౌలర్ దుర్గబాలాజీకి ‘బెస్ట్ బౌలర్’ అవార్డు దక్కింది. -
సాత్విక్, శివ ఆల్‌రౌండ్ షో
సాక్షి, హైదరాబాద్: సాత్విక్ రెడ్డి (133; 2/27), శివ ( 97, 3/20) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆల్‌సెయింట్స్ హైస్కూల్ 92 పరుగులతో హైదరాబాద్ పాంథర్స్‌పై గెలుపొందింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట ఆల్‌సెయింట్స్ 4 వికెట్లకు 286 పరుగులు చేసింది. సాత్విక్, శివ అదరగొట్టారు. తర్వాత పాంథర్స్ 194 పరుగుల వద్ద ఆలౌటైంది. హేమంత్ (87) ఒంటరిపోరాటం చేశాడు. మరో మ్యాచ్‌లో శివగౌడ్ (164) సెంచరీతో వాకర్‌టౌన్ 273 పరుగుల తేడాతో విక్టోరియాపై ఘనవిజయం సాధించింది. మొదట వాకర్‌టౌన్ 429 పరుగుల భారీస్కోరు చేసింది. నాగరాజు (77), శ్రీకాంత్ (77) రాణించారు. తర్వాత విక్టోరియా 156 పరుగులకే కుప్పకూలింది. బాసిత్‌కు 6 వికెట్లు దక్కాయి. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు సీకే బ్లూస్: 265/8 (బెనర్జీ 70, సాయి సుశాంత్ 51, సుశాంత్ 54; శివ 3/33), సటన్ సీసీ: 128 (అత్తార్ 62; అశ్వద్ రాజీవ్ 6/25, బాలకృష్ణ 3/16). కాస్మోస్ సీసీ: 483 (దినేశ్ పవార్ 136, అల్బర్ట్ 85, మోహన్ 66, శరత్ 58; రోహిత్ 4/100), సెయింట్ ప్యాట్రిక్స్: 88 (సాయి వినయ్ 41; అల్బర్ట్ 4/6, మోహన్ 3/32, శరత్ 2/22).