హెచ్‌సీఏ ఎ–2 డివిజన్ రెండు రోజుల క్రికెట్ లీగ్‌లో రోహిత్ ఎలెవన్ బ్యాట్స్‌మన్ రుద్ర దండే (120 బంతుల్లో 194; 20 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు సెంచరీతో చెలరేగాడు.
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీఏ ఎ–2 డివిజన్ రెండు రోజుల క్రికెట్ లీగ్‌లో రోహిత్ ఎలెవన్ బ్యాట్స్‌మన్ రుద్ర దండే (120 బంతుల్లో 194; 20 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు సెంచరీతో చెలరేగాడు. దీంతో బాలాజీ కోల్ట్స్ జట్టుతో గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో రోహిత్ ఎలెవన్ భారీ స్కోరు సాధించింది. 81 ఓవర్లలో 480 పరుగులకు ఆలౌటైంది. వాసిత్ సర్తాజ్ (58), గంగా సింగ్ (69) దూకుడుగా ఆడారు. ప్రత్యర్థి బౌలర్లలో యశ్వంత్ రెడ్డి 3, జి. భరత్ రెడ్డి 4 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బాలాజీ కోల్ట్స్ జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 3 ఓవర్లలో 2 వికెట్లకు 6 పరుగులు చేసింది.
ఇతర మ్యాచ్‌ల వివరాలు
సాయి సత్య : 156 (సూరజ్ సక్సేనా 48; అఫ్రోజ్ 3/25, కమల్ సావరియా 3/25, ముజ్తబా 3/45), పాషా బీడీ: 115/3 (విశేష్ శర్మ 65 బ్యాటింగ్, ముజ్తబా 31).
న్యూ బ్లూస్: 209 (అకేందర్ 52, అజ్మత్ ఖాన్ 36), అపెక్స్:90/6 (23 ఓవర్లలో).
శ్రీచక్ర: 234 (భరద్వాజ్ 41, కె. జైదేవ్ గౌడ్ 61; అద్నాన్ 4/49), జైభగవతితో మ్యాచ్.
బడ్డింగ్ స్టార్: 184 (ఆకాశ్ యాదవ్ 68), పోస్టల్: 147 (నవీన్ కుమార్ 43; ఆశిష్ 4/50, అబ్దుల్ మొఖీత్ 3/28).
రాకేశ్ ఎలెవన్: 267 (నిఖిల్ నేతాజీరెడ్డి 104, టి. కరణ్ 56; అశ్వద్ రాజీవ్ 5/85, అమిత్ 3/16), ఆక్స్‌ఫర్డ్ బ్లూస్: 10/0 (5 ఓవర్లలో).
కంబైన్డ్ డిస్ట్రిక్ట్స్: 105 (షకీర్ 42; సమీర్ 4/25, వేదాంత్ 3/23), సలీమ్ నగర్: 109/8 (పవన్ 4/33).
మహమూద్ సీసీ: 232 (మొహమ్మద్ హుస్సేన్ 77; నీలమ్ తరుణ్ రాజ్ 3/18), కంకర్డ్ సీసీతో మ్యాచ్.
చీర్‌ఫుల్ చమ్స్:141 (అభిషేక్ 36; సహేంద్ర మల్లు 4/47), హెచ్‌యూసీసీ: 143/4 (సహేం ద్ర మల్లు 38 నాటౌట్; ఆర్‌కే విఘ్నేశ్ 3/47).
నిజాం కాలేజ్: 278 (భరత్ కుమార్ 113, హేమంత్ 43; ఇల్యాన్ 4/55), డెక్కన్ ఆర్సెనల్స్: 146/4 (ఎ. వినయ్ 92; డి. శ్రీనివాస్ 3/26).