పోలీసుల జులుం ఎల్లకాలం సాగదు: వైఎస్‌ జగన్‌ | YS Jagan Serious On Police Behaviour At Assembly Gate, Watch Video Inside | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ వద్ద పోలీసుల ఓవరాక్షన్‌.. వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

Published Mon, Jul 22 2024 10:15 AM | Last Updated on Mon, Jul 22 2024 11:49 AM

YS Jagan Serious On Police Behaviour At Assembly Gate

అమరావతి, సాక్షి: ఏపీ అసెంబ్లీ వద్ద పోలీసులు ఓవరాక్షన్‌కి  దిగారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడంపై అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపేందుకు నల్ల కండువాలు, బ్యాడ్జీలతో అసెంబ్లీకి చేరుకున్నారు వైఎస్సార్‌సీపీ చట్ట సభ్యులు. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నేతృత్వంలో ‘‘సేవ్‌ డెమోక్రసీ’’ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. అయితే..

వైఎస్సార్‌సీపీ చట్ట సభ్యుల్ని గేటు వద్దే  పోలీసులు అడ్డుకున్నారు. ఫ్లకార్డులు ప్రదర్శించొద్దంటూ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ప్లకార్డుల్ని లాగేసి చించేశారు. దీంతో వైఎస్‌ జగన్‌  పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘‘ప్లకార్డులు ఆపాలని ఎవరు చెప్పారు?. అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు. పోలీసుల జులుం ఎల్లకాలం సాగదు. పోలీసులు ఉన్నది ప్రజాస్వామాన్ని ఖూనీ చేయడానికి కాదు. ప్రజా స్వామ్యాన్ని కాపాడటం ముఖ్యం. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. పోలీసులు వైఖరి అత్యంత దారుణంగా ఉంది. చట్ట ప్రకారం పోలీసులు పని చేయాలి’’ అంటూ అన్నారాయన.

 

ఈ క్రమంలో అసెంబ్లీ గేటు వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అయితే జగన్‌ నిలదీత, ఈలోపు సభ ప్రారంభం అవుతుండడంతో కాసేపటికికే నల్ల కండువాలతోనే వైఎస్సార్‌సీపీ సభ్యుల్ని పోలీసులు లోపలికి అనుమతించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement