Inside Edge Season 3 Will Streaming In December - Sakshi
Sakshi News home page

ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ హ్యాట్రిక్‌ సీజన్‌ వచ్చేస్తోంది.. ఎప్పుడో తెలుసా?

Published Mon, Nov 15 2021 4:46 PM | Last Updated on Mon, Nov 15 2021 5:01 PM

Inside Edge Season 3 Will Streaming In December - Sakshi

Inside Edge Season 3: క్రికెట్‌ అభిమానుల్లో ఐపీఎల్‌ ఫీవర్‌ తగ్గింది. టీ20 వరల్డ్‌ కప్‌ ముగిసింది. ఇక క్రికెట్‌ కోలహాలం తగ్గిందని అనుకుంటున్నారా ? అలా అస్సలు ఆలోచించకండి. నిరాశ పడకండి క్రికెట్‌లో మరో పెద్ద లీగ్ రానుంది. కానీ ఈ లీగ్‌ గ్రౌండ్‌లో జరగదండి. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా హ్యాట్రిక్‌ కొట‍్టడానికి 'ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ సీజన్‌ 3' వెబ్‌ సిరీస్‌ అనే మ‍్యాచ్‌ ప్రారంభంకానుంది. గేమ్‌ మాస్టర్స్‌ తిరిగి రానున్నారు. ఈసారి వెనక్కి తిరిగి చూసుకునే ప్రసక‍్తే లేదంటున్నాయి మ‍్యాచ్‌లో తలపడనున్న జట్లు

క్రికెట్‌ నేపథ్యంగా వచ్చిన వెబ్‌ సిరీస్‌ ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌. మొదటి రెండు సీజన్‌లు క్రికెట్‌ అభిమానులను, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మూడో సీజన్‌ కోసం వెబ్‌ సిరీస్‌ అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఫలించాయి. ఇన్‌సైడ్‌ ఎడ్జ్ సీజన్‌ 1, 2లను ప్రేక్షకులు ఆదరించి,  భారీ సక్సెస్‌ ఇవ్వడంతో మూడో సీజన్‌ను ప్లాన్‌ చేసి రిలీజ్‌ చేయడానికి సిద‍్ధంగా ఉన్నారు మేకర్స్‌.

ఈ అమెజాన్‌ ఒరిజినల్‌ సిరీస్‌ 3వ సీజన్‌ డిసెంబర్‌ 3, 2021న ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శిస్తామని మేకర్స్‌ సోమవారం ప్రకటించారు. ఈ సీజన్‌ 3లో వివేక్‌ ఒబెరాయ్‌, రిచా చద్దా, తనూజ్‌ విర్వానీ, అమీర్‌ బషీర్‌, సయానీ గుప్తా, సప్నా పబ్బి, అక్షయ్‌ ఒబెరాయ్‌, సిధాంత్ గుప్తా, అమిత్‌ సియాల్‌ నటించారు. కరణ్‌ అన్షుమాన్‌ రూపొందించిన ఈ సిరీస్‌కు కనిష్క్‌ వర్మ దర్శకత్వం వహించారు. ఎక్సెల్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మించింది. 

ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాత రితేష్ సిధ్వాని ' ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ వెబ్‌ సిరీస్‌కు వీక్షకులు, విమర్శకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అదే మమ్మల్ని మరో సీజన్‌ను రూపొందిచేలా ప్రోత్సహించింది. ఇన్‌సైడ్ ఎడ్జ్‌ మాకు ఎప్పుడూ ప్రత్యేకమైంది. ఇది అమెజాన్‌తో ఎక్సెల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మొదటి ఒరిజినల్‌ సిరీస్‌. ఇండియాలో అమెజాన్ మొదటి ఒరిజినల్‌ సిరీస్‌ కావడంతో మాకు ఎప్పుడూ ప్రత్యేకమైనదే. ఈ సీజన్‌లో ముంబై మావెరిక్స్‌ ప్రయాణం, గ్రిప్పింగ్‌ దశను వివరించామని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం.' అంటూ ఆయన భావాలు పంచుకున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement