ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా ఖ్యాతికెక్కిన అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియం ఏరియల్ వ్యూ ఫొటోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ స్టేడియంలో సీటింగ్ సామర్థ్యం ఏకంగా 1,10,000 కావడం గమనార్హం. బీసీసీఐ ఈ స్టేడియం ఏరియల్ వ్యూ ఫొటోలను షేర్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యక్రమానికి ఈ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.
ట్రంప్ పర్యటన నేపథ్యంలో మైదానాన్ని నిర్వహకులు అత్యంత సుందరంగా తీర్చదిద్దారు. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ట్రంప్ పర్యటించనున్నారు. ఇప్పటివరకు ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా రికార్డు సొంతం చేసుకున్న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ స్టేడియం రికార్డును బ్రేక్ చేస్తూ.. అత్యంత విశాలమైన స్టేడియంగా మొతేరా స్టేడియం నిర్మితమైంది.
#MoteraStadium gearing up for #NamasteTrump !!
— Meghna Dev (@DevMeghna) February 18, 2020
Witness the world's biggest cricket stadium host the oldest and biggest democracies of the world!
Watch all the action only on @DDNewslive @DDNewsHindi @DDIndialive @PBNS_India @shashidigital @Chatty111Prasad pic.twitter.com/q2Wevmd72Z
Comments
Please login to add a commentAdd a comment