Viral Video: Mice Seen Raining From The Sky As Rodent Plague Ravages Australia - Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాను వణికిస్తున్న ఎలుకలు

Published Sat, May 15 2021 2:09 PM | Last Updated on Sat, May 15 2021 3:24 PM

Viral Video: Mice In Australia Seen Rraining From Sky - Sakshi

సిడ్నీ: పొలాలపై పడి ఎలుకలు పంటలను నాశనం చేస్తున్నాయి. ఈ సమస్య ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌ వేల్స్‌ రాష్ట్రంలో అధికంగా ఉంది. దీంతో ఆ ప్రాంతంలోని ఓ రైతు తన పంట పొలంలో గొయ్యిను శుభ్రం చేయించగా అందులో గుట్టగుట్టలుగా ఎలుకలు బయటపడ్డాయి. ఆ మట్టిని తీసిన మిషన్‌ నుంచి వందలాది చిట్టెలుకలు బయటపడ్డాయి. ఆ యంత్రం నుంచి వర్షం కురిసినట్టు ఎలుకలు కింద పడ్డాయి. ఇది ఆ రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పంట పొలాలను నష్టం చేస్తున్నాయని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

దేశంలో ప్లేగు వ్యాధికి కారణంగా అక్కడి అధికారులు భావిస్తున్నారు. దీంతో వాటిని చంపే చర్యలు మొదలుపెట్టారు. ఈ సమస్య ముఖ్యంగా ఈశాన్య ఆస్ట్రేలియాలో అధికంగా ఉంది. పెద్ద ఎత్తున ప్లేగు బాధితులు పెరుగుతున్నారు. ఈ క్రమంలోనే అధికారులు పొలాల వద్ద ఎలుకలను నాశనం చేసే పనులు చేపట్టారు. ఈ క్రమంలోనే ఓ రైతు పొలంలోని గుంతను శుభ్రం చేస్తుండగా ఎలుకలు పెద్ద ఎత్తున వచ్చాయి. 

దీనికి సంబంధించిన వీడియోను ఆస్ట్రేలియా బ్రాడ్‌కాస్టింగ్‌కు చెందిన జర్నలిస్ట్‌ లూసీ థాకరే ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘ఎలుకల వర్షం’ అంటూ పోస్టు చేసిన ఆ వీడియో వైరల్‌గా మారింది. యంత్రం పైపు నుంచి ఎలుకలు కిందపడుతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తుంది. అది చూసి వామ్మో అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు ఆ ప్రాంతంలోని గోదాముల్లో ఎలుకలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గోదాములపై దాడి చేసి ధాన్యాన్నంతా పాడు చేస్తున్నాయి. గోదాముల్లో ఎలుకల దాడిని చూస్తే భయం ఏర్పడుతోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఎలుకల సమస్య తీవ్రంగా వేధిస్తోంది.

చదవండి: అంత్యక్రియల్లో లేచిన బామ్మ: షాకైన కుటుంబీకులు
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement