అంతర్ జిల్లా రెండు రోజుల లీగ్
సాక్షి, హైదరాబాద్: అంతర్ జిల్లా రెండు రోజుల క్రికెట్ లీగ్‌లో కరీంనగర్ జట్టు రెండు వికెట్ల తేడాతో నల్లగొండపై ఉత్కంఠ విజయం సాధించింది. రెండో రోజైన ఆదివారం ఒక్కరోజే 27 వికెట్లు కూలాయి. ఓవర్‌నైట్ స్కోరు 101/1తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కరీంనగర్ 50 ఓవర్లలో 280 పరుగుల వద్ద ఆలౌటైంది. శేఖర్ (70), శశ్వంత్ రెడ్డి (65 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నల్లగొండై జట్టు 39 ఓవర్లలో 187 పరుగులకే కుప్పకూలింది.
తొలి ఇన్నింగ్స్‌లో నల్లగొండై 236 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టుకు ఓవరాల్‌గా 143 పరుగుల ఆధిక్యం మాత్రమే దక్కింది. ఆపై రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడిన కరీంనగర్ జట్టు 36.5 ఓవర్లలోనే 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసి లక్ష్యాన్నందుకుంది. నల్లగొండ బౌలర్లలో ఉపేందర్ రెడ్డికి నాలుగు వికెట్లు (4/48) దక్కాయి. ఇక వరంగల్, ఖమ్మం మధ్య జరిగిన మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. రెండో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించడంతో ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. మొదటి రోజు వరంగల్ తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులు చేయగా, ఖమ్మం 85 పరుగులకే ఆలౌటైంది.
నల్లగొండపై కరీంనగర్ గెలుపు
Published Mon, Jul 21 2014 12:24 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement