Sleep Health
-
ఒక్కరోజు నిద్రలేకపోతే ఇంత జరుగుతుందా? పరిశోధనలో షాకింగ్ నిజాలు!
ఒత్తిడి, మానసిక సమస్యలు, ఎక్కువగా ఆలోచించడం వంటి ఇతరత్రా కారణాల వల్ల కొంతమందికి రాత్రివేళ త్వరగా నిద్రపట్టదు. ఒక్కోసారి తీరకలేక రోజంతా మెళకువతో ఉండి నిద్రకు దూరమవుతారు. ఇలా ఒక్క రోజు నిద్రలేకపోతే ఏమవుతుందనే విషయంపై శాస్త్రవేత్తలు చేసిన పరోశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. మనిషి ఒక్కరోజు నిద్రకు దూరమైతే మెదడు నిర్మాణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయని ఓ పరిశోధన వెల్లడించింది. మన వయసు 1-2 ఏళ్లు పెరిగనట్లుగా మెదడు వ్యవహరిస్తుందని ఆశ్చర్యకర విషయాన్ని వెల్లడించింది. ఈ పరిశోధనలో తేలిన మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. నిద్ర లేనప్పుడు మెదడులో వచ్చిన మార్పులు, మళ్లీ గాఢంగా నిద్రపోతే యథావిధిగా మారుతాయని వెల్లడైంది. అంటే మనం ఒక రోజు నిద్రపోకపోతే వచ్చిన మార్పులు.. ఆ తర్వాత రోజు బాగా నిద్రపోతే తొలగిపోతాయి. మెదడు తిరిగి సాధారణ స్థితికి వస్తుంది. ఈ పరిశోధనను 'జర్నల్ ఆఫ్ న్యూరో సైన్స్' ఇటీవలే ప్రచురించింది. అయితే రోజుకు కనీసం మూడు, ఐదు, 8 గంటలు నిద్రపోతే మెదడులో ఎలాంటి మార్పులు కన్పించలేదని ఈ పరిశోధన స్పష్టం చేసింది. కానీ తక్కువ నిద్రవల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయనే విషయంపై మాత్రం స్పష్టతనివ్వలేదు. ఈ పరిశోధనలో మొత్తం 134 మంది ఆరోగ్యవంతమైన వలంటీర్లు పాల్గొన్నారు. వీరిలో 42 మంది మహిళలు కాగా.. 92 మంది పురుషులు. వయసు 19-39 ఏళ్ల మధ్య ఉంటుంది. వీరందరినీ ఐదు బ్యాచ్లుగా చేసి ఒకరోజు మొత్తం నిద్రలేకపోతే ఎలా ఉంటుంది? రోజులో మూడు గంటలు, ఐదు గంటలు, 8 గంటలు మాత్రమే పడుకున్నప్పుడు ఎలా ఉంటుందని పరిశోధన జరిపారు. దీనికోసం మెషీన్ లెర్నింగ్ అల్గారిథం ఉపయోగించారు. చదవండి: వారానికి 4 రోజులు.. పని విధానంలో ఇదో కొత్త ట్రెండ్ -
Smart Pillow: నిద్రను కనిపెట్టుకొనే దిండు..
ఈ ఫొటోలో కనిపిస్తున్నది అధునాతనమైన స్మార్ట్ దిండు. దీనిపై తలపెట్టుకుని నిద్రించే వారి నిద్రను ఇది కంటికి రెప్పలా కనిపెట్టుకుని ఉంటుంది. నిద్రకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారికి చక్కని వరప్రసాదం ఈ తలదిండు. అమెరికన్ కెమికల్ సొసైటీ (ఏసీఎస్) పరిశోధకులు ఇటీవల అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ స్మార్ట్ దిండు నమూనాను రూపొందించారు. ఇందులోని ట్రైబో ఎలక్ట్రిక్ నానో జెనరేటర్స్తో పనిచేసే సెన్సర్లు నిద్రను అనుక్షణం కనిపెట్టుకుని ఉంటాయి. నిద్రించేటప్పుడు నిద్రించే వ్యక్తికి సౌకర్యంగా ఉండే భగింమ, గాఢంగా నిద్రించే సమయం వంటివన్నీ క్షుణ్ణంగా ట్రాక్ చేస్తుంది. ఇప్పటి వరకు హెడ్బ్యాండ్స్, రిస్ట్బ్యాండ్స్ వంటి రూపాల్లో అందుబాటులో ఉన్న స్లీప్ ట్రాకర్స్ కంటే ఇది చాలా మెరుగ్గా పనిచేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. -
Sleep tips: వేడి పాలు తాగితే వెంటనే నిద్ర వస్తుంది.. ఎందుకో తెలుసా?
చిన్నప్పుడు మన పేరెంట్స్ రాత్రి భోజనాలయ్యాక పసుపు కలిపిన పాలు లేదా బాదం పాలు తాగమని పోరుపెట్టేవారు. ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా? నిద్రపోయే ముందు వేడి పాలు తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. అసలు కారణం ఇదేనట.. పాలల్లో పెప్టైడ్ అనే ప్రొటీన్ హార్మోన్ (సీటీఎచ్) ఒత్తిడిని తగ్గించి, నిద్ర వచ్చేలా ప్రేరేపిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. అమెరికన్ కెమికల్ సొసైటీకి చెందిన అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రి జర్నల్ ప్రచురించిన నివేదిక కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. వేడిపాలల్లో సహజంగా నిద్రకుపక్రమించేలా చేసే ప్రత్యేక పెప్టైడ్లను గుర్తించినట్టు ఈ నివేదిక పేర్కొంది. చదవండి: బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారా? ఈ సమస్యలు పొంచి ఉన్నట్లే!! సీటీఎచ్లో నిద్రను పెంచే కారకాలు (లక్షణాలు) ఉన్నట్లు ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో బయటపడింది. ఇతర ఎలుకలతోపోలిస్తే వేడి పాలు తాగిన ఎలుకల్లో 25 శాతం త్వరగా నిద్రపోయినట్టు సైంటిస్టులు గుర్తించారు. అంతేకాకుండా ఎక్కువ సమయం నిద్రపోయాయట కూడా. చదవండి: టీనేజర్స్ మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా బ్యాడ్ ఎఫెక్ట్..! కాబట్టి శరీరంతోపాటు, మనసుకు కూడా విశ్రాంతినిచ్చి గాఢనిద్ర పట్టాలంటే.. మీ డిన్నర్ అయిన తర్వాత ఒక గ్లాస్ వెచ్చని పాలను తాగితే చాలు! ఆందోళన (యంటీ యంగ్జైటీ) తగ్గించి, మంచి నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ గుర్తుంచుకోండి.. దీనిని అమలుచేసేముందు మీకేమైనా అనారోగ్య సమస్యలున్నట్లయితే ముందుగా మీ డాక్టర్ సలహాతీసుకోవడం మంచిది. చదవండి: అప్పుడు కన్నీళ్లు తాగి ఆకలి తీర్చుకున్నాడు.. ఇప్పుడు ఎందరికో ఆసరా..! -
ఎవరెవరికి ఎంతెంత నిద్ర అవసరం?
ఎవరెవరికి ఎంతెంత నిద్ర అవసరం? అనేక పరిశోధనలు, అధ్యయనాల ద్వారా ఏయే వయసుల వారికి ఎంతెంత నిద్ర మంచిది అనే విషయాన్ని నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ప్రకటించింది. దాదాపు 18 వేర్వేరు వైద్య విభాగాలకు చెందిన నిపుణుల పరిశోధనలతో వెల్లడైన ప్రకారం... వివిధ వయసుల్లో ఉండేవారికి అవసరమైన నిద్ర వ్యవధి ఇలా... అప్పుడే పుట్టిన పిల్లలు (న్యూబార్న్స్)(0-3 నెలలు) ... 14- 17 గంటలు పసిపిల్లలు (ఇన్ఫ్యాంట్స్)(4-11 నెలల పిల్లలు) ... 12 - 15 గంటలు నిలబడే పిల్లలు (టాడ్లర్స్) (1- 2 ఏళ్లు) ... 11 - 14 గంటలు స్కూల్కు వెళ్లబోయేవారు (ప్రీస్కూల్) (3-5 ఏళ్లు) ... 10 - 13 గంటలు స్కూల్కు వెళ్లే పిల్లలు (స్కూల్ పిల్లలు) (6-13 ఏళ్లు) ... 9 - 11 గంటలు కౌమార బాలలు (టీనేజ్ పిల్లలు) (14 - 17 ఏళ్లు) ... 8 - 10 గంటలు యుక్తవయసు వారు (యంగ్ అడల్ట్స్) (18-25 ఏళ్లు) ... 7 - 9 గంటలు పెద్దవారు (అడల్ట్స్ ) (26 - 64 ఏళ్లు) ... 7 - 9 గంటలు వయసు పైబడ్డ వారు (65 ఏళ్లు పైబడ్డవారు) ... 7-8 గంటలు ఈ రేంజ్కు మించి మరీ ఎక్కువ నిద్రపోతున్నా లేదా మరీ తక్కువ నిద్రపోతున్నా వారిలో ఏదైనా సమస్య ఉందని తెలుసుకోవాలని ఈ అధ్యయనవేత్తలు చెబుతున్నారు. ఈ విషయాలను ‘స్లీప్ హెల్త్’ అనే జర్నల్లో ప్రచురించారు.