భర్త పాస్‌పోర్ట్‌తో భార్య ఏం చేసిందంటే.. ! | Indian Origin Woman Traveled From Uk To Delhi on Husband's Passport | Sakshi
Sakshi News home page

భర్త పాస్‌పోర్ట్‌తో ఇండియాకు వచ్చిన మహిళ

Published Wed, May 2 2018 8:43 PM | Last Updated on Wed, May 2 2018 8:47 PM

Indian Origin Woman Traveled From Uk To Delhi on Husband's Passport - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మనుషులు పొరపాట్లు చేయడం సహజం. అందులో సరిదిద్దుకొనేవి కొన్ని, సరిదిద్దుకోలేనివి ఇంకొన్ని. కానీ భారత్‌కు చెందిన ఓమహిళ చేసిన పొరపాటు తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకోవాల్సిందే. అదేంటంటే భర్త పాస్‌పోర్ట్‌తో ఏకంగా దేశాలు దాటేసింది. గీతా మోధ అనే భారతీయ మహిళ మాంచెస్టర్‌లో అలంకార్‌ వస్త్ర దుకాణం నడుపుతోంది. గత ఏప్రిల్‌ 23న బిజినెస్‌ పనిమీద ఢిల్లీ రావాల్సి వచ్చింది. అయితే తొందరపాటులో తన పాస్‌పోర్ట్‌ బదులు భర్త దిలీప్‌ పాస్‌పోర్ట్‌ను తీసుకొని ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌లో వయా దుబాయ్‌ మీదుగా ఢిల్లీ బయలుదేరింది. 

అయితే విదేశాల నుంచి వచ్చే భారతీయులు ఇమిగ్రేషన్‌ పూర్తి అయితేనే భారత్‌లోకి రావడానికి అనుమతి ఉంటుంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు గీత ఇమిగ్రేషన్‌ తనిఖీ చేయడంతో అసలు విషయం బయటపడింది. దీనిపై ఆమె అసహనం వ్యక్తం చేసింది. ఎయిర్‌పోర్టు అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారంటూ మండిపడింది. ఈ విషయంపై ఎయిర్‌లైన్స్‌ వర్గాలను సంప్రదించగా ఈ సంఘటనపై విచారణం చేపట్టామని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement