Mice
-
లోపలికి తొంగిచూడొచ్చు
1897లో వచ్చిన హెచ్‌జీ వేల్స్ ప్రసిద్ధ సైన్స్ ఫిక్షన్ నవల ‘ద ఇన్విజిబుల్ మ్యాన్’ గుర్తుందా? ఒంట్లో కణాలన్నింటినీ పారదర్శకంగా మార్చేసే ద్రావకాన్ని హీరో కనిపెడతాడు. దాని సాయంతో ఎవరికీ కని్పంచకుండా ఎంచక్కా మాయమైపోతాడు. దీని స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. తాజాగా సైంటిస్టులు అలాంటి ఆవిష్కరణే చేశారు! అది కూడా సాదాసీదా ఫుడ్ కలరింగ్ ఏజెంట్ సాయంతో!! దాని సాయంతో తయారు చేసిన సరికొత్త ‘ద్రావకం’ చర్మాన్ని పారదర్శకంగా మార్చేస్తోంది. దాంతో ఒంట్లోని అవయవాలన్నింటినీ మామూలు కంటితోనే భేషుగ్గా చూడటం వీలుపడింది. దీన్నిప్పటికే ఎలుకలపై విజయవంతంగా ప్రయోగించి చూశారు. ఈ ప్రయోగం మనుషులపైనా విజయవంతమైతే బయో జీవ రసాయన, వైద్య పరిశోధన రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టగలదని భావిస్తున్నారు... ఇలా సాధించారు... టార్ట్రాజైన్ అనే మామూలు పసుపు రంగు ఫుడ్ కలరింగ్ ఏజెంట్‌ను నీళ్లలో కలపడం ద్వారా చర్మాన్ని మాయం చేసే ద్రావకాన్ని సైంటిస్టులు తయారు చేశారు. ఈ మేజిక్‌ను సాధించేందుకు ఆప్టిక్ రంగ పరిజ్ఞానాన్ని వాడుకున్నారు. పసుపు రంగు కలరింగ్ ఏజెంట్‌లోని అణువులు మామూలుగానైతే కాంతిని విపరీతంగా శోషించుకుంటాయి. ముఖ్యంగా నీలి, అతినీల లోహిత కాంతిని తమగుండా వెళ్లనీయవు. కానీ దాన్ని నీటితో కలిపిన మీదట వచ్చే ద్రావకం పూర్తిగా పారదర్శక ధర్మాలను కలిగి ఉంటుంది. దాన్ని చర్మంపై రుద్దితే దాని కణజాలాలకు కాంతి పరావర్తక సామర్థ్యం లోపిస్తుంది. దాంతో ద్రావకం లోపలికి ఇంకుతూనే చర్మం కని్పంచకుండా పోతుంది! మరోలా చెప్పాలంటే ‘మాయమవుతుంది’. ఈ ద్రావకాన్ని తొలుత కోడి మాంసంపై రుద్దారు. ఫలితం సంతృప్తికరంగా అని్పంచాక ప్రయోగాత్మకంగా ఒక ఎలుకపై పరీక్షించి చూశారు. దాని తల, పొట్టపై ఉన్న చర్మం మీద ద్రావకాన్ని పూశారు. దాంతో ఆయా భాగాల్లో చర్మం తాత్కాలికంగా పారదర్శకంగా మారిపోయింది. ఫలితంగా తల, పొట్ట లోపలి అవయవాలు స్పష్టంగా కని్పంచాయి. ద్రావకాన్ని కడిగేసిన మీదట చర్మం ఎప్పట్లాగే కన్పించింది. పైగా ఈ ప్రక్రియలో ఎలుకకు ఎలాంటి హానీ కలగలేదు. రక్తనాళాలన్నీ కన్పించాయి ఎలుకల తలపై ద్రావకం రుద్దిన మీదట మెదడు ఉపరితలం మీది రక్తనాళాలు మామూలు కంటికే స్పష్టంగా కని్పంచాయి. అలాగే పొట్ట భాగంలోని అవయవాలు కూడా. ‘‘మౌలిక భౌతిక శాస్త్ర నియమాలు తెలిసినవారికి ఇదేమీ పెద్ద ఆశ్చర్యం కలిగించదు. కానీ ఇతరులకు మాత్రం అచ్చం అద్భుతంగానే తోస్తుంది’’ అని అధ్యయన సారథి, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో ఫిజిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జిహావో యూ అన్నారు. ‘‘పొట్టపై ఈ ద్రావకాన్ని రుద్దితే చాలు. పొద్దుటినుంచీ ఏమేం తిన్నదీ స్పష్టంగా కని్పస్తుంది. చూడటానికి చాలా సింపులే గానీ, ఈ పద్ధతి చాలా ఎఫెక్టివ్’’ అని వివరించారు. అయితే దీన్నింకా మనుషులపై ప్రయోగించాల్సి ఉందని ఆయన చెప్పుకొచ్చారు.లాభాలెన్నో... మనుషులపై గనక ఈ ప్రక్రియ విజయవంతమైతే వైద్యపరంగా ఎనలేని లాభాలుంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. → రక్తం శాంపిళ్ల సేకరణ, రోగి ఒంట్లోకి అవసరమైన ఫ్లూయిడ్స్ ఎక్కించడం వంటివి మరింత సులభతరం అవుతాయి. ముఖ్యంగా రక్తనాళాలు దొరకడం కష్టంగా మారే వృద్ధులకు ఇది వరప్రసాదమే కాగలదు.→ చర్మ క్యాన్సర్ వంటివాటిని తొలి దశలోనే గుర్తించడం సులువవుతుంది. → ఫొటోడైనమిక్, ఫొటోథర్మల్ థెరపీల వంటి కణజాల చికిత్సల్లోనూ ఇది దోహదకారిగా మారుతుంది. → లేజర్ ఆధారిత టాటూల నిర్మూలన మరింత సులువవుతుంది.కొన్నిపద్ధతులున్నాకణజాలాలను పారదర్శకంగా మార్చేందుకు ప్రస్తుతం పలు ద్రావకాలు అందుబాటులో ఉన్నా అవి ఇంత ప్రభావవంతమైనవి కావు. పైగా పలు డీహైడ్రేషన్, వాపులతో పాటు కణజాల నిర్మాణంలోనే మార్పుల వంటి సైడ్ ఎఫెక్టులకు దారి తీస్తాయి. టార్ట్రాజైన్ ద్రావకంతో ఈ సమస్యలేవీ తలెత్తలేదు. అయితే టార్ట్రాజైన్ మనుషులకు హానికరమంటూ తినుబండారాల్లో దీని వాడకాన్ని అమెరికాలో పలువురు కోర్టుల్లో సవాలు చేశారు. దీన్ని చిప్స్, ఐస్‌క్రీముల్లో వాడతారు.కొసమెరుపు: ఇన్విజిబుల్ మ్యాన్ నవల్లో మాదిరిగా మనిíÙని పూర్తిగా మాయం చేయడం ఇప్పుడప్పట్లో సాధ్యపడేలా లేదు. ఎందుకంటే టార్ట్రాజైన్ ద్రావకం ఎముకలను పారదర్శకంగా మార్చలేదట. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హోటల్ పరిశ్రమలో కొనసాగనున్న జోరు
కోల్‌కతా: దేశ హోటల్ పరిశ్రమ వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ మంచి వృద్ధిని చూడనుంది. 2024–25లో హోటల్ పరిశ్రమ ఆదాయం మొత్తం మీద 7–9 శాతం మధ్య పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. దేశీయ విహార పర్యటనలు కొనసాగుతుండడం, సమావేశాలు, ప్రోత్సాహకాలు, సదస్సులు, ప్రదర్శనలనుకు (ఎంఐసీఈ) డిమాండ్ ఉండడం వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధికి మద్దతుగా నిలుస్తాయని ఇక్రా తెలిపింది. సాధారణ ఎన్నికల ప్రభావం స్వల్పకాలమేనని పేర్కొంది. హోటల్ పరిశ్రమ డిమాండ్‌లో ఆధాత్మిక పర్యాటకం, టైర్–2 సిటీలు కీలక చోదకంగా నిలుస్తాయని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హోటళ్లలో గదుల భర్తీ రేటు (ఆక్యుపెన్సీ) దశాబ్ద గరిష్టమైన 70–72 శాతానికి చేరుకుందని, 2022–23లో ఇది 68–70 శాతమే ఉన్నట్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా హోటల్ గదుల రేట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటున రూ.7,200–7,400 మధ్య ఉండొచ్చని.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.7,800–8,000కు పెరగొచ్చని అంచనా వేసింది. దేశ ఆతిథ్య రంగంపై సానుకూల అవుట్‌లుక్‌ను ప్రకటించింది. -
Sleep tips: వేడి పాలు తాగితే వెంటనే నిద్ర వస్తుంది.. ఎందుకో తెలుసా?
చిన్నప్పుడు మన పేరెంట్స్ రాత్రి భోజనాలయ్యాక పసుపు కలిపిన పాలు లేదా బాదం పాలు తాగమని పోరుపెట్టేవారు. ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా? నిద్రపోయే ముందు వేడి పాలు తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. అసలు కారణం ఇదేనట.. పాలల్లో పెప్టైడ్ అనే ప్రొటీన్ హార్మోన్ (సీటీఎచ్) ఒత్తిడిని తగ్గించి, నిద్ర వచ్చేలా ప్రేరేపిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. అమెరికన్ కెమికల్ సొసైటీకి చెందిన అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రి జర్నల్ ప్రచురించిన నివేదిక కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. వేడిపాలల్లో సహజంగా నిద్రకుపక్రమించేలా చేసే ప్రత్యేక పెప్టైడ్లను గుర్తించినట్టు ఈ నివేదిక పేర్కొంది. చదవండి: బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారా? ఈ సమస్యలు పొంచి ఉన్నట్లే!! సీటీఎచ్‌లో నిద్రను పెంచే కారకాలు (లక్షణాలు) ఉన్నట్లు ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో బయటపడింది. ఇతర ఎలుకలతోపోలిస్తే వేడి పాలు తాగిన ఎలుకల్లో 25 శాతం త్వరగా నిద్రపోయినట్టు సైంటిస్టులు గుర్తించారు. అంతేకాకుండా ఎక్కువ సమయం నిద్రపోయాయట కూడా. చదవండి: టీనేజర్స్ మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా బ్యాడ్ ఎఫెక్ట్..! కాబట్టి శరీరంతోపాటు, మనసుకు కూడా విశ్రాంతినిచ్చి గాఢనిద్ర పట్టాలంటే.. మీ డిన్నర్ అయిన తర్వాత ఒక గ్లాస్ వెచ్చని పాలను తాగితే చాలు! ఆందోళన (యంటీ యంగ్జైటీ) తగ్గించి, మంచి నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ గుర్తుంచుకోండి.. దీనిని అమలుచేసేముందు మీకేమైనా అనారోగ్య సమస్యలున్నట్లయితే ముందుగా మీ డాక్టర్ సలహాతీసుకోవడం మంచిది. చదవండి: అప్పుడు కన్నీళ్లు తాగి ఆకలి తీర్చుకున్నాడు.. ఇప్పుడు ఎందరికో ఆసరా..! -
ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఎలుకలను నంజుకుతిన్న రెండు తలల పాము
పాములు ఏ రకం అయినా కావొచ్చు. ఏ జాతికి చెందినదైనా ఉండొచ్చు. దానిపై మనుషులకు ఉండేది ఒకే ఫీలింగ్. అదే భయం. పామంటే ఉండే వణుకు మనల్ని ఎన్నటికీ వీడదు. పాముల్లో రెండు తలల పాము చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. తాజాగా రెండు తలల పాముకు చెందిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇది ఎక్కడ జరిగిందో తెలీయరాలేదు కానీ..రెండు తలలు కలిగిన ఓ పాము రెండు ఎలుక పిల్లలను పట్టుకొని ఒక్కో నోటితో ఒక్కో దాన్ని ఎంచక్కా లాగించేసింది. దీనికి సంబంధించిన వీడియోను జంతువుల సాహసం కోసం ప్రపంచాన్ని పర్యటిస్తున్న వ్లాగర్ బ్రియాన్ బార్జిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో రెండు తలలున్న బెన్ అండ్ జెర్రీ అనే పాము మాటువేసి ఎలుకను పట్టుకొని అమాంతం మింగేసి ఆకలి తీర్చుకుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ‘రెండు తలల పాము కావాలి. ఎక్కడ దొరుకుతుంది. ఇంతకుముందెన్నడూ రెండు తలల పామును నేను చూసిందే లేదు’ అంటూ కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.! View this post on Instagram A post shared by B R I A N B A R C Z Y K (@snakebytestv) -
దీర్ఘాయుష్షు: మనిషి 120 సంవత్సరాలు జీవించవచ్చు!
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విలయంతో ప్రపంచమంతా గుండెలరచేతిలో పట్టుకుని బతుకు జీవుడా అని కాలం గడుపుతోంటే.. ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు సంచలన విషయాలను వెల్లడించారు. మానవుడి జీవిత కాలాన్ని 120 సంవత్సరాల వరకూ పెంచే మార్గం సుగమం కానుందని, ఈ మేరకు తమ పరశోధనలు కొత్త ఊపిరిలూదుతున్నాయని చెబుతున్నారు. వృద్ధాప్య ప్రక్రియలో సాధారణంగా క్షీణించే ఎస్‌ఐఆర్‌టీ-6 అనే ప్రోటీన్ సరఫరాను పెంచడం ద్వారా మనిషి దీర్ఘం కాలం మనిషి దీర్ఘకాలం జీవించే మార్గాన్ని గుర్తించామని బార్-ఇలాన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఇటీవల వెల్లడించారు. పరిశోధకులు 250 ఎలుకలపై పరిశోధన గావించి వాటి ఆయుర్దాయం పెంచారని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదించింది. నేచర్ కమ్యూనికేషన్స్ పత్రికలో ప్రచురించబడిన పీర్-రివ్యూ పరిశోధనలో ఈ విషయాలను వెల్లడించింది. ఆయుర్దాయంపై పురోగతి ప్రయోగశాల పరిశోధనలకు నాయకత్వం వహిస్తున్న హైమ్ కోహెన్ మాట్లాడుతూ, ఎలుకల ఆయుర్దాయం 23 శాతం పెంచడానికి ఒక మార్గాన్ని కనుగొన్నామన్నారు. ఎలుకలలో తామె చూసిన మార్పులు మానవులకు అనువదించవచ్చని పేర్కొన్నారు. ఈ ప్రయోగం ఆడ, మగ ఎలుకలపై నిర్వహించగా ఆడ ఎలుకలపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేదని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ తెలిపింది. మగ ఎలుకల వయస్సు ఎక్కువ పెరిగిందని వివరించారు. మగ ఎలుకల జీవితకాలం 30 శాతం, ఆడవారి జీవితకాలం కేవలం 15 శాతం పెరిగిందని చెప్పారు. అలాగే ఈ ప్రోటీన్ తక్కువ కొలెస్ట్రాల్‌ను కలిగి ఉంటుందని, క్యాన్సర్ నుండి రక్షించడానికి కూడా పనిచేస్తుందని తెలిపారు. కోహెన్ ప్రకారం, వృద్ధాప్య ఎలుకలలో వయస్సుతో శక్తి సాధారణంగా తగ్గుతుంది. కాని వాటి శరీరంలో ఈ ప్రోటీన్ పెరగడం వల్ల శక్తి పెరిగింది. అయితే జన్యుపరంగా మార్పు చేయడం ద్వారా ఎలుకలలో ఎస్‌ఐఆర్‌టీ-6 అనే స్థాయిలను అతను సులభంగా పెంచగలిగినప్పటికీ, మానవులలో ప్రోటీన్‌ను పెంచడానికి మందులు అవసరం. రెండు మూడు సంవత్సరాలలో మానవులలో ఫలితాలను ప్రతిబింబించగలదని కోహెన్ చెప్పారు. దీని స్థాయిలను పెంచే చిన్న అణువులను అభివృద్ధి చేస్తున్నారు. దీంతోపాటు ఇప్పటికే ఉన్న ప్రోటీన్లను మరింత చురుకుగా చేయనున్నారు. వృద్ధాప్యాన్ని పరిష్కరించడానికి భవిష్యత్తులో వీటిని ఉపయోగించవవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. చదవండి : కరోనా: రిలయన్స్ మరో సంచలన నిర్ణయం బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ డైరెక్టరుగా ఆర్థికవేత్త కల్పన కొచర్ -
వైరల్ వీడియో: ఎలుకల వర్షం చూశారా
సిడ్నీ: పొలాలపై పడి ఎలుకలు పంటలను నాశనం చేస్తున్నాయి. ఈ సమస్య ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ రాష్ట్రంలో అధికంగా ఉంది. దీంతో ఆ ప్రాంతంలోని ఓ రైతు తన పంట పొలంలో గొయ్యిను శుభ్రం చేయించగా అందులో గుట్టగుట్టలుగా ఎలుకలు బయటపడ్డాయి. ఆ మట్టిని తీసిన మిషన్ నుంచి వందలాది చిట్టెలుకలు బయటపడ్డాయి. ఆ యంత్రం నుంచి వర్షం కురిసినట్టు ఎలుకలు కింద పడ్డాయి. ఇది ఆ రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పంట పొలాలను నష్టం చేస్తున్నాయని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దేశంలో ప్లేగు వ్యాధికి కారణంగా అక్కడి అధికారులు భావిస్తున్నారు. దీంతో వాటిని చంపే చర్యలు మొదలుపెట్టారు. ఈ సమస్య ముఖ్యంగా ఈశాన్య ఆస్ట్రేలియాలో అధికంగా ఉంది. పెద్ద ఎత్తున ప్లేగు బాధితులు పెరుగుతున్నారు. ఈ క్రమంలోనే అధికారులు పొలాల వద్ద ఎలుకలను నాశనం చేసే పనులు చేపట్టారు. ఈ క్రమంలోనే ఓ రైతు పొలంలోని గుంతను శుభ్రం చేస్తుండగా ఎలుకలు పెద్ద ఎత్తున వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోను ఆస్ట్రేలియా బ్రాడ్‌కాస్టింగ్‌కు చెందిన జర్నలిస్ట్ లూసీ థాకరే ట్విటర్లో షేర్ చేశారు. ‘ఎలుకల వర్షం’ అంటూ పోస్టు చేసిన ఆ వీడియో వైరల్‌గా మారింది. యంత్రం పైపు నుంచి ఎలుకలు కిందపడుతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తుంది. అది చూసి వామ్మో అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు ఆ ప్రాంతంలోని గోదాముల్లో ఎలుకలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గోదాములపై దాడి చేసి ధాన్యాన్నంతా పాడు చేస్తున్నాయి. గోదాముల్లో ఎలుకల దాడిని చూస్తే భయం ఏర్పడుతోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఎలుకల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. చదవండి: అంత్యక్రియల్లో లేచిన బామ్మ: షాకైన కుటుంబీకులు Even if grain’s in silos, mice can get to it. Like Tyler Jones discovered in Tullamore when cleaning out the auger and it started raining mice #mouseplague #mice #australia pic.twitter.com/mWOHNWAMPv — Lucy Thackray (@LucyThack) May 12, 2021 Meanwhile in Australia 😳 Oh good god. I can’t deal with mice. At all, not even one! The rodent plague in Australia would have me seeking asylum immediately *shudder* pic.twitter.com/6jSC5yIvwr — Bernie's Tweets (@BernieSpofforth) May 13, 2021 -
చచ్చుబడిన కాళ్లలో మళ్లీ చైతన్యం
సాక్షి, హైదరాబాద్: వెన్నెముక గాయాలతో శరీరం దిగువభాగం, ముఖ్యంగా కాళ్లు చచ్చుబడిపోయిన వారికి శుభవార్త. జర్మనీలోని రుహర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పుణ్యమా అని.. కాళ్లు చచ్చుబడిన ఎలుకలు ఒక్క ఇంజక్షన్‌తోనే మూడు వారాల్లో మళ్లీ నడవగలిగాయి. అద్భుతం అనేందుకు ఏమాత్రం తీసిపోని ఈ పరిశోధనకు కీలకం.. ప్రత్యేకంగా డిజైన్ చేసిన ప్రొటీన్! హైపర్ ఇంటర్‌ల్యూకిన్–6 (హెచ్ఐఎల్–6) అని పిలిచే ఈ ప్రొటీన్ నాడీ కణాల పునరుత్పత్తికి అవసరమైన సంకేతాలు అందిస్తుంది. వాస్తవానికి ఈ ప్రొటీన్లు శరీరంలోనే ఉన్నప్పటికీ వాటికి ఈ సామర్థ్యం ఉండదు. రుహర్ శాస్త్రవేత్తలు ఈ ప్రొటీన్‌ను కృత్రిమంగా డిజైన్ చేసి, అభివృద్ధి చేయడమే కాకుండా.. దాన్ని ఓ సాధారణ వైరస్ సాయంతో ఎలుకల మెదళ్లలోకి జొప్పించారు. వెన్నెముక పూర్తిగా దెబ్బతిన్న ఈ ఎలుకలకు ప్రొటీన్ అందించినప్పుడు ఇంజక్షన్ ఇచ్చిన సెన్సరీ కార్టెక్స్ ప్రాంతంలో మోటార్ ఆక్సాన్ల (కదలికలకు సంబంధించిన సంకేతాలు ఇచ్చేవి) ఉత్పత్తి మొదలైంది. అంతేకాదు.. ఈ ఉత్పత్తి వెన్నెముక ప్రాంతంలోనికీ విస్తరించింది. నడకకు అవసరమైన భాగాలను చైతన్యం చేసింది. ఫలితంగా చచ్చుబడిన కాళ్లలో కొన్ని వారాల వ్యవధిలోనే కదలికలు వచ్చాయి. శరీరం దిగువభాగం చచ్చుబడిన ఎలుకల్లో రెండు మూడు వారాల్లోనే తాము కదలికలు చూశామని, ఇప్పటివరకూ ఇలా ఎప్పుడూ జరగలేదని పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త దైమర్ ఫిషర్ తెలిపారు. వెన్నెముక గాయమైన కొన్ని వారాల తరువాత ఈ చికిత్స అందిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో చూసేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నామని, వాటి ఆధారంగా మనుషులకూ ఈ చికిత్స విధానం విస్తరించడంపై నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు. పరిశోధన ఫలితాలు నేచర్ కమ్యూనికేషన్స్ తాజా జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. అసాధ్యాన్ని సాధించారు... వెన్నెముక గాయాల కారణంగా శరీరం దిగువ భాగం చచ్చుబడడాన్ని మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. వెన్నెముక నుంచి మెదడుకు మధ్య సంకేతాల ఆదాన ప్రదానాలు నిలిచిపోవడం దీనికి కారణం. వెన్నెముకలోని నాడీ పోగులు (ఆక్సాన్లు) సమాచారాన్ని అటూ ఇటూ చేరవేస్తాయనేది తెలిసిందే. ఆక్సాన్లు దెబ్బతింటే శరీర భాగాలకు, మెదడుకు మధ్య సంబంధం తెగిపోతుందన్నమాట. ఒకసారి దెబ్బతిన్న ఆక్సాన్లు మళ్లీ పెరగవు కాబట్టి బాధితులు జీవితాంతం సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వెన్నెముకను సరిచేసి, తద్వారా చచ్చుబడిన శరీర భాగం మళ్లీ చైతన్యవంతమయ్యేలా చేయడం ఇప్పటివరకూ అసాధ్యంగానే మిగిలింది. విద్యుత్తు ప్రచోదనాల ద్వారా చికిత్స చేసేందుకు కొన్ని ప్రయత్నాలు జరిగినా సాధించిన ఫలితాలు అంతంతే. వెన్నెముక గాయమైన ప్రాంతాన్ని తప్పించి మిగిలిన నాడులను ఉత్తేజపరిచేలా చేసేందుకూ విఫలయత్నాలు జరిగాయి. రుహర్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ రెండు పద్ధతులనూ కాదని జన్యుమార్పిడితో ప్రయత్నించి విజయం సాధించడం విశేషం. వీరు తయారు చేసిన హెచ్ఐఎల్–6 డిజైనర్ ప్రొటీన్ కేవలం కదలికలకు సంబంధించిన నాడీ కణాలపై మాత్రమే కాకుండా.. చూపునకు సంబంధించిన కణాలపైనా సానుకూల ప్రభావం చూపగలవని ఇప్పటికే రుజువైంది. అంటే అంధులకు మళ్లీ చూపునిచ్చేందుకూ ఈ ప్రొటీన్లను ఉపయోగించే అవకాశం ఉందన్నమాట. -
ఎలుకల కోసం రూ.8.4 కోట్లు
సాక్షి, అమరావతి: రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవా? అన్నట్లుగా ప్రభుత్వం తల్చుకుంటే కాంట్రాక్టరుకు ఎలాగైనా లబ్ధి చేకూర్చవచ్చని నిరూపిస్తోంది. ఎలుకలను పట్టుకోవడాన్ని సైతం ఆదాయ వనరుగా మార్చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. టీడీపీ ముఖ్యనేతకు దగ్గరి బంధువు కావడంతో.. రాష్ట్రవ్యాప్తంగా పెద్దాసుపత్రుల్లో ఎలుకలు, కీటకాల నిర్మూలన పేరుతో ఏడాది వ్యవధిలో రూ.8.4 కోట్లు చెల్లించడంపై సిబ్బంది ముక్కున వేలేసుకుంటున్నారు. బోనులో ఎలుకలు పడకున్నా కాంట్రాక్టర్ల జేబుల్లోకి మాత్రం డబ్బులు చేరాయని విమర్శిస్తున్నారు. గత రెండేళ్లలో ఎలుకలు పట్టినందుకు సదరు కాంట్రాక్టరుకు సుమారు రూ.17 కోట్ల వరకూ చెల్లించారు. టీడీపీ ముఖ్యనేతకు ఈ కాంట్రాక్టర్ సమీప బంధువు కావడం గమనార్హం. పెస్ట్ అండ్ రోడెంట్ కంట్రోల్ పేరుతో పని చేయకపోయినా కాంట్రాక్టర్‌కు భారీ లబ్ధి చేకూరుస్తున్నట్లు అధికారులే పేర్కొంటున్నారు. నెలకు రూ.70 లక్షలు... రాష్ట్రంలో 11 వైద్య కళాశాలలు, అనుబంధంగా బోధనాసుపత్రులు ఉన్నాయి. వీటిలో పారిశుధ్యం, కీటకాల నియంత్రణ, సెక్యూరిటీ సర్వీసులు గతంలో ఒకే కాంట్రాక్టరు కింద ఉండేవి. గుంటూరు ఆస్పత్రిలో ఎలుకలు కొరకడంతో ఓ శిశువు మృతి చెందిన ఘటన అనంతరం పారిశుధ్యం నుంచి కీటకాల నియంత్రణను తొలగించారు. దీనికోసం ప్రత్యేకంగా టెండర్లు నిర్వహించి చిత్తూరు జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టరుకు అప్పగించారు. కీటకాల నియంత్రణకు సగటున రూ.70 లక్షలు చెల్లిస్తున్నారు. అంటే ఏడాదికి రూ.8.4 కోట్లు ఖర్చు చేస్తున్నారు. చాలా ఆస్పత్రుల్లో ఎలుకలు, బొద్దింకలు, బల్లులు, పాములు యధేచ్ఛగా సంచరిస్తున్నట్లు వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఒక్కో ఆస్పత్రిలో నలుగురు సిబ్బందితో తూతూమంత్రంగా నీళ్ల మందు పిచికారీ చేస్తూ కీటకాలను నియంత్రించినట్లు నెలవారీ బిల్లులు వసూలు చేసుకుంటున్నారు. గుంటూరు, విశాఖపట్నం ఆస్పత్రుల్లో నెలకు రూ.7 లక్షలకు పైగా చెల్లిస్తున్నా కనీసం పది ఎలుకలను కూడా పట్టడం లేదని సిబ్బంది పేర్కొన్నారు. ఆపరేషన్ థియేటర్లలోకి ఎలుకలు చొరబడుతుండటంతో రోగులు హడలిపోతున్నారు. -
స్నాక్స్‌తో ఆ రిస్క్ అధికం..
లండన్ : లంచ్, డిన్నర్ మధ్యలో తరచూ స్నాక్స్ తీసుకుంటే ఆరోగ్యం, జీవితకాలంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏజింగ్ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఎలుకలపై చేపట్టిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. తరచూ ఆహారం తీసుకున్న ఎలుకలతో పోలిస్తే ఆహారాల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉన్న ఎలుకలు మెరుగైన ఆరోగ్యంతో ఉన్నట్టు తమ అథ్యయనంలో తేలిందని పరిశోధకులు వెల్లడించారు. మీల్స్ మధ్య ఏ ఆహారం తీసుకోని ఎలుకలు వయసు సంబంధిత వ్యాధులను దీటుగా ఎదుర్కొంటున్నాయని, రోజుకు ఒక పూట ఆహారం తీసుకునే ఎలుకల్లో అత్యధిక జీవనకాలం నమోదవుతోందని తెలిపారు. ఆహారాన్ని ఒకేసారి తీసుకోకుండా కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవాలనే వైద్య నిపుణుల సూచనకు భిన్నంగా ఈ అథ్యయనం సరికొత్త అంశాన్ని ముందుకుతెచ్చింది. రోజుకు ఒక పూట ఆహారం తీసుకున్న ఎలుకలు దీర్ఘకాలం జీవించడంతో పాటు వయోభారంతో వచ్చే వ్యాధుల బారిన పడటం అరుదని, వీటిలో జీవక్రియల వేగం కూడా మెరుగ్గా ఉందని తమ పరిశోధనలో వెల్లడైందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆన్ ఏజింగ్ డైరెక్టర్ రిచర్డ్ జే హోడ్స్ తెలిపారు. ఈ అథ్యయన వివరాలు సెల్ మెటబాలిజం జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
వెన్నెముకకు పక్షవాతం వచ్చినా నడవొచ్చు!
బోస్టన్: వెన్నెముకకు గాయమై పక్షవాతం బారిన పడి నడక సామర్థ్యాన్ని కోల్పోయిన వారిని తిరిగి నడవగలిగేలా చేసే చికిత్సను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ నూతన చికిత్సను ఎలుకలపై ప్రయోగించినప్పుడు 100 శాతం ఫలితాలతో నడక సామర్థ్యం కలిగినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఈ చికిత్సను మానవులపై ప్రయోగించి సత్ఫలితాలను పొందవచ్చని వారు భావిస్తున్నారు. వెన్నెముకకు గాయమైన ప్రదేశం కింది భాగం పక్షవాతం బారిన పడి అత్యధికులు నడక సామర్థ్యాన్ని కోల్పోతున్నారని వివరించారు. గాయం కాని వెన్నుముక భాగాలు ఎందుకు పనిచేయకుండా పోతున్నాయో తెలుసుకునేందుకు గాను అమెరికాలోని బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు చెందిన పరిశోధకులు అధ్యయనాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా సీఎల్పీ 290 అనే మిశ్రమాన్ని ఒక క్రమ పద్ధతిలో ఇంట్రాపెరిటోనియల్ ఇంజెక్షన్ ద్వారా ఎలుకలకు ఎక్కించారు. అనంతరం నాలుగైదు వారాల్లో ఎలుకల్లో నడక సామర్థ్యం కలిగినట్లు తెలిపారు. ఈ మిశ్రమం కారణంగా కాలి వెనుక భాగాల్లో కదలికలు ఏర్పడినట్లు ఎలక్ట్రోమయోగ్రఫీ రికార్డులో స్పష్టమైనట్లు వివరించారు. -
రూ 12 లక్షలు తినేసిన ఎలుక..
సాక్షి, గువహటి : ఏటీఎంల్లో నో క్యాష్ బోర్డులతో ప్రజలు అల్లాడుతుంటే అసోంలోని ఓ ఏటీఎంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. టిన్సుకియా లైపులి ప్రాంతంలోని ఓ ఏటీఎంలో ఉంచిన రూ 12.38 లక్షలను ఎలుక కొరికేసింది. మే 19న ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీ ఈ ఏటీఎంలో రూ 29.48 లక్షల విలువైన రూ 2000, రూ 500 నోట్లను నింపింది. ఆ మరుసటి రోజు నుంచి ఏటీఎం పనిచేయడం లేదని స్థానిక పత్రిక పేర్కొంది. జూన్ 11న సెక్యూరిటీ కంపెనీ ప్రతినిధులు ఏటీఎంను తిరిగి ఓపెన్ చేయగా రూ 12.38 లక్షలను ఎలుకలు కొరికేసి చిందరవందరగా పడిఉండటాన్ని గుర్తించారు. మెషీన్లో దూరిన ఎలుకే ఈ పనిచేసిందని భావిస్తున్నారు. దీనిపై టిన్సుకియా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా సోషల్ మీడియాలో ఇది ఫేక్ న్యూస్ అంటూ కొందరు నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. -
ఎలుకలు తినేశాయ్..
స్మగ్లర్ల నుంచి పట్టుకున్న గంజాయిని పోలీసులు ఏం చేస్తారు.. ఏదైనా భద్రత ఉన్న ప్రాంతాల్లో దాచేస్తారు.. అలా గంజాయిని దాచిన అర్జెంటినా పోలీసులకు ఓ రోజు షాక్ తగిలింది. వారు పట్టుకుని దాచిపెట్టిన గంజాయిలో 540 కిలోగ్రాములు మాయమై పోయిందట. దీంతో ఉన్నతాధికారులు చాలా సీరియస్ అయ్యారట. దీంతో వివరాలతో కూడిన నివేదిక సమర్పించాలని ఆదేశించారట. దీంతో అక్కడి పోలీసులు ఏం చెప్పారో తెలుసా.. 540 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయని..! అది కూడా ఆ ఎలుకలు గంజాయికి బానిసైపోయి తిన్నాయని చెప్పారు. దీంతో అవాక్కయిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. 2017 ఏప్రిల్‌లో పైలర్ అనే ఓ పట్టణంలోని జైలులో పర్యవేక్షణ అధికారి జేవియర్ స్పెసియా బదిలీ కావడంతో అక్కడి గంజాయి మాయమైపోయిందనే విషయం వెలుగులోకి వచ్చింది. అయితే చాలా రోజుల పాటు దర్యాప్తు చేసిన అధికారులు అలాంటిదేం లేదని తేల్చేశారు. ఆ పర్యవేక్షణ అధికారి నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని చివరికి నివేదికలో తేల్చేశారు. ఏదో ఎలుకల పేరు చెప్పి తప్పించుకుందామనుకుంటే ఆ అధికారికి అసలుకే ఎసరొచ్చింది. ‘రెండేళ్లుగా అక్కడ గంజాయిని నిల్వ చేసి ఉండటంతో బాగా ఎండిపోయి ఉంది. అయితే అంత మొత్తంలో ఎలుకలు గంజాయిని తిని ఉంటే అవి కచ్చితంగా బతికే అవకాశం లేదు. చనిపోయి ఉండాలి.. అంటే చనిపోయిన ఎలుకలు అక్కడే ఉండాలి. కానీ అవి ఉన్నట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవు’ అని డాక్టర్లు తేల్చారు. -
చిట్టెలుక.. గట్టి ఐడియా!
ఓ చిట్టెలుక.. ఓ రోజు ఉదయాన్నే ఆకలి వేయడంతో వేటకు బయలుదేరింది.. బ్లాక్‌బెర్రీ పళ్లు దాని కళ్లలో పడ్డాయి.. కానీ కొంచెం ఎత్తులో ఉన్నాయి.. అయినా వెనకడుగు వేయలేదు.. అందని బ్లాక్‌బెర్రీ పుల్లన అని అనుకోలేదు.. దాని చిట్టి మెదడుతో గట్టి ఐడియానే వేసింది.. వెనక కాళ్లపై నిటారుగా నుంచొని కొంచెం పైకి ఎగిరి ఆ కొమ్మను అందుకుంది.. అంతే అలా గాలిలో వేలాడుతూనే బెర్రీలను సుష్టుగా లాగించేసింది.. తర్వాత ఎంచక్కా కిందకు దిగి వెళ్లిపోయింది! వియన్నాలోని ఓ శ్మశానంలో కనిపించిన ఈ దృశ్యాలను జులియన్ గెహర్మన్ రాడ్ అనే విద్యార్థి కెమెరాలో బంధించాడు. -
ఎలుకల పని పట్టండిలా..
సిమెంటు, మైదాపిండిలను సమ భాగాలుగా కలిపి పొట్లాలు కట్టి ఎలుకల బొరియల వద్ద ఉంచాలి. వాటిని తిన్న తర్వాత ఎలుకలు నీరు తాగడం వల్ల నోటి భాగాలు పిడుచకట్టుకుపోతాయి. కడుపులో సిమెంట్ గడ్డకడుతుంది. దీంతో ఎలుకలు చనిపోతాయి. బొరియల్లో తడిగడ్డితో నింపిన కుండల ద్వారా పొగబెడితే రంధ్రాల్లో ఉన్న ఎలుకలు చనిపోతాయి. పొలం గట్లపై జిల్లేడు, ఆముదం మొక్కలు పెంచితే ఎలుకలు పొలం గట్లపై బొరియలు పెట్టే అవకాశం ఉండదు. ఐరన్ బుట్టలను అమర్చి ఎలుకలను పట్టుకోవచ్చు. ఎలాస్టిక్ తాళ్లతో పెట్టే బుట్టల ద్వారా కూడా ఎలుకలను నిర్మూలించవచ్చు. ఎకరా పొలంలో సుమారు 20 వరకు బుట్టలు ఉంచాలి. ఈ బుట్టల్లో బియ్యాన్ని ఎరగా వాడాలి. ఇందులోకి ఎలుక రాగానే దీనిలో ఉన్న ఎలాస్టిక్ వల్ల పీక నొక్కకుపోయి మరణిస్తుంది. రసాయనాల ద్వారా.. చాలామంది రైతులు జింక్ ఫాస్ఫైట్ వినియోగిస్తుంటారు. ఈ మందుతో ఒకసారి ఎలుకలను నిర్మూలించినా.. రెండో దఫా మందు పెట్టినప్పడు ఎలుకలు గుర్తించి తప్పించుకుంటాయి. {బోమోడైల్ మందు ద్వారా ఎలుకలను నిర్మూలించవచ్చు. 480 గ్రాముల నూకలకు పది గ్రాముల నూనె పట్టించి మరో 10 గ్రాముల బ్రొమోడైల్ మందు కలిపి ఎరను తయారు చేసుకోవాలి. ఆ ఎరను బొరియల వద్ద ఉంచాలి. దీనిని తిని ఎలుకలు చనిపోతాయి. అయితే పొలంగట్లపై కనిపించిన ప్రతి బొరియ వద్ద ఎర పెట్టడం వల్ల ఫలితం ఉండదు. ముందుగా బొరియలను గుర్తించి వాటిని మట్టితో మూసేయాలి. తర్వాతి రోజు గమనించాలి. తెరుచుకున్న బొరియల్లో ఎలుకలు ఉంటున్నట్లు అర్థం. వాటి వద్ద మందు పెడితే ఉపయోగం ఉంటుంది. వారం తర్వాత మరోసారి ఇలాగే చేయాలి. రైతులు విడివిడిగా ఎలుకలు నివారించేకంటే ఒక ఆయకట్టు రైతులంతా ఒకేసారి ఈ విధానాన్ని అవలంబిస్తే ఎలుకలను శాశ్వతంగా నిర్మూలించే అవకాశం ఉంటుంది. కొబ్బరి చిప్పల్లో పెడితే మేలు.. పంట పొలాల్లో, బొరియల వద్ద పెట్టే మందును కొబ్బరి చిప్పల్లో ఉంచడం ద్వారా రైతులు మరింత ప్రయోజనం పొందవచ్చు. మందు పొట్లాల్లో ఉంచితే వర్షాలకు కరిగిపోవడంతోపాటు కాకులు, పక్షులు తినే అవకాశం ఉంటుంది. కొబ్బరి చిప్పలో మందు ఉంచి పైన మరో చిప్పను ఉంచాలి. చిప్పల మధ్య ఉండే ఖాళీ ప్రదేశం నుంచి ఎలుకలు అందులోకి ప్రవేశించి మందును తింటాయి. పంట పొలాల్లో నీరు ఉన్న ఎత్తులో చిప్పలను కర్రలకు కట్టి ఎరలు ఏర్పాటు చేయాలి. పొలం మధ్యలోకి ఈదుకుంటూ వచ్చే ఎలుకలు చిప్పల్లోకి ప్రవేశించి మందును తిని చనిపోతాయి. -
పంది మూత్రపిండం తయారీ సక్సెస్!
వాషింగ్టన్: కృత్రిమ మూత్రపిండాల ఉత్పత్తి దిశగా కీలక ముందడుగు పడింది. అమెరికా, నార్త్ కరోలినాలోని వేక్ ఫారెస్ట్ బాప్టిస్ట్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు ల్యాబ్‌లో పంది మూత్రపిండాలను తయారు చేయడంలో విజయం సాధించారు. పంది మూత్రపిండాలు కూడా మనిషి కిడ్నీలంత సైజులోనే ఉంటాయి. వాటి పనితీరు కూడా దాదాపుగా ఒకేలా ఉంటుంది. అందుకే తొలుత పంది మూత్రపిండాల తయారీపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. ఇప్పటిదాకా ల్యాబ్‌లో సృష్టించిన మూత్రపిండాలన్నీ ఎలుకలకు ఉండే కిడ్నీల సైజులో మాత్రమే సాధ్యం అయ్యాయి. పైగా రెండు గంటలు పనిచేయగానే వాటిలోని రక్తనాళాలు మూసుకుపోయేవి. ఈ నేపథ్యంలో పరిశోధనలను ముమ్మరం చేసిన వేక్ ఫారెస్ట్ శాస్త్రవేత్తలు.. ఎట్టకేలకు రక్తనాళాలు మూసుకుపోకుండా నాలుగు గంటల పాటు పనిచేసే మూత్రపిండాలను తయారు చేశారు. దీంతో ఇదే పద్ధతిని అనుసరించి మూలకణాలతో మనుషులకు కూడా కిడ్నీలను తయారు చేసేందుకు మార్గం సుగమం అయింది. ఇది పూర్తిస్థాయిలో విజయవంతం అయితే గనక.. కిడ్నీలతో పాటు కాలేయం, క్లోమం వంటి క్లిష్టమైన అవయవాల ఉత్పత్తి కూడా సాధ్యం కానుంది. -
ఎలుకలు.. గొర్రెలంత పెరుగుతాయ్!
లండన్: మనుషులు మూడడుగుల వెంపలి చెట్లకు సైతం నిచ్చెనలు వేసుకుని ఎక్కే రోజు వస్తుందంటూ కాలజ్ఞానాన్ని ప్రస్తావిస్తూ పెద్దలు చెబుతుంటారు. మనుషుల సంగతేమో గానీ.. ఎలుకలు మాత్రం భవిష్యత్తులో కనీసం గొర్రెలంత సైజుకు పెరగడం ఖాయమని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్ శాస్త్రవేత్తలు అంటున్నారు! ఎలుకలు అంత సైజు పెరగడమేంటీ..? అనుకుంటున్నారా? అయితే శాస్త్రవేత్తలు చెబుతున్నదేంటో చూద్దాం.. ఎలుకలు రోడెంట్స్ (వాడి దంతాలు గల క్షీరదాలు) జాతికి చెందినవి. భవిష్యత్తులో పెద్ద సైజులో ఉన్న క్షీరదాలు పెద్ద సంఖ్యలో నశిస్తే గనక.. ఆవరణ వ్యవస్థలో ఒక ఖాళీ ఏర్పడుతుంది. ఆ క్షీరదాలు తీసుకోవాల్సిన ఆహారమంతా మిగిలిపోతుంది. దీంతో ఆ అవకాశాన్ని వినియోగించుకుని, వాటి ఖాళీని ఆక్రమించుకునేందుకు ఎలుకల్లో పరిణామం జరుగుతుంది. క్రమంగా అవి గొర్రెలంత సైజుకూ పెరుగుతాయట. ఈ పరిణామ కథను న మ్మేదెలా అంటారా..? అయితే ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్దాం. రాక్షసబల్లులు అంతరించకముందు ఖడ్గమృగాలు, గుర్రాల వంటి క్షీరదాలు కేవలం ఎలుకలంత సైజు మాత్రమే ఉండేవట. రాక్షసబల్లులు అంతరించాకే అవి పరిణామం చెంది భారీ సైజులకు పెరిగాయట. ఒక ఎద్దు కన్నా పెద్దగా, టన్ను బరువున్న ఓ రోడెంట్ అస్థిపంజరం గతంలో వెలుగుచూసింది. ప్రస్తుతం రోడెంట్లలో అతిపెద్దదైన కాపీబారా 80 కిలోల వరకూ పెరుగుతుంది. ఇవి ఇంకా పెరగొచ్చట. అయితే.. ఈ పరిణామం జరగడానికి వేల ఏళ్లు పడుతుంది కాబట్టి.. మనకు ఇప్పట్లో భారీ ఎలుకలు ఎదురయ్యే ప్రమాదం లేదులెండి!