ఐపీఎల్ జట్టైన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను కొనుగోలు చేయడం ద్వారా క్రికెట్ సంబంధిత వ్యాపారంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్.. త్వరలోనే ఓ భారీ క్రికెట్ స్టేడియంను నిర్మించాలనే ప్లాన్‌లో ఉన్నాడు. భారీ వ్యయంతో, సుమారు పదివేల మంది సీటింగ్ కెపాసిటీతో (15 ఎకరాల విస్తీర్ణంలో), అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్ట్‌ను అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ప్రాంతంలో (ఐర్విన్ సిటీ) నిర్మించేందుకు సన్నాహకాలను మొదలుపెట్టాడు.
🚨 STADIUM NEWS 🚨 Plans are underway to build an iconic home for cricket in the Greater Los Angeles metropolitan area!
— Major League Cricket (@MLCricket) April 29, 2022
"MLC venue in Southern California takes significant step forward with Great Park in the City of Irvine"
👉 https://t.co/WLUigjldoU 👈 #buildamericancricket pic.twitter.com/BKo9CGKpGq
మేజర్ లీగ్ క్రికెట్ టీ20 (ఎంఎల్సీ) తో కలిసి అతను సహా యజమానిగా ఉన్న నైట్‌రైడర్స్ గ్రూప్ (కేఆర్జీ) ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టనుంది. ఈ మేరకు ఎంఎల్సీ-కేఆర్జీల మధ్య ఒప్పందాలు కూడా పూర్తయ్యాయి. 2024 టీ20 వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్‌తో పాటు యూఎస్ఏ కూడా ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో కింగ్ ఖాన్ ఈ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశాడు. ఇదే విషయమై బాద్షా స్పందిస్తూ.. అమెరికాలో రాబోయే రోజుల్లో క్రికెట్ వ్యాప్తి పెరుగుతుందనే నమ్మకంతో ఎంఎల్సీతో కలిసి పెట్టుబడులు పెడుతున్నామని తెలిపాడు.
చదవండి: ఫాస్టెస్ట్ డెలివరీ వేసింది అక్తర్ కాదు, నేనే.. అప్పట్లో మిషన్లు పని చేయక..!
Comments
Please login to add a commentAdd a comment