
రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు విస్తరించి ఉన్న 200 ఎకరాల్లో స్టేడియం నిర్మాణం చేపట్టాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ కోరారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్‌కు బుధవారం ఆయన లేఖ రాశారు. స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో స్టేడియం నిర్మాణాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. 1999లో ఆర్ట్స్ కళాశాలలో స్టేడియం నిర్మాణానికి నాటి సీఎం చంద్రబాబు శిలాఫలకం వేశారని, అప్పుడు కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందని గుర్తు చేశారు.
ఆ తర్వాత పాలన చేపట్టిన వైఎస్సార్ హయాంలో సెంట్రల్ జైలులోని సువిశాల స్థలంలో పూర్తి స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మించడానికి ప్రతిపాదన చేశారని చెప్పారు. అది సాకారమవుతున్న సమయంలో ఆయన మృతి చెందడంతో ఆ ప్రతిపాదన ఆగిపోయిందన్నారు. అప్పట్లో స్టేడియం నిర్మాణానికి స్థలం మంజూరు చేస్తూ జైలు శాఖ ఇచ్చిన ఉత్తర్వుల నకలును కూడా లేఖకు జత చేశారు.
Comments
Please login to add a commentAdd a comment