Indian origin woman
-
పెర్రీ చనిపోయిన ఇల్లు.. రూ.71 కోట్లకు కొన్న భారతీయ మహిళ
ప్రముఖ అమెరికన్-కెనడియన్ నటుడు, ప్రఖ్యాత టీవీ సిరీస్ ‘ఫ్రెండ్స్’ స్టార్ మాథ్యూ పెర్రీ ఇంటిని భారత్‌కు చెందిన ఓ మహిళ కొనుగోలు చేశారు. అది కూడా రూ.71 కోట్లు పెట్టి మరీ కొన్నారు. పెర్రీ కెటామైన్ డోస్ ఎక్కువై ఆ ఇంట్లోనే తుది శ్వాస విడిచారు.సాధారణంగా భారతీయులు.. ఎవరైనా ఇంట్లో చనిపోతే ఆ ఇల్లు కొనడానికి ఇష్టపడరు. కానీ భారతీయ మూలాలున్న అనితా వర్మ-లాలియన్ లాస్ ఏంజిల్స్‌లోని మాథ్యూ పెర్రీ విల్లాను కొనుగోలు చేశారు. అక్కడ ఆయన గతేడాది అక్టోబర్‌లో హాట్ టబ్‌లో చనిపోయారు.పెర్రీ జ్ఞాపకాలకు గౌరవంపెర్రీ జ్ఞాపకాలు, సానుకూల అంశాలను గౌరవించాలనే ఉద్దేశంతో ఈ ఇంటిని కొనుగోలు చేసినట్లు అనితా వర్మ చెబుతున్నారు. హిందూ మతాన్ని ఆచరించే ఆమె అక్కడ పూజలు చేయించారు. ఆ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.ఎవరీ అనితా వర్మ?భారతీయ మూలాలున్న అనితా వర్మ-లాలియన్ క్యామెల్బ్యాక్ ప్రొడక్షన్స్ అనే ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీని స్థాపించారు. వర్మ-లాలియన్ అరిజోనాలో ప్రసిద్ధ వాణిజ్య రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కూడా. ఆమె తన కుటుంబ వ్యాపారమైన వర్మలాండ్ను విడిచి అరిజోనా ల్యాండ్ కన్సల్టింగ్ను ప్రారంభించారు. కాగా ఇక ఇంటి విషయానికి వస్తే అనితా వర్మ 8.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.71 కోట్లు) పెట్టి కొనుగోలు చేశారు. ఇదే ఇంటిని పెర్రీ 2020లో 6 మిలియన్ డాలర్లకు కొన్నారు. -
NRI News: తల్లిని చిదిమేసిన విమానం.. కూతురి పరిస్థితి విషమం
న్యూజెర్సీ: న్యూయార్క్‌లో జరిగిన విమాన ప్రమాదంలో భారత సంతతికి చెందిన మహిళ ఒకరు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో ఆమె కూతురు, పైలట్ గాయాలతో బయటపడినప్పటికీ.. వాళ్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రోమా గుప్తా(63), ఆమె తనయ రీవా గుప్తా(33)లు ఆదివారం ఓ తేలికపాటి ప్రదర్శన విమానంలో ప్రయాణించారు. ఆ సమయంలో కాక్‌పిట్ నుంచి పొగ రావడంతో పైలెట్ దానిని లాంగ్ ఐల్యాండ్ వద్ద క్రాష్ ల్యాండ్ చేశాడు. ఈ ఘటనలో విమానంలో మంటలు చెలరేగి రోమా అక్కడిక్కడే మృతి చెందగా.. కాలిన గాయాలతో రీవా, పైలెట్(23)లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీళ్లిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తూర్పు ఫార్మింగ్డేల్ రిపబ్లిక్ ఎయిర్పోర్ట్ నుంచి విమానం ముగ్గురితో టేకాఫ్ అయ్యింది. ప్రమాదానికి గురైన ఫోర్ సీటర్ విమానం టూరిస్ట్ ఫ్లైట్ అని, కేవలం ప్రదర్శన(డెమో) కోసమే ఉంచారని అధికారులు చెబుతున్నారు . అయితే న్యూజెర్సీకి చెందిన ఆ తల్లీకూతుళ్లు ఆ తేలికపాటి విమానాన్ని కొనుగోలు చేసినట్లు విమాన కంపెనీ తరపు న్యాయప్రతినిధులు చెప్తున్నారు. మరోవైపు ప్రమాదానికి గల కారణాలను కనిపెట్టేందుకు ఒకవైపు ఎన్టీఎస్బీ(National Transportation Safety Board), మరోవైపు ఎఫ్ఏఏ(Federal Aviation Administration) దర్యాప్తు చేపట్టాయి. ఇప్పటికే మూడుసార్లు ప్రమాద స్థలానికి వెళ్లి.. శకలాలను పరిశీలించారు. ఇదిలా ఉంటే.. గుప్తా కుటుంబం కోసం GoFundMe ద్వారా ఇప్పటికే 60వేలకు పైగా డాలర్లను సేకరించారు. -
రిషీ కేబినెట్:హోం సెక్రటరీగా ఆమె రీఎంట్రీ
న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రావెర్మన్ తిరిగి యూకే హోం సెక్రటరీగా నియమితులయ్యారు. బ్రిటీష్ ప్రధానమంత్రిగా రిషి సునాక్ కీలక క్యాబినెట్ నియామకాల్లో భాగంగా సుయెల్లా హోంమంత్రి పదవిని దక్కించు కున్నారు. అలాగే ఆర్థిక స్థిరత్వం కోసం కొత్త ఛాన్సలర్ జెరెమీ హంట్‌ను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. సునాక్ విధేయుడు కానప్పటికీ, జేమ్స్ క్లవర్లీని విదేశాంగ కార్యదర్శి పదవిలో కొనసాగేలా నిర్ణయం తీసుకున్నారు. కాగా లిజ్ ట్రస్ ప్రధానమంత్రిగా ఉన్నపుడు ఇమ్మిగ్రేషన్ డ్రాఫ్ట్‌ను బ్రిటన్ ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పించక ముందే అప్పటి హోం సెక్రటరీ సుయెల్లా బ్రావెర్మన్ ఈ పాలసీ డ్రాఫ్ట్‌ను వ్యక్తిగత మెయిల్ నుంచి పంపడం వివాదాన్ని రేపింది. ఈ వ్యవహారం సుయెల్లా రాజీనామాకు దారి తీసింది. ఈ సందర్భంగా అప్పటి ప్రభుత్వంపై సుయెల్లా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. -
గ్లోబల్ కంపెనీకి సీఈవోగా భారతీయ మహిళ
న్యూఢిల్లీ: గ్లోబల్ కంపెనీలకు సారధ్యం వహిస్తున్నవారిలో భారత సంతతికి చెందిన వారు ప్రముఖంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా మహిళా బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లు తగ్గేదేలే అంటున్నారు. తాజాగా ఓగిల్వీ కొత్త గ్లోబల్ సీఈవోగా భాతర సంతతికిచెందిన దేవిక బుల్చందానీ ఎంపికయ్యారు. జూన్ 2020 ఈ పదవిలో ఉన్న ఆండీ మెయిన్ నుండి దేవిక ఈ బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆండీ 2022 చివరి వరకు సీనియర్ సలహాదారుగా వ్యవహరిస్తారు. ఉత్తర అమెరికా గ్లోబల్ ప్రెసిడెంట్ , సీఈవోగా ఒగిల్వీలో చేరిన రెండు సంవత్సరాల కంటే తక్కువ సమయంలో, దేవిక బుల్చందానీ గ్లోబల్ సీఈవోగా నిలవడం విశేషం. అడ్వర్టైజింగ్ సర్కిల్స్‌లో ఆమెకు పేరుగాంచిన “దేవ్”, రెండు దశాబ్దాలకు పైగా మెక్కాన్తో ఉన్నారు. మాస్టర్ కార్డ్ అడ్వర్టైజింగ్ కాన్సెప్ట్‌ను గ్లోబల్ బిజినెస్‌గా విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఒగిల్వీ గ్లోబల్ సీఈవోగా 93 దేశాలలో 131 కార్యాలయాలలోపబ్లిక్ రిలేషన్స్, అనుభవం, కన్సల్టింగ్, ఆరోగ్యం ఏజెన్సీ వ్యాపారాలకు బాధ్యత వహిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద యాడ్స్ కంపెనీ డబ్ల్యూపీపీలో ఒగిల్వీ ఒక భాగం. లండన్-ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న సంస్థ ఆదాయం 2021 నాటికి 12 బిలియన్ డాలర్లకుపై మాటే. దేవిక ఎంపీకపై డబ్ల్యూపీపీ సీఈవో మార్క్ రీడ్ స్పందిస్తూ, క్రియేటివిటీ చాంపియన్ బుల్చందానీ ప్రతిభా పాటవాలపై సంతోషం వ్యక్తం చేశారు. కాగా అమృత్‌సర్‌లో బాల్యాన్ని గడిపిన దేవికా బుల్చందానీ డెహ్రాడూన్‌లోని వెల్హామ్ బాలికల పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. తర్వాత ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో ఇంగ్లీష్, సైకాలజీలో డిగ్రీ, సౌత్ కాలిఫోర్నియా యూనివర్శిటీలో కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. మాస్టర్‌కార్డ్‌తో పాటు, ఆమె క్రాఫ్ట్ అండ్ యూనిలీవర్లో పనిచేశారు. 2017లో ఫియర్లెస్ గర్ల్ క్యాంపెయిన్ చేపట్టారు. కార్యాలయాల్లో లింగ వైవిధ్యంపై దృష్టి సారించారు. రెండేళ్ల క్రితం ఓగిల్వీలో చేరారు దేవిక బుల్చందానీ. -
మిస్ సింగపూర్‌గా తెలుగమ్మాయి
కౌలలాంపూర్: విదేశాల్లో జరిగే అందాల పోటీల్లో మన భారతీయులు ప్రతిభ చాటిన సంఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ఓ తెలుగుమ్మాయి వచ్చి చేరింది. సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్ యూనివర్స్ సింగపూర్-2021గా ఎన్నికయ్యింది నందిత. ఆ వివరాలు.. నందిని స్వస్థలం ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా. దాదాపు 25 సంవత్సరాల క్రితం నందిత తల్లిదండ్రులు మాధురి, గోవర్ధన్‌లు సింగపూర్ వెళ్లి అక్కడే స్థిర పడ్డారు. వీరికి నందితతో పాటు మరో కుమారుడు ఉన్నారు. నందితకు ఫ్యాషన్ ప్రపంచం అంటే చిన్ననాటి నుంచి అమితమైన ఆసక్తి. దానిలో భాగంగానే పార్ట్ టైమ్ మోడల్‌గా పని చేసేది నందిత. ఆ ఆసక్తితోనే నందిత ఈ ఏడాది మిస్ యూనివర్స్ సింగపూర్-2021లో పోటీలో పాల్గొంది. అందం, తెలివితేటలతో ప్రథమ స్థానంలో నిలిచి అందాల కిరీటం దక్కించుకుంది. టైటిట్ గెలిచిన అనంతరం నందిత జాతివివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేస్తానని తెలిపింది. ఈ ఏడాది డిసెంబర్లో ఇజ్రాయెల్‌లోని ఐలాట్‌లో జరిగే మిస్ యూనివర్స్ అందాల పోటీలో ఆమె సింగపూర్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. (చదవండి: షాకింగ్: అందాల పోటీ విజేతకు వేదిక మీదే ఘోర అవమానం) ప్రస్తుతం నందిత సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (బిజినెస్ అనలిటిక్స్) కోర్సును అభ్యసిస్తోంది. కోడింగ్ వంటి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం అంటే ఆమెకు ఎంతో ఇష్టమట. ఆమె హాబీలలో స్కేటింగ్, వంట, డ్యాన్స్ ఉన్నాయి. నందిత సింగపూర్‌లోని కేర్ కార్నర్లో వాలంటీర్‌గా పని చేస్తూ.. అక్కడ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మార్గదర్శకత్వం చూపడమే కాక జీవిత నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయపడుతుంది. (చదవండి: అశ్లీల నృత్యం.. అందాల కిరీటం వెనక్కి) గత సంవత్సరం, నందిత సింగపూర్ హౌసింగ్ అండ్ డెవలప్మెంట్ బోర్డ్‌ను ప్రమోట్ చేసే టీవీ యాడ్‌లో కనిపించింది. ఈ సంవత్సరం మార్చిలో, ఆమె సింగపూర్‌లోని ఆర్ట్-సైన్స్ మ్యూజియంలో లూయిస్ విట్టన్ ఉమెన్స్ స్ప్రింగ్ సమ్మర్ 2021 లో మోడల్‌గా చేసింది. అలానే డిసెంబర్ 2020-జనవరి 2021 వోగ్ సింగపూర్ సంచికలో కూడా కనిపించింది. చదవండి: Miss Universe: ఏంటీ ఆండ్రియాకు పెళ్లైందా?! -
ఫోర్బ్స్ జాబితాలో ఐదుగురు భారతీయ మహిళలు
న్యూయార్క్: భారత సంతతికి చెందిన ఐదుగురు మహిళలకు అరుదైన గౌరవం దక్కింది. యూఎస్ రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమెన్ పేరుతో తాజాగా విడుదల చేసిన ఫోర్బ్స్ జాబితాలో ఇండో అమెరికన్ మహిళలు స్థానం సంపాదించారు. ఈ జాబితాలో.. అరిస్టా నెట్వర్క్ సీఈఓ జయశ్రీ ఉల్లాల్ 1.7బిలియన్ డాలర్ల ఆస్తులతో 16వ స్థానంలో నిలవగా.. సింటెల్ ఐటీ కంపెనీ సహ వ్యవస్థాపకురాలు నీర్జా సేథి.. 1 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులతో 26వ స్థానంలో నిలిచారు. కాన్ఫ్లుయెంట్స్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు నేహా నార్ఖడే 925 మిలియన్ డాలర్లు, జింగో బయోవర్క్స్ సహ వ్యవస్థాపకురాలు రేష్మా శెట్టి 750 మిలియన్ డాలర్ల ఆస్తులతో వరుసగా 29, 39వ స్థానాల్లో నిలిచారు. పెప్సికో సంస్థ సీఈఓగా విధులు నిర్వర్తిస్తున్న ఇంద్ర నూయి.. 290 మిలియన్ డాలర్ల ఆస్తులతో ఫోర్బ్స్ జాబితాలో 91వ స్థానంలో నిలిచారు. -
వీణారెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ(యూఎస్ఏఐడీ) మిషన్ డైరెక్టర్‌గా భారత సంతతి మహిళ వీణా రెడ్డి గురువారం బాధత్యలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వీణా రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. అమెరికాలో భారత సంతతికి చెందిన మొదటి దౌత్యవేత్తగా ఈ ఘనత సాధించినందుకు గర్వపడుతున్నాను అన్నారు. ఈ మేరకు సీఎం జగన్ ట్వీట్ చేశారు. Congratulations Veena Reddy for being the first diplomat of Indian origin to head @usaid_india. Proud of your achievement. @USCGHyderabad @USAmbIndia @USAndIndia — YS Jagan Mohan Reddy (@ysjagan) August 5, 2021 యూఎస్ఏఐడీ(USAID) మిషన్ డైరెక్టర్‌గా ఎంపికైన వీణా రెడ్డి భారత్‌తో పాటు భూటాన్‌లో సేవలు అందించనున్నారు. వీణా రెడ్డి ఇంతకాలం ఇదే ఏజెన్సీలో ఫారిన్ సర్వీస్ ఆఫీసర్‌గా పని చేశారు. కంబోడియా మిషన్ డైరెక్టర్‌గా 2017 ఆగష్టు నుంచి ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. హైతి భూకంప సమయంలో రక్షణ-అభివృద్ధి చర్యల పర్యవేక్షకురాలిగా ఆమె మెరుగైన ప్రదర్శన కనపరిచారు. ఈ పదవుల కంటే ముందు వీణా రెడ్డి వాషింగ్టన్లో అసిస్టెంట్ జనరల్ కౌన్సెల్‌గా ఆసియా దేశాల సమస్యలపై ప్రభుత్వ న్యాయసలహాదారుగా పని చేశారు. చికాగో నుంచి బీఏ, ఎంఏ, లా కోర్సులు పాసైన వీణారెడ్డి.. కొలంబియా యూనివర్సిటీ నుంచి ‘జురిస్ డాక్టరేట్’(జేడీ) అందుకుంది. న్యూయార్క్, కాలిఫోర్నియా బార్ అసోషియేషన్‌లో వీణకు సభ్యత్వం ఉంది. -
భారత సంతతి జర్నలిస్ట్‌కు పులిట్జర్ పురస్కారం
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన జర్నలిస్ట్ మేఘ రాజగోపాలన్ ప్రతిష్టాత్మక పులిట్జర్ పురస్కారానికి ఎంపికయ్యారు. మరో ఇద్దరితో కలిసి శుక్రవారం ఆమె ఈ పురస్కారాన్ని గెలుచుకున్నారు. చైనా జిన్జియాంగ్ ప్రాంతంలో రహస్యంగా వందలాది జైళ్లు, నిర్బంధ శిబిరాలు నిర్మించి.. వేలాది మంది ముస్లింలను అదుపులోకి తీసుకుని.. చిత్ర హింసలకు గురి చేస్తోన్న విషయాలను వెల్లడించినందుకు మేఘ రాజగోపాలన్ ఈ బహుమతి గెలుచుకున్నారు. పులిట్జర్ ప్రైజ్ గెలుచుకున్న ఇద్దరు భారత సంతతి జర్నలిస్టులలో అమెరికా బజ్‌ఫీడ్ న్యూస్‌కు చెందిన ఎంఎస్ రాజగోపాలన్ ఒకరు. ఈమె ప్రచురించిన జిన్జియాంగ్ సిరీస్ అంతర్జాతీయ రిపోర్టింగ్ విభాగంలో పులిట్జర్ బహుమతిని గెలుచుకుంది. 2017 లో, జిన్జియాంగ్లో చైనా వేలాది మంది ముస్లింలను అదుపులోకి తీసుకోవడం ప్రారంభించిన కొద్దికాలానికే, రాజగోపాలన్ ఒక నిర్బంధ శిబిరాన్ని సందర్శించిన మొదటి వ్యక్తిగా నిలిచారు. తమ దేశంలో అటువంటి ప్రదేశాలు లేవని చైనా ఖండించిన సమయంలో, బజ్‌ఫీడ్ న్యూస్ ఈ విషయాన్ని వెల్లడించింది. "మేఘ రాజగోపాలన్ జిన్జియాంగ్ ప్రాంతంలో సందర్శించిందని గుర్తించిన వెంటనే చైనా ప్రభుత్వం ఆమె నోరు మూయించేందుకు ప్రయత్నించింది, ఆమె వీసాను సస్పెండ్ చేయడమే కాక దేశం నుంచి వెళ్లిపోవాలని బెదిరించింది" అని బజ్‌ఫీడ్ న్యూస్ బహుమతి కోసం పంపిన తన ఎంట్రీలో వెల్లడించింది. డ్రాగన్ బెదిరింపులకు భయపడని మేఘన మరో ఇద్దరి సాయంతో లండన్ నుంచి పనిచేయడం ప్రారంభించారు. వీరిలో ఒకరు అలిసన్ కిల్లింగ్, లైసెన్స్ పొందిన ఆర్కిటెక్చర్, భవనాల ఉపగ్రహ చిత్రాల ఫోరెన్సిక్ విశ్లేషణలో నైపుణ్యం కలిగినవాడు కాగా మరొకరు క్రిస్టో బుస్చెక్ డాటా జర్నలిస్టుల కోసం టూల్స్ రూపొందించే ప్రోగ్రామర్. ఈ ముగ్గురి బృందం చైనా సెన్సార్ చేసిన వేలాది ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించి అక్కడ జరుగుతున్న అరాచకాలను ప్రపంచానికి వెల్లడించారు. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న మేఘన పులిట్జర్ గెలవడంపై స్పందిస్తూ.. ‘‘ఈ అవార్డు గెలుచుకుంటానని తాను అస్సలు ఊహిచలేదని.. పూర్తిగా షాక్‌లో ఉన్నాను’’ అన్నారు మేఘన. చదవండి: అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్‌గా వనితా గుప్తా చైనా క్యాంపుల్లో మహిళలపై అత్యాచారం -
అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్‌గా వనితా గుప్తా
వాషింగ్టన్: అమెరికాలో ప్రముఖ పౌర హక్కుల మహిళా న్యాయవాది, భారతీయ మూలాలున్న వనితా గుప్తా(46) అమెరికా ప్రభుత్వంలో కీలకమైన పదవిని అధిరోహించనున్నారు. వనితా గుప్తాను అసోసియేట్ అటార్నీ జనరల్‌గా ఎంపిక చేస్తూ అమెరికా సెసేట్ నిర్ణయం తీసుకుంది. అమెరికా న్యాయశాఖ విభాగంగా మూడో అత్యున్నత పదవి అయిన అసోసియేట్ అటార్నీ జనరల్‌గా శ్వేతజాతీయేతర వ్యక్తి ఎంపికకావడం ఇదే తొలిసారి. ఈ పదవికి ఎంపికైన తొలి పౌర హక్కుల లాయర్ కూడా వనితనే కావడం గమనార్హం. ఎంపిక విషయంలో సెనేట్‌లో బుధవారం జరిగిన ఓటింగ్‌లో వనితకు మద్దతుగా రిపబ్లికన్ మహిళా సెనేటర్ లీసా ముర్కోవ్స్కీ ఓటు వేశారు. దీంతో 51–49 ఓట్లతో వనిత ఎంపిక ఖాయమైంది. ఒకవేళ ఓటింగ్ ‘టై’ అయితే తన ఓటును వినియోగించుకునేందుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సెనేట్‌కు వచ్చారు. సెనేట్ రెండు పార్టీలకు చెరో 50 మంది సభ్యులు ఉన్నారు. వనిత 28 ఏళ్ల వయసులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. బరాక్ ఒబామా హయాంలో పౌర హక్కులకు సంబంధించి అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా విధులు నిర్వర్తించారు. -
పనిమనిషిపై పైశాచికం.. శరీరంపై 31 గాయాలు
సింగపూర్ సిటీ : సింగపూర్‌లో భారత సంతతికి చెందిన మహిళ తన పనిమనిషి పట్ల పైశాచికంగా ప్రవర్తించింది. ఆకలికి అలమటిస్తున్న ఆమెకు పట్టెడు మెతుకులు కూడా పెట్టకుండా చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెళ్తే.. భారత్‌కు చెందిన గయాతిరి మురుగన్ అనే మహిళ 2015 నుంచి సింగపూర్‌లో నివసిస్తోంది. ఐదు నెలల క్రితం ఆమె మయన్మార్‌కు చెందిన పియాంగ్‌ను పనిలో పెట్టుకుంది. పనిలో చేరిన మరుక్షణం నుంచి గయాతిరి ఆమెతో క్రూరంగా ప్రవర్తించేది. బండెడు చాకిరి చేసిన ఆమెకు కనీసం తినడానికి తిండి కూడా పెట్టేది కాదు. పైగా ప్రతిరోజు ఆమెను కొడుతూ ఉండేది. ఈ క్రమంలో ఓ రోజు ఆమెను ఇంట్లోనే బంధించింది. ఇంట్లోని ఓ రూమ్‌లో గ్రిల్‌కు కట్టేసి, ఆమెపై వేడివేడి పదార్థాలు వేసి నరకం చూపించింది. దీంతో ఆమె పెట్టిన చిత్రహింసలు తాళలేక ఆ పని మనిషి ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహానికి శవ పరీక్ష చేయగా, విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె శరీరంలో 31 చోట్ల గాయాల తాలూకు మచ్చలుండగా, బయట చర్మం మీద 47 గాయాలున్నట్లు డాక్టర్లు తెలిపారు. మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల ఆమె చనిపోయిందన్నారు. పోషకాహారం అందకపోవడం కూడా ఆమె చావుకు మరొక కారణమని పేర్కొన్నారు. కాగా నిందితురాలి మీద 28 అభియోగాల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇది సభ్యసమాజం తలదించుకునే చర్య అని పనిమనిషి బంధువుల తరపు న్యాయవాది మహమ్మద్ ఫైజల్ ఆవేదన వ్యక్తం చేశారు. నిందితురాలికి జీవితఖైదు లేదా 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించాలని కోరారు. చదవండి: కూల్‌డ్రింక్ ఆర్డర్ చేస్తే.. యూరిన్ బాటిల్ వచ్చింది! -
న్యూజిలాండ్ మంత్రికి కేటీఆర్ అభినందనలు
సాక్షి, హైదరాబాద్ : న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ కేబినెట్లో మంత్రిగా బాధ్యతలను చేపట్టనున్న భారతీయ సంతతికి చెందిన ప్రియాంకా రాధాకృష్ణన్ (41)కు తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ప్రధాని జెసిండా మంత్రివర్గంలో చేరనున్న ప్రియాంకకు అభినందనలు అంటూ ఆయన సోమవారం ట్వీట్ చేశారు. న్యూజిలాండ్ దేశంలో ఈ స్థాయికి ఎదిగిన తొలి భారతీయురాలు అంటూ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తాజా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జెసిండాను కూడా ఆయన అభినందించారు. (జెసిండా మరో సంచలనం) Many congratulations to our friend @priyancanzlp on being appointed as Minister in the New Zealand Govt👍 Priyanca Radhakrishnan is the first Indian to be elevated to this position in NZ; My compliments to Prime Minister @jacindaardern on her fabulous leadership & poll victory👏 pic.twitter.com/3Xmqt97zui — KTR (@KTRTRS) November 2, 2020 -
జెసిండా మరో సంచలనం
న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ మరో సంచలననిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోని అత్యంత వైవిధ్యమైన పార్లమెంటులలో ఒకటిగా తీర్చి దిద్దుతున్నారు. మాజీ ఆర్థిక మంత్రి గ్రాంట్ రాబర్ట్సన్ను ఉప ప్రధానమంత్రిగా ప్రకటించారు. అంతేకాదు విదేశాంగ మంత్రిగా నానియా మహూతాను నియమించారు. 20మంది సభ్యుల మంత్రివర్గంలో ఐదుగురు కొత్త మంత్రులను తీసుకున్నారు. కరోనా వైరస్‌తో ఏర్పడిన లాక్డౌన్ వల్ల ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలం చేస్తున్న సమయంలో హెలికాప్టర్ మనీ (ప్రజలకు నేరుగా ఉచితంగా డబ్బును పంపిణీ) అంటూ తీవ్రచర్చకు తెరతీసిన గ్రాంట్ రాబర్ట్సన్ మరోసారి ఆర్థిక మంత్రిగా బాధ్యతలను స్వీకరించనున్నారు విదేశాంగ మంత్రిగా నానియా మహూతా గడ్డం మీద సాంప్రదాయ మావోరి మోకో కాయే పచ్చబొట్టుతో నాలుగేళ్ల క్రితం (1996లో) దేశంలోని మొట్టమొదటి మహిళా పార్లమెంటు సభ్యురాలిగా ఖ్యాతి గడించిన మహూతా తాజాగా మరో రికార్డును సొంతం చేసుకున్నారు. విదేశాంగమంత్రి పదవి చేపట్టనున్న తొలి స్వలింగ సంపర్కురాలు మెహుతా. మునుపటి విదేశాంగ మంత్రి విన్‌స్టన పీటర్స్ కూడా మావోరికి చెందిన వారే కావడం విశేషం. భారత సంతతికి చెందిన ప్రియాంకా రాధాకృష్ణన్ మరోవైపు భారత సంతతికి చెందిన ప్రియాంకా రాధాకృష్ణన్ (41) జెసిండా మంత్రివర్గంలో చోటు సంపాదించారు. కమ్యూనిటీ, వాలంటరీ సెక్టార్ మంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించ నున్నారు. గృహ హింస బాధిత మహిళలు, వలస కార్మికుల తరపున పోరాడుతున్న ప్రియాంకా 2017లో తొలిసారి లేబర్ పార్టీ తరపున పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఇటీవల ఎన్నికల్లో రెండోసారి ఘనవిజయం సాధించి చరిత్ర సృష్టించిన జెసిండా తాజాగా తన క్యాబినెట్‌ను విభిన్నంగా తీర్చిద్దిదారు. ప్రతిభ, యోగ్యత కలిగినవారికే తన మంత్రివర్గంలో చోటిచ్చామని ఇందుకు చాలా గర్వంగా ఉందని ఆమె ప్రకటించారు. రాబోయే మూడేళ్ళు తాము సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉందని ప్రధాని జెసిండా వెల్లింగ్టన్లో విలేకరులతో అన్నారు. కరోనా మహమ్మారి సంక్షోభంతో ప్రపంచ ఆర్థికవ్యవస్థ మాంద్యంలోకి జారుకుందని, ఈ ప్రభావం తమపై కూడా ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఆర్థిక పునరుద్ధరణను వేగవంతం చేయనున్నామనే విశ్వాసాన్ని ఆమె వెల్లడించారు. -
బాలి బీచ్‌లో ‘భారతీయ’ ఎకనామిస్ట్ మృతి
జకర్తా : ప్రముఖ ఆర్థిక నిపుణురాలు ఆకాంశ పాండే ఇండోనేషియాలోని బాలి బీచ్‌లో మృతిచెందారు. శనివారం సాయంత్రం బీచ్‌లోని నిషేధిత ప్రాంతంలో ఆమె స్విమ్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బలమైన అలలు ఒక్కసారిగా ఆమెను తాకడంతో ఆకాంశ ప్రవాహంలో కొట్టుకుపోయారు. బీచ్ లైఫ్‌గార్డ్ ఆమెని కాపాడేందుకు ప్రయత్నించారు. అలల్లో కొట్టుకుపోతున్న ఆమెను బయటకు తీసుకువచ్చిన సిబ్బంది.. వెంటనే ఆమెను సిలోమ్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆకాంశ మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. భారత్ సంతతికి చెందిన ఆకాంశ ప్రస్తుతం యూఎస్‌లో జీవనం కొనసాగిస్తున్నారు. ప్రపంచ బ్యాంక్‌లో సీనియర్ హెల్త్ ఎకనామిస్ట్‌గా ఆమె పనిచేస్తున్నారు. ఈ ఘటనపై బీచ్ అధికారులు మాట్లాడుతూ.. అకాంక్ష స్విమ్ చేస్తున్న ప్రాంతంలో అలల వేగం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అక్కడికి ఎవరు వెళ్లకుండా ఉండేందుకు సూచికలు కూడా ఏర్పాటు చేశామన్నారు. కానీ ఆకాంశ అవేమీ పట్టించుకోలేదని అక్కడికి వెళ్లారని పేర్కొన్నారు. లైఫ్‌గార్డ్‌లు రెండుసార్లు ఆకాంశను హెచ్చరించిన కూడా వారి మాట వినకుండా ఆమె ప్రాణాలు కొల్పోయిందన్నారు. -
లండన్‌లో భారత మహిళ అనుమానాస్పద మృతి
-
భారత సంతతి మహిళ అనుమానాస్పద మృతి
లండన్ : భారత సంతతికి చెందిన సరబ్జిత్ కౌర్(38) అనే మహిళ అనుమానాస్పదస్థితిలో హత్యకు గురైంది. ఈ విషయాన్ని పోలీసులు మూడు నెలల తర్వాత గుర్తించారు. కౌర్ భర్త గురుప్రీత్ సింగే గొంతు నులిమి చంపేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు బుధవారం ఆయనపై కేసు నమోదు చేశారు. గురువారం కోర్టులో ప్రవేశపెట్టారు. ఇంగ్లాండులోని వాల్వర్హాంప్టన్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోస్టుమార్టం నివేదికలో సరబ్జిత్ కౌర్ గొంతునులమడం వల్లే చనిపోయిందని తేలింది. హత్యకు గురైన ఇంటిలో కొన్ని వస్తువులు కూడా అదృశ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. సరబ్జిత్ కౌర్ ఇంటి ఆవరణలో హత్య జరిగిన రోజు అనుమానాస్పదంగా ఓ మహిళ సంచరించినట్లు పోలీసులు సీసీటీవీ కెమెరా ద్వారా గుర్తించారు. ఈ మేరకు అనుమానంగా సంచరిస్తున్న ఓ మహిళ చిత్రాలను కూడా మీడియాకు పోలీసులు విడుదల చేశారు. హత్య భర్త చేశాడా లేక అనుమానంగా సంచరించిన మహిళ చేసిందా అనేది మిస్టరీగా మారింది. -
భర్త పాస్‌పోర్ట్‌తో భార్య ఏం చేసిందంటే.. !
సాక్షి, న్యూఢిల్లీ : మనుషులు పొరపాట్లు చేయడం సహజం. అందులో సరిదిద్దుకొనేవి కొన్ని, సరిదిద్దుకోలేనివి ఇంకొన్ని. కానీ భారత్‌కు చెందిన ఓమహిళ చేసిన పొరపాటు తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకోవాల్సిందే. అదేంటంటే భర్త పాస్‌పోర్ట్‌తో ఏకంగా దేశాలు దాటేసింది. గీతా మోధ అనే భారతీయ మహిళ మాంచెస్టర్‌లో అలంకార్ వస్త్ర దుకాణం నడుపుతోంది. గత ఏప్రిల్ 23న బిజినెస్ పనిమీద ఢిల్లీ రావాల్సి వచ్చింది. అయితే తొందరపాటులో తన పాస్‌పోర్ట్ బదులు భర్త దిలీప్ పాస్‌పోర్ట్‌ను తీసుకొని ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో వయా దుబాయ్ మీదుగా ఢిల్లీ బయలుదేరింది. అయితే విదేశాల నుంచి వచ్చే భారతీయులు ఇమిగ్రేషన్ పూర్తి అయితేనే భారత్‌లోకి రావడానికి అనుమతి ఉంటుంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు గీత ఇమిగ్రేషన్ తనిఖీ చేయడంతో అసలు విషయం బయటపడింది. దీనిపై ఆమె అసహనం వ్యక్తం చేసింది. ఎయిర్‌పోర్టు అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారంటూ మండిపడింది. ఈ విషయంపై ఎయిర్‌లైన్స్ వర్గాలను సంప్రదించగా ఈ సంఘటనపై విచారణం చేపట్టామని పేర్కొన్నారు. -
రెండులక్షల పౌండ్ల ఇంటిని రెండు పౌండ్లకే..
లండన్: ఎంతో కష్టపడి ఆమె తన సొంతింటికలను తీర్చుకుంది. టీచర్‌గా పనిచేస్తూ దాదాపు రెండు లక్షల పౌండ్లు పెట్టి ఇళ్లును కొనుగోలు చేసింది. అయితే, అనుకోకుండానే అనతికాలంలో ఆమె అంతడబ్బు పెట్టి కొన్న ఇల్లును అనూహ్యంగా అమ్ముకోవాల్సి వచ్చింది.. అది కూడా అతి తక్కువకే. అందుకు కారణం ఆమెకు ఆ ఇల్లంటే ప్రాణం.. పైగా ఆమె పరిస్థితులు మాత్రం అంతకంటే అధ్వానం. వివరాల్లోకి వెళితే.. భారత్ సంతతికి చెందిన రేఖా పటేల్ అనే మహిళ బ్రిటన్‌లోని గ్లాసప్ అనే ప్రాంతంలోగల సైమండ్లీ అనే గ్రామంలో 2010లో కొంత శిథిలంగా ఉండి విశాలమైన ప్రాంగణంతో ఉన్న ఇల్లును దాదాపు రెండు లక్షల పౌండ్లు పెట్టి కొనుగోలుచేసింది. అయితే, ఆ సమయంలో ఇల్లును పునరుద్ధరించే పనుల్లో ఉండగా దానికి సంబంధించిన రాళ్లు కాస్త పక్కింటిపై పడటంతో ఆమెకు తలనొప్పిగా మారింది. ఆ తర్వాత కోర్టు వరకు వెళ్లింది. ఇలా కోర్టుల చుట్టూ తిరగడంలాంటివాటికి మొత్తం లీగల్ ఫీజులకు దాదాపుగా 76,000 ఒకేసారి చెల్లించే పరిస్థితి ఏర్పడింది. దీంతో చివరకు తన ఇల్లును అమ్ముకోవాలని నిర్ణయించి ఆ ఇంట్లో నుంచి వెళ్లిపోకుండా కొనుగోలుదారులతో ఒప్పందం చేసుకుంది. పదేళ్లపాటు అదే ఇంట్లో ఉండేందుకు అనుమతి తీసుకొని నెలకు 50 పౌండ్లు అద్దె చెల్లిస్తానని చెప్పుకుంది. కేవలం రెండు పౌండ్లకే ఇల్లును అమ్ముకొని ప్రస్తుతం అదే ఇంట్లో ఉంటోంది. త్వరలోనే ఆమె ఇండియాకు వచ్చి తన రాష్ట్రమైన గుజరాత్లో పేద విద్యార్థులకు చదువు చెప్పాలని అనుకుంటున్నట్లు తెలిపింది. -
సవతి తల్లి రాక్షసత్వానికి పరాకాష్ట ఆమె!
దాదాపు రెండేళ్ల పాటు 12 ఏళ్ల సవతి కూతురిని నానా రకాలుగా చిత్రహింసలకు గురిచేసింది ఆమె. చాలాసార్లు అన్నం పెట్టకుండా కడుపు మాడ్చింది. మెటల్ చిపురుకట్ట హ్యాండిల్‌తో ఓసారి తీవ్రంగా చితకబాదింది. దీంతో ఆ చిన్నారి మణికట్టు ఎముకలోతు వరకు తెగి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది. చాలాకాలం ఆమె ఆస్పత్రికే పరిమితమైంది. చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఇంతటి దారుణానికి పాల్పడిన ఆ మహిళ పాపం పండింది. సవతి కూతురిని దారుణంగా హింసించిన భారత సంతతి మహిళ షీతల్ రానోత్ (35)ను అమెరికా కోర్టు దోషిగా తేల్చింది. చిన్నారిపై దాడి చేసి.. ఆమె ప్రాణాలను అపాయంలోకి నెట్టినందుకు షీతల్‌కు 15 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ క్వీన్స్ సుప్రీంకోర్టు జడ్జి రీచర్డ్ బచర్ శుక్రవారం తీర్పు వెలువరించారు. చిన్నారి మాయాను దారుణంగా హింసించిన షీతల్ రానోత్ 'సవతి తల్లి రాక్షసత్వానికి పరాకాష్ట' అని క్వీన్స్ డిస్ట్రిక్ట్ అటార్నీ జనరల్ రిచర్డ్ బ్రౌన్ కోర్టుకు నివేదించారు. 'చిన్నారి మాయా ఎదిగేందుకు అవసరమైన కనీస మౌలిక అవసరాలు కూడా తీర్చకపోవడమే కాదు.. కావాలని చాలాసార్లు ఆ చిన్నారిని షీతల్ దారుణంగా హింసించింది. ఈనాటికి ఆ చిన్నారి శరీరంపై గాయాలు తాలుకూ మచ్చలు అలాగే ఉన్నాయి. 12 ఏళ్ల వయస్సులో ఆ చిన్నారి కేవలం 58 పౌండ్ల బరువు ఉన్నదంటే తన పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏ చిన్నారికి కూడా ఇలాంటి దారుణమైన పరిస్థితి ఎదురుకావొద్దు' అని బ్రౌన్ ఆవేదన వ్యక్తం చేశారు. మాయా సొంత తండ్రి రాజేష్ రానోత్‌పై దాడి, అక్రమ నిర్బంధం, చిన్నారి సంరక్షణను పట్టించుకోకపోవడం వంటి అభియోగాలు మోపారు. ఈ అభియోగాలపై త్వరలో విచారణ జరుగనుంది. క్వీన్స్ ప్రాంతానికి చెందిన షీతల్ తరచూ సవతి కూతురిని హింసిస్తూ కొట్టేదని, ఒసారి తనకు చెప్పులు తొడుగుతున్న చిన్నారిని ముఖంపై తన్నిందని, దీంతో కన్ను ఉబ్బి.. ముఖమంతా చిన్నారి నొప్పితో విలవిలలాడిందని బ్రౌన్ తెలిపారు. డిసెంబర్ 2012 నుంచి మే 2014 వరకు చిన్నారిని తన బెడ్ రూమ్‌లో బంధించి హింసిందని, ఈ సమయంలో సరిగ్గా చిన్నారికి ఆహారం కూడా అందించలేదని వివరించారు. ఈ అభియోగాలను ధ్రువీకరించిన కోర్టు దోషిగా తేలిన షీతల్‌కు కఠిన శిక్ష విధించారు. -
సవతి కూతురి పట్ల ఇంత దారుణమా?
ఏడాదిన్నపాటు వేధించిన సవతి తల్లికి 25 ఏళ్ల జైలుశిక్ష వాషింగ్టన్: సవతి కూతురి పట్ల ఏమాత్రం కనికరం చూపకుండా అమానుషంగా హింసించిందో ఓ మహాతల్లి. అభంశుభం తెలియని 12 ఏళ్ల బాలికకు ఏడాదిన్నరపాటు అన్నం, నీళ్లు ఇవ్వకుండా ఆకలితో మాడ్చివేసింది. అంతేకాకుండా చిన్నారిని చితకబాది.. ఆస్పత్రి పాలయ్యేలా చేసింది. ఆమె ప్రాణాలు ప్రమాదంలో పడేలా చేసింది. భారత సంసతికి చెందిన ఆ సవతి తల్లి పాపం పండింది. అమెరికా కోర్టు ఆమెకు ఏకంగా 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తన సవతి కూతురు మాయా రతన్‌ను తీవ్రంగా చిత్రవధ చేసిన కేసులో షీతల్ రాతన్ను అమెరికా కోర్టు దోషిగా తేల్చింది. 2014లో షీతల్ చిన్నారి మణికట్టును దారుణంగా కట్‌చేసి.. చిత్రహింసలు పెట్టిందని, దీనివల్ల ఆస్పత్రి పాలైన చిన్నారి దేహంపై ఇప్పటికీ సవతి తల్లి కొట్టిన దెబ్బల గుర్తులు అలాగే ఉన్నాయని క్వీన్స్ డిస్ట్రిక్ట్ అటార్నీ రిచర్డ్ బ్రౌన్ పేర్కొన్నారు. అమానుషమైన చిత్రహింసలతో చిన్నారి మాయ ప్రాణాలను సవతి తల్లి ప్రమాదంలో పడేసిందని, ఎవ్వరూ కూడా చిన్నారుల పట్ల ఇంత దారుణంగా వ్యవహరించకూడదని, ఏ చిన్నారికి ఇలాంటి అవస్థ రాకూడని జడ్జి తీర్పు వెలువరిస్తూ పేర్కొన్నారు. -
పనిమనిషిని కొట్టినందుకు జైలు
సింగపూర్: పనిమనిషిని హింసించిన కేసులో భారత సంతతికి చెందిన మహిళకు సింగపూర్ కోర్టు 15 నెలల జైలు శిక్ష విధించింది. తన దగ్గర పనిచేసిన మయన్మార్ మహిళ నా ము డెన్ పాను హింసించిన నేరానికి సుగంథి జయరామన్(34)కు జైలు శిక్షతో పాటు, రూ.2 లక్షల జరిమానా వేసింది. తనకు నచ్చినట్టుగా కూర వండలేదన్న కోపంతో 2013, సెప్టెంబర్ 28న పనిమనిషికి ఒంటి నిండా వాతలు పెట్టింది సుగంథి. వడియాలు త్వరగా వేయించలేదన్న ఆగ్రహంతో అంతకుముందు ఆమెను హింసించింది. నిర్ణీత సమయానికి కంటే ముందే పని ముగించినందుకు మరోసారి చేయి చేసుకుంది. కనీసం ఆమెకు వైద్యం కూడా చేయించకుండా వేధించింది. పనిమనిషిపై ఆమె చర్యలు క్రూరంగా, అమానవీయంగా ఉన్నాయని కోర్టు పేర్కొంటూ సుగంథి జయరామన్ జైలు శిక్ష విధించింది.