karimnagar team
-
యోగాలో ఓవరాల్ చాంపియన్ కరీంనగర్
హ్యాట్రిక్ కైవసం చేసుకున్న జిల్లా జట్టు కరీంనగర్ స్పోర్ట్స్: ఆదిలాబాద్ జిల్లా బాసరలో ఈనెల 8 నుంచి 10వరకు జరిగిన రాష్ట్రస్థాయి యోగాసన చాంపియన్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. మూడు బంగారు, ఐదు రజత, నాలుగు కాంస్య పతకాలు సాధించి 23పాయింట్లతో ఓవరాల్ చాంపియన్ షిప్‌ను కైవసం చేసుకున్నారు. శనివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి జిల్లా జట్టుకు ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను అందించారు. పతకాలు సాధించిన క్రీడాకారులు బంగారు పతకాలు: పూజ(దూమాల), సమత(జగిత్యాల), ఆనంద్ కిశోర్(కరీంనగర్) రజత పతకాలు: రాకేశ్(రుక్మాపూర్), ప్రేమలత(దూమాల), వీణ(సుల్తానాబాద్), దేవయ్య (గంభీరావుపేట), రాజు కాంస్య పతకాలు: వెంకటేశ్(మానకొండూర్), సృజన్ (పూడూరు), రవీనా (దూమాల), మల్లేశ్వరీ (కరీంనగర్) -
నల్లగొండపై కరీంనగర్ గెలుపు
అంతర్ జిల్లా రెండు రోజుల లీగ్ సాక్షి, హైదరాబాద్: అంతర్ జిల్లా రెండు రోజుల క్రికెట్ లీగ్‌లో కరీంనగర్ జట్టు రెండు వికెట్ల తేడాతో నల్లగొండపై ఉత్కంఠ విజయం సాధించింది. రెండో రోజైన ఆదివారం ఒక్కరోజే 27 వికెట్లు కూలాయి. ఓవర్‌నైట్ స్కోరు 101/1తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కరీంనగర్ 50 ఓవర్లలో 280 పరుగుల వద్ద ఆలౌటైంది. శేఖర్ (70), శశ్వంత్ రెడ్డి (65 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నల్లగొండై జట్టు 39 ఓవర్లలో 187 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో నల్లగొండై 236 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టుకు ఓవరాల్‌గా 143 పరుగుల ఆధిక్యం మాత్రమే దక్కింది. ఆపై రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడిన కరీంనగర్ జట్టు 36.5 ఓవర్లలోనే 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసి లక్ష్యాన్నందుకుంది. నల్లగొండ బౌలర్లలో ఉపేందర్ రెడ్డికి నాలుగు వికెట్లు (4/48) దక్కాయి. ఇక వరంగల్, ఖమ్మం మధ్య జరిగిన మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. రెండో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించడంతో ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. మొదటి రోజు వరంగల్ తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులు చేయగా, ఖమ్మం 85 పరుగులకే ఆలౌటైంది. -
ఫైనల్లో మెదక్, నిజామాబాద్
జింఖానా, న్యూస్‌లైన్: అంతర్ జిల్లా అండర్-14 వన్డే క్రికెట్ టోర్నీలో మెదక్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో మెదక్ 64 పరుగుల తేడాతో కరీంనగర్ జట్టుపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన మెదక్ 221 పరుగులు చేసి ఆలౌటైంది. అబ్దుల్ గఫూర్ (45), ఉదయ్ కిరణ్ (37) ముఖేశ్ (37) ఫర్వాలేదనిపించారు. అనంతరం బరిలోకి దిగిన కరీంనగర్ 157 పరుగులకే కుప్పకూలింది. సాయి వినయ్ (34) మినహా మిగిలిన వారు రాణించలేకపోయారు. మరో సెమీఫైనల్లో నిజామాబాద్ జట్టు 81 పరుగుల తేడాతో ఆదిలాబాద్ జట్టుపై నెగ్గి ఫైనల్లోకి దూసుకెళ్లింది. మొదట నిజామాబాద్ 8 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. హర్షవర్ధన్ (89), అఫ్రోజ్ ఖాన్ (66) అర్ధ సెంచరీలతో రాణించారు. తర్వాత బరిలోకి దిగిన ఆదిలాబాద్ 180 పరుగుల వద్ద ఆలౌటైంది. హిమతే జ్ (51 నాటౌట్) అర్ధ సెంచరీతో అజేయంగా నిలిచాడు. నిజామాబాద్ బౌలర్ అనిరుధ్ రెడ్డి 3 వికెట్లు తీసుకున్నాడు. రాణించిన త్రిశాంక్, అజీమ్ ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ వాండరర్స్ బౌలర్లు త్రిశాంక్ గుప్తా (5/32), అజీమ్ (5/32) చెరో 5 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టుకు చుక్కలుచూపించారు. దీంతో ఆ జట్టు 156 పరుగుల భారీ తేడాతో మహబూబ్ కాలేజి జట్టుపై ఘనవిజయం సాధించింది. మొదట హైదరాబాద్ వాండరర్స్ 240 పరుగులు చేసి ఆలౌటైంది. భవేశ్ (58) అర్ధ సెంచరీతో చెలరేగగా... ఓవైసీ (43) మెరుగ్గా ఆడాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మహబూబ్ కాలేజి 84 పరుగులకే చేతులెత్తేసింది.