
ఐపీఎల్‌లో భాగంగా తలపడేందుకు ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ), చైన్నె సూపర్ కింగ్స్(సీఎస్‌కే) జట్లు శుక్రవారం సాయంత్రం విశాఖ చేరుకున్నాయి

ఇరు జట్లకు విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు

రెండు జట్ల సభ్యులు ప్రత్యేక బస్సుల్లో రోడ్డు మార్గంలో రాడిసన్ బ్లూ హోటల్ వెళ్లారు

పీఎంపాలెంలోని వైఎస్సార్ స్టేడియంలో ఆది వారం ఇరు జట్లు తలపడనుండగా.. శనివారం ప్రాక్టీస్ చేయనున్నాయి

ఈ మ్యాచ్ టికెట్లు హాట్‌కేక్‌లా నిమిషాల వ్యవధిలోనే అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే




























