లెజెండ్స్‌ క్రికెట్‌ లీగ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా అమితాబ్‌.. | Legends League Cricket Signs Amitabh Bachchan As Brand Ambassador | Sakshi
Sakshi News home page

Legends League Cricket: బ్రాండ్ అంబాసిడర్‌గా బిగ్ బీ..

Published Thu, Dec 9 2021 8:28 PM | Last Updated on Thu, Dec 9 2021 8:28 PM

Legends League Cricket Signs Amitabh Bachchan As Brand Ambassador - Sakshi

Amitabh Bachchan: దిగ్గజ క్రికెటర్లు పాల్గొనే లెజెండ్స్‌ క్రికెట్ లీగ్‌కు బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు బిగ్‌ బీనే స్వయంగా ఓ ప్రకటన విడుదల చేశాడు. ఈ లీగ్ కోసం తానెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆయన పేర్కొన్నాడు. మైదానంలో దిగ్గజాల పోరాటాన్ని ఆస్వాదించేందుకు అభిమానులు సైతం ఎంతో ఆతృతగా ఉన్నారని తెలిపాడు. 

కాగా, లెజెండ్స్‌ క్రికెట్‌ లీగ్‌ను  2022 జనవరిలో ఓమన్‌లోని అల్‌ అమీరట్‌ స్టేడియం వేదికగా నిర్వహించేందుకు నిర్వాహకులు సన్నాహకాలు చేస్తున్నారు. భారత్‌, ఆసియా, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ జట్ల తరఫున భారత్, శ్రీలంక, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌కు చెందిన దిగ్గజ ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. లీగ్‌లో పాల్గొనే ఆటగాళ్ల పేర్లు తెలియాల్సి ఉంది.
చదవండి: Ashes 1st Test: ట్రావిస్‌ హెడ్‌ సుడిగాలి సెంచరీ.. పటిష్ట స్థితిలో ఆసీస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement