ఎవరెవరికి ఎంతెంత నిద్ర అవసరం?
ఎవరెవరికి ఎంతెంత నిద్ర అవసరం?
అనేక పరిశోధనలు, అధ్యయనాల ద్వారా ఏయే వయసుల వారికి ఎంతెంత నిద్ర మంచిది అనే విషయాన్ని నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ప్రకటించింది. దాదాపు 18 వేర్వేరు వైద్య విభాగాలకు చెందిన నిపుణుల పరిశోధనలతో వెల్లడైన ప్రకారం... వివిధ వయసుల్లో ఉండేవారికి అవసరమైన నిద్ర వ్యవధి ఇలా...
అప్పుడే పుట్టిన పిల్లలు (న్యూబార్న్స్)(0-3 నెలలు) ... 14- 17 గంటలు
పసిపిల్లలు (ఇన్‌ఫ్యాంట్స్)(4-11 నెలల పిల్లలు) ... 12 - 15 గంటలు
నిలబడే పిల్లలు (టాడ్లర్స్) (1- 2 ఏళ్లు) ... 11 - 14 గంటలు
స్కూల్‌కు వెళ్లబోయేవారు (ప్రీస్కూల్) (3-5 ఏళ్లు) ... 10 - 13 గంటలు
స్కూల్‌కు వెళ్లే పిల్లలు (స్కూల్ పిల్లలు) (6-13 ఏళ్లు) ... 9 - 11 గంటలు
కౌమార బాలలు (టీనేజ్ పిల్లలు) (14 - 17 ఏళ్లు) ... 8 - 10 గంటలు
యుక్తవయసు వారు (యంగ్ అడల్ట్స్) (18-25 ఏళ్లు) ... 7 - 9 గంటలు
పెద్దవారు (అడల్ట్స్ ) (26 - 64 ఏళ్లు) ... 7 - 9 గంటలు
వయసు పైబడ్డ వారు (65 ఏళ్లు పైబడ్డవారు) ... 7-8 గంటలు
ఈ రేంజ్‌కు మించి మరీ ఎక్కువ నిద్రపోతున్నా లేదా మరీ తక్కువ నిద్రపోతున్నా వారిలో ఏదైనా సమస్య ఉందని తెలుసుకోవాలని ఈ అధ్యయనవేత్తలు చెబుతున్నారు. ఈ విషయాలను ‘స్లీప్ హెల్త్’ అనే జర్నల్‌లో ప్రచురించారు.