పనిమనిషిని కొట్టినందుకు జైలు
సింగపూర్: పనిమనిషిని హింసించిన కేసులో భారత సంతతికి చెందిన మహిళకు సింగపూర్ కోర్టు 15 నెలల జైలు శిక్ష విధించింది. తన దగ్గర పనిచేసిన మయన్మార్ మహిళ నా ము డెన్ పాను హింసించిన నేరానికి సుగంథి జయరామన్(34)కు జైలు శిక్షతో పాటు, రూ.2 లక్షల జరిమానా వేసింది.
తనకు నచ్చినట్టుగా కూర వండలేదన్న కోపంతో 2013, సెప్టెంబర్ 28న పనిమనిషికి ఒంటి నిండా వాతలు పెట్టింది సుగంథి. వడియాలు త్వరగా వేయించలేదన్న ఆగ్రహంతో అంతకుముందు ఆమెను హింసించింది. నిర్ణీత సమయానికి కంటే ముందే పని ముగించినందుకు మరోసారి చేయి చేసుకుంది. కనీసం ఆమెకు వైద్యం కూడా చేయించకుండా వేధించింది. పనిమనిషిపై ఆమె చర్యలు క్రూరంగా, అమానవీయంగా ఉన్నాయని కోర్టు పేర్కొంటూ సుగంథి జయరామన్ జైలు శిక్ష విధించింది.