![Suresh Oberoi Breaks Silence On Vivek Oberoi, Aishwarya Rai Relationship - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2023/12/19/Suresh-Oberoi.jpg.webp?itok=INoLEI8k)
కొన్ని ప్రేమకథలు సుఖాంతం అవుతే మరికొన్ని ప్రేమకథలు మధ్యలోనే ఆగిపోతాయి. బాలీవుడ్ సెలబ్రిటీలు వివేక్ ఒబెరాయ్- ఐశ్వర్యరాయ్ లవ్‌స్టోరీ రెండో కోవలోకి చెందుతుంది. వీరు గాఢంగా ప్రేమించుకున్నారు, కట్ చేస్తే ఇద్దరూ చెరొకరిని పెళ్లి చేసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే ఐష్‌తో తన కొడుకు ప్రేమాయణం గురించి మొదట్లో ఏమీ తెలియలేదన్నాడు సురేశ్ ఒబెరాయ్. తాజాగా ఆయన మాట్లాడుతూ.. 'చాలా విషయాలు నాకసలు తెలియనే తెలీదు. వివేక్ ఎప్పుడూ నాతో ఓపెన్‌గా చెప్పలేదు. రాము (రామ్ గోపాల్ వర్మ)యే అదంతా నాతో చెప్పాడు.
ఐశ్వర్యతో లవ్.. వద్దని వారించా
రాము కంటే ముందు కూడా ఎవరో చెప్పినట్లు గుర్తు. కానీ తను ఏదైతే చేస్తున్నాడో అది వెంటనే ఆపేయమని చెప్పాను. ఎందుకనేది అతడికి అర్థమయ్యేలా వివరించాను' అని చెప్పుకొచ్చాడు. ఇక సల్మాన్ ఖాన్‌తో బ్రేకప్ చెప్పిన వెంటనే వివేక్‌తో ప్రేమలో పడింది ఐష్. కానీ వీరి బంధం కూడా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఎంతో త్వరగా బ్రేకప్ చెప్పుకున్నారు. కొన్నేళ్ల తర్వాత హీరో అభిషేక్ బచ్చన్‌ను పెళ్లాడి అమితాబ్ ఇంటికి కోడలిగా వెళ్లింది ఐశ్వర్య రాయ్.
ఎవరీ సురేశ్- వివేక్..
సురేశ్ ఒబెరాయ్ విషయానికి వస్తే ఈయన సహజ నటుడు. ఏడేళ్ల వయసులోనే తొలిసారిగా ఆడపిల్ల వేషంలో రంగస్థలంపై అడుగుపెట్టాడు. డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యాడు. మిర్చ్ మసాలా, ఐత్‌బార్, లావారిస్, ఘర్ ఏక్ మందిర్ వంటి చిత్రాల్లో విలక్షణ పాత్రలు పోషించాడు. తెలుగులో మరణ మృదంగం వంటి సినిమాలు చేశాడు. ఇటీవలే యానిమల్ సినిమాలోనూ ఓ కీలక పాత్రలో మెరిశాడు. ఈయన తనయుడు వివేక్ ఒబెరాయ్.. రక్త చరిత్ర, క్రిష్ 3 వంటి పలు సినిమాల్లో నటించాడు. పీఎమ్ నరేంద్రమోది బయోపిక్‌లో ప్రధాని మోది పాత్రను పోషించాడు. తాజాగా ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనే వెబ్ సిరీస్‌లో నటించాడు.
చదవండి: దావూద్ పిచ్చిగా ప్రేమించిన హీరోయిన్.. ఒక్క ఫోటోతో జీవితం నాశనం!
Comments
Please login to add a commentAdd a comment