
చిన్నప్పుడు మన పేరెంట్స్ రాత్రి భోజనాలయ్యాక పసుపు కలిపిన పాలు లేదా బాదం పాలు తాగమని పోరుపెట్టేవారు. ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా? నిద్రపోయే ముందు వేడి పాలు తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. అసలు కారణం ఇదేనట..
పాలల్లో పెప్టైడ్ అనే ప్రొటీన్ హార్మోన్ (సీటీఎచ్) ఒత్తిడిని తగ్గించి, నిద్ర వచ్చేలా ప్రేరేపిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. అమెరికన్ కెమికల్ సొసైటీకి చెందిన అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రి జర్నల్ ప్రచురించిన నివేదిక కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. వేడిపాలల్లో సహజంగా నిద్రకుపక్రమించేలా చేసే ప్రత్యేక పెప్టైడ్‌లను గుర్తించినట్టు ఈ నివేదిక పేర్కొంది. చదవండి: బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారా? ఈ సమస్యలు పొంచి ఉన్నట్లే!!
సీటీఎచ్‌లో నిద్రను పెంచే కారకాలు (లక్షణాలు) ఉన్నట్లు ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో బయటపడింది. ఇతర ఎలుకలతోపోలిస్తే వేడి పాలు తాగిన ఎలుకల్లో 25 శాతం త్వరగా నిద్రపోయినట్టు సైంటిస్టులు గుర్తించారు. అంతేకాకుండా ఎక్కువ సమయం నిద్రపోయాయట కూడా.
చదవండి: టీనేజర్స్ మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా బ్యాడ్ ఎఫెక్ట్..!
కాబట్టి శరీరంతోపాటు, మనసుకు కూడా విశ్రాంతినిచ్చి గాఢనిద్ర పట్టాలంటే.. మీ డిన్నర్ అయిన తర్వాత ఒక గ్లాస్ వెచ్చని పాలను తాగితే చాలు! ఆందోళన (యంటీ యంగ్జైటీ) తగ్గించి, మంచి నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ గుర్తుంచుకోండి.. దీనిని అమలుచేసేముందు మీకేమైనా అనారోగ్య సమస్యలున్నట్లయితే ముందుగా మీ డాక్టర్ సలహాతీసుకోవడం మంచిది.
చదవండి: అప్పుడు కన్నీళ్లు తాగి ఆకలి తీర్చుకున్నాడు.. ఇప్పుడు ఎందరికో ఆసరా..!
Comments
Please login to add a commentAdd a comment