
న్యూఢిల్లీ: భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్, బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కుర్రాళ్ల కోసం నిర్వహించనున్న కొత్త క్రికెట్ లీగ్‌లో చేయిచేయి కలిపారు. జాతీయ స్థాయిలో ఫెరిట్ క్రికెట్ బాష్ పేరుతో (ఎఫ్‌సీబీ) వీరిద్దరు కలిసి లీగ్ నిర్వహణకు శ్రీకారం చుట్టారు. 15 ఏళ్లు పైబడిన బాలల కోసం మొత్తం 22 నగరాల్లో ప్రతిభాన్వేషణ పోటీలు నిర్వహిస్తారు. రెండు రౌండ్లుగా జరిగే ఈ సెలక్షన్ క్రికెట్ పోటీల ద్వారా చివరకు 224 మందిని ఎంపిక చేస్తారు. వీరికి రూ. లక్ష చొప్పున ఫీజుగా చెల్లిస్తారు. వీరందరిని కలిపి 16 జట్లను తయారు చేస్తారు. ఇలా ఏర్పడిన ఈ 16 జట్లకు అంతర్జాతీయ మాజీ క్రికెటర్లు, కోచ్‌లు శిక్షణ ఇస్తారు. చివరకు 15 ఓవర్ల చొప్పున మ్యాచ్‌లను ఏర్పాటు చేస్తారు. ఇందులో అసాధారణంగా రాణించిన 14 మందిని ఆస్ట్రేలియాలో క్లబ్ స్థాయి క్రికెట్ టోర్నీ ఆడేందుకు అక్కడికి తీసుకెళ్తారు.
Comments
Please login to add a commentAdd a comment