BCCI Preference Visakhapatnam Stadium Over India Cricket Matches - Sakshi
Sakshi News home page

విశాఖకే బీసీసీఐ తొలి ప్రాధాన్యత

Published Thu, Jul 27 2023 12:14 PM | Last Updated on Thu, Jul 27 2023 12:58 PM

Bcci Preference Visakhapatnam Stadium Over India Cricket Matches - Sakshi

విశాఖ: భారత్‌ హోం సిరీస్‌లో విశాఖకే బీసీసీఐ తొలి ప్రాధాన్యతనిచ్చిందని ఏసీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ కార్యదర్శి ఎస్‌.ఆర్‌.గోపీనాథ్‌ రెడ్డి చెప్పారు. దీనిలో భాగంగానే వైఎస్సార్‌ ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు భారత్‌తో తలపడనున్నాయని తెలిపారు. ఆయన బుధవారం విశాఖలో విలేకరులతో మాట్లాడారు.

వరల్డ్‌ కప్‌ వ్యచ్‌లు ముగియగానే ఆస్ట్రేలియా ఆడనున్న టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌ నవంబర్‌ 23న, ఫిబ్రవరి 2 నుంచి భారత్‌–ఇంగ్లండ్‌ జట్ల మధ్య టెస్ట్‌ మ్యాచ్‌ను విశాఖలో నిర్వహించేందుకు బీసీసీఐ షెడ్యూల్‌ ఖరారు చేసిందని వివరించారు. విశాఖలోని వైఎస్సార్‌ స్టేడియం ఇప్పటికే అన్ని ఫార్మాట్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిందని, ఇటీవల సీఎం జగన్‌ విశాఖలో మరో స్టేడియం నిర్మించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారని గుర్తు చేశారు. ఇందులో భాగంగా క్రికెట్‌తో పాటు అన్ని క్రీడలు ఆడుకునే విధంగా ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను 25 ఎకరాల్లో నిర్మించాలన్నారు. దీనిపై ఏసీఏ ప్రణాళిక సిద్ధం చేస్తుందని, స్థల కేటాయింపునకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు గోపీనాథ్‌ రెడ్డి తెలిపారు.

చదవండి   విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా.. భారత్‌ పాస్‌పోర్టుతో 57 దేశాలకు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement