సాక్షి,హైదరాబాద్: ఐఏఎస్ అధికారుల కేటాయింపుపై కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్)లో ఇవాళ( సోమవారం) విచారణ జరగింది. స్వాపింగ్, డొమిసిల్ (స్థిర నివాసం) ఆధారంగా తమ అభ్యర్థనలను పరిగణలోకి తీసుకోలేదన్న ఐఏఎస్‌ల పిటిషన్‌పై క్యాట్ విచారణ చేపట్టింది. అయితే ఈరోజు డీఓపీటీ కౌంటర్ దాఖలు చేయలేదు.
ఇక.. ఎడుగురు ఐఏఎస్ అధికారుల విడిగా కౌంటర్ దాఖలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఐఏఎస్ తరుపు న్యాయవాదులు కోరారు. వచ్చే విచారణకు ఏడుగురు ఐఏఎస్‌ల కేటాయింపుపై విడిగా కౌంటర్లు ఫైల్ చేయాలనీ డీఓపీటీకి క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ క్యాట్ 4 వారాలకు వాయిదా వేసింది.
గత నెలలో కేటాయించిన రాష్ట్రాల్లోనే విధులు నిర్వహించాలంటూ డీవోపీటీ జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఐఏఎస్ అధికారులు క్యాట్‌ను ఆశ్రయించారు. డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషన్‌లో కోరారు.
ఐఏఎస్‌ల పిటిషన్‌పై క్యాట్ విచారణ చేపట్టింది. వాదనల అనంతరం ..డీవోపీటీ ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు క్యాట్ నిరాకరించింది. ప్రతివాదులైన కేంద్రం, డీవోపీటీలకు నోటీసులు ఇచ్చింది. నవంబరు 5లోపు కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. ఏపీకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. క్యాట్ ఆదేశాలతో ఇప్పటికే కేటాయించిన రాష్ట్రాల్లో ఐఏఎస్‌లు రిపోర్ట్ చేశారు.
అయితే తమని డొమిసిల్,స్వాపింగ్ ఆధారంగా కేటాయింపు జరగలేదని, డీవోపీటీ తమ అభ్యర్థనలను పరిగణలోకి తీసుకోలేదని ఏడుగురు ఐఏఎస్‌లు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment