ఆ ఫోన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా అమితాబ్
ఆ ఫోన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా అమితాబ్
Published Mon, Mar 6 2017 6:20 PM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM
చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీదారి వన్ ప్లస్, బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్కు వెల్ కం చెప్పింది. ఇండియాలో తన స్మార్ట్ ఫోన్లకు కొత్త బ్రాండు అంబాసిడర్ గా అమితాబ్ బచ్చన్ ను నియమించింది. బచ్చన్ రాకతో వన్ ప్లస్ బ్రాండు మార్కెట్లో మరింత మారుమోగుతుందని కంపెనీ ఆశాభావం వ్యక్తంచేసింది. బచ్చన్ కేవలం అత్యుత్తమ, అత్యంత స్ఫూర్తిదాయకమైన నటుడు మాత్రమే కాదని, ఆయన అపారమైన విశ్వసనీయతకు మారుపేరుగా కంపెనీ అభివర్ణించింది. అదేవిధంగా వన్ ప్లస్ కూడా బెస్ట్ స్మార్ట్ ఫోన్ గా అమెజాన్ ఇండియాలో కన్జ్యూమర్ రేటింగ్స్ పొందినట్టు పేర్కొంది.
ఇండియాలో తమ బ్రాండు అంబాసిడర్ గా అమితాబ్ బచ్చన్ కు వెల్ కం చెబుతున్నట్టు వన్ ప్లస్ సీఈవో, వ్యవస్థాపకుడు పీట్ లౌ చెప్పారు. బచ్చన్ తో తమ భాగస్వామ్యం మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. బ్రాండును సరికొత్త స్థాయిలకు తీసుకెళ్లడానికి బచ్చన్ భాగస్వామ్యం సహకరిస్తుందన్నారు. ఎంతో అద్భుతమైన టెక్నాలజీ బ్రాండుతో కలిసి పనిచేయడం తనకు సంతోషాన్ని కలుగజేస్తుందని అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు.
Advertisement
Advertisement