
సాక్షి, అమరావతి: పలు ఉద్యమాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులను ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి కేఆర్‌ఎం కిశోర్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 2016 జనవరిలో తుని, తూర్పుగోదావరి జిల్లాలో కాపు ఉద్యమం నేపథ్యంలో నమోదైన కేసులను ఎత్తివేస్తున్నట్టు తెలిపారు. దీంతో పాటు భోగాపురం విమానాశ్రయం భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో నమోదైన కేసులను కూడా ఎత్తివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గుంటూరు, అనంతపురం సహా వివిధ ప్రాంతాల్లో రిలయన్స్ ఆస్తుల ధ్వంసం కేసులను ఎత్తివేసున్నామని కిశోర్ కుమార్ చెప్పారు.