లండన్: బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ ఉన్నప్పుడూ హోం సెక్రటరీగా ఉన్న సుయోల్లా బ్రేవర్ మాన్ భద్రతా ఉల్లంఘనల విషయమై పదవి నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. బ్రేవర్ మాన్ రాజీనామ చేసిన కొద్దిరోజుల్లోనే లిజ్ ట్రస్ కూడా అనుహ్యాంగా ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐతే ఇప్పుడు బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్ మళ్లీ సుయోల్లా బ్రేవర్‌మాన్‌ని తిరిగి హోమంత్రిగా నియమించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని సునాక్ తీసుకున్న అతిపెద్ద తప్పుడు నిర్ణయంగా అభివర్ణిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.
భద్రతా నియమావళిని ఉల్లంఘించిన ఒక మంత్రి మళ్లీ తిరిగి నియమించడం బాధ్యతారహితమైన నిర్ణయం అంటూ రిషిపై వ్యతిరేకత వెల్లువెత్తింది. మరోవైపు లేబర్ నాయకుడు కైర్ స్టార్‌మర్, కూపర్‌లు కూడా ఆమెని తొలగించాలని పట్టుపట్టారు. బ్రేవర్ మాన్ అత్యంత మితవాద టోరీ ఎంపీలకు ప్రాతినిథ్యం వహిస్తుందంటూ ఆరోపణలు చేశారు. ఆమె యూకేకు అక్రమంగా వచ్చిన వలసదారులను రువాండ్‌కు పంపించేందుకు మద్దతు ఇచ్చిందంటూ ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు.
అదీగాక ఆమె ఒక ప్రైవేట్ ఇ-మెయిల్‌కు సెన్సిటివ్ డాక్యుమెంట్‌ని పంపించిన వివాదాన్ని ఎదుర్కొంటోంది. అలాంటి ఆమెను దేశీయ భద్రతా సమస్యలకు బాధ్యత వహించే ప్రముఖ స్థానానికి మళ్లీ తిరిగి నియమించడంపై బ్రిటన్ అంతటా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు రిషి సునాక్ కూడా ఆ వివాదానికి పూర్తి బాధ్యత వహించాల్సిందేనని అంటున్నారు.
(చదవండి: బ్రిటన్ మాజీ ప్రధాని ఫోన్ హ్యాక్ చేసిన పుతిన్ ఏజెంట్లు.. రష్యా చేతికి కీలక రహస్యాలు!)
Comments
Please login to add a commentAdd a comment