
టీమిండియా దిగ్గజ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి మిస్టర్ కూల్ అని నిరూపించుకున్నాడు.

మ్యాచ్ మధ్యలో మైదానంలోకి దూసుకువచ్చిన అభిమానిని ఆలింగనం చేసుకుని సాదరంగా వీడ్కోలు పలికాడు.

ఓ యువకుడు మైదానంలోకి దూసుకువచ్చాడు. అతడి రాకను గమనించిన ధోని తొలుత దూరంగా పారిపోతున్నట్లు నటించాడు.

అతడు వచ్చి పాదాలకు నమస్కరించగానే భుజం తట్టిలేపి ఆలింగనం చేసుకుని ఇక వెళ్లు అన్నట్లుగా కూల్‌గా డీల్ చేశాడు.










