సాక్షి, అమరావతి: అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ(యూఎస్‌ఏఐడీ) మిషన్ డైరెక్టర్‌గా భారత సంతతి మహిళ వీణా రెడ్డి గురువారం బాధత్యలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. వీణా రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. అమెరికాలో భారత సంతతికి చెందిన మొదటి దౌత్యవేత్తగా ఈ ఘనత సాధించినందుకు గర్వపడుతున్నాను అన్నారు. ఈ మేరకు సీఎం జగన్ ట్వీట్ చేశారు.
Congratulations Veena Reddy for being the first diplomat of Indian origin to head @usaid_india. Proud of your achievement. @USCGHyderabad @USAmbIndia @USAndIndia
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 5, 2021
యూఎస్‌ఏఐడీ(USAID) మిషన్ డైరెక్టర్‌గా ఎంపికైన వీణా రెడ్డి భారత్‌తో పాటు భూటాన్‌లో సేవలు అందించనున్నారు. వీణా రెడ్డి ఇంతకాలం ఇదే ఏజెన్సీలో ఫారిన్ సర్వీస్ ఆఫీసర్‌గా పని చేశారు. కంబోడియా మిషన్ డైరెక్టర్‌గా 2017 ఆగష్టు నుంచి ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. హైతి భూకంప సమయంలో రక్షణ-అభివృద్ధి చర్యల పర్యవేక్షకురాలిగా ఆమె మెరుగైన ప్రదర్శన కనపరిచారు.
ఈ పదవుల కంటే ముందు వీణా రెడ్డి వాషింగ్టన్‌లో అసిస్టెంట్ జనరల్ కౌన్సెల్‌గా ఆసియా దేశాల సమస్యలపై ప్రభుత్వ న్యాయసలహాదారుగా పని చేశారు. చికాగో నుంచి బీఏ, ఎంఏ, లా కోర్సులు పాసైన వీణారెడ్డి.. కొలంబియా యూనివర్సిటీ నుంచి ‘జురిస్ డాక్టరేట్’(జేడీ) అందుకుంది. న్యూయార్క్, కాలిఫోర్నియా బార్ అసోషియేషన్‌లో వీణకు సభ్యత్వం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment